హైదరాబాద్ ఐటీ కారిడార్లపై టీజీఆర్టీసీ ఫోకస్ – త్వరలోనే మరో 275 ఎలక్ట్రిక్ బస్సులు

Best Web Hosting Provider In India 2024

హైదరాబాద్ ఐటీ కారిడార్లపై టీజీఆర్టీసీ ఫోకస్ – త్వరలోనే మరో 275 ఎలక్ట్రిక్ బస్సులు

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ లో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే 275 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.ఐటీ సంస్థలకు అద్దెకు కూడా ఆర్టీసీ బస్సులు ఇస్తున్నామని చెప్పారు.

త్వరలోనే 275 ఎలక్ట్రిక్ బస్సులు

హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ప్రజా రవాణా సేవలను మరింతగా విస్తరించనున్నారు. ఇందుకోసం మరికొన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇదే విషయంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే మరో 275 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఐటీ కారిడార్ లో 200 ఎలక్ట్రిక్ బస్సులు సేవలందిస్తున్నాయని గుర్తు చేశారు.

ఇటీవలే హైద‌రాబాద్ హైటెక్ సిటీలోని టెక్ మ‌హీంద్ర క్యాంప‌స్‌లో ర‌వాణా సౌక‌ర్యాల క‌ల్ప‌న‌పై సాఫ్ట్వేర్ కంపెనీల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఇందులో మాట్లాడిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్… ఐటీ కారిడార్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగుల రవాణా అవసరాలకు అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఉద్యోగులకు క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఐటీ కంపెనీలకు అద్దెకు బస్సులను ఇచ్చే సదుపాయాన్ని కల్పించామని వెల్లడించారు. ఎలక్ట్రిక్ బస్సులతో పాటు మెట్రో డీలక్స్ బస్సులను అద్దెకు ఇస్తున్నామని, ఐటీ సంస్థలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ప్రైవేట్ వాహనాల వినియోగం వల్ల ఐటీ కారిడార్ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని సజ్జనార్ వ్యాఖ్యానించారు. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవడం ఒక్కటే ట్రాఫిక్ నివారణకు ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. ప్రజా రవాణాను ఉపయోగించడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని వివరించారు.

రవాణా వ్యవస్థను ప్రోత్సహించండి – సజ్జనార్

ప్రతి ఐటీ సంస్థ కూడా ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పిలుపునిచ్చారు. ఉద్యోగులకు ఆ దిశగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకునే ఉద్యోగులకు ప్రోత్సహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఈ సమావేశంలో ఐటీ కారిడార్ లో అందిస్తోన్న రవాణా సేవలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించారు.

ఐటీ కారిడార్ లో మెరుగైన రవాణా సేవల కోసం పలు ఐటీ సంస్థల ప్రతినిధులు సలహాలు, సూచనలు ఇవ్వగా.. వాటిని పరిగణలోకి తీసుకుంటామని ఆర్టీసీ ఉన్నతాధికారులు వారికి హామీ ఇచ్చారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

TsrtcTravelHyderabadElectric Bus
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024