అఫీషియల్.. కూలీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. అనౌన్స్ చేసిన ప్రైమ్ వీడియో.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్

Best Web Hosting Provider In India 2024

అఫీషియల్.. కూలీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. అనౌన్స్ చేసిన ప్రైమ్ వీడియో.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్

Hari Prasad S HT Telugu

కూలీ ఓటీటీ రిలీజ్ డేట్ ను గురువారం (సెప్టెంబర్ 4) అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా అనౌన్స్ చేసింది. మరో వారం రోజుల్లో తెలుగు సహా నాలుగు భాషల్లో ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుంది.

అఫీషియల్.. కూలీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. అనౌన్స్ చేసిన ప్రైమ్ వీడియో.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్

కూలీ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. అందరూ ఊహించినట్లే సెప్టెంబర్ 11 నుంచి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని బుధవారం (సెప్టెంబర్ 4) ప్రైమ్ వీడియో తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా అనౌన్స్ చేసింది. దీంతో సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఓటీటీలోకి కూలీ

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ (Coolie) ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఆ లెక్కన నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో సోషల్ మీడియాలో డిజిటల్ ప్రీమియర్ అనౌన్స్‌మెంట్ చేసింది. “దేవా, సైమన్, దహా సాగాతో ఉత్సాహంగా ఉండటానికి సిద్ధంగా ఉండండి. కూలీ సెప్టెంబర్ 11 నుంచి ప్రైమ్ వీడియోలో” అనే క్యాప్షన్ తో ఇటు ఎక్స్, అటు ఇన్‌స్టాగ్రామ్ లో ఆ ఓటీటీ అనౌన్స్ చేసింది.

కూలీ మూవీ ఎలా ఉందంటే?

రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య రిలీజైన యాక్షన్ థ్రిల్లర్ మూవీ కూలీ. ఈ మూవీలో లీడ్ రోల్స్ లో రజనీకాంత్ తోపాటు నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సౌబిన్ షాహిర్, సత్యరాజ్ లాంటి వాళ్లు నటించారు. ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించాడు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు.

ఇందులో సైమన్ అనే విలన్ పాత్రలో నాగార్జున నటించడం విశేషం. భారీ అంచనాల మధ్య రిలీజైనా.. ఇది కూడా రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ రివేంజ్ థ్రిల్లర్ లానే ఉంది. కేవలం రజనీకాంత్ తప్ప ఇందులో కొత్తగా ఏమీ లేదని మొదటి షో నుంచే రివ్యూలు వచ్చాయి.

కూలీ బాక్సాఫీస్ కలెక్షన్లు

దీంతో తొలి రోజే భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా తర్వాతి రోజుల్లో పడిపోయింది. మొత్తంగా 21 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.510 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇండియాలో నెట్ వసూళ్లు రూ.282 కోట్లుగా ఉన్నాయి. ఈ మూవీ తమిళంలో రూ.181 కోట్లు, తెలుగులో రూ.61 కోట్లు, హిందీలో రూ.36 కోట్లు వసూలు చేసింది.

అయితే రజనీకాంత్ కెరీర్లో మరో రూ.500 కోట్ల సినిమాగా మాత్రం నిలిచింది. మరి సెప్టెంబర్ 11 నుంచి ప్రైమ్ వీడియోలోకి అడుగుపెడుతున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024