




Best Web Hosting Provider In India 2024

బిగ్ బాస్ తెలుగు 9లో జబర్దస్త్ బ్యూటీ- ఇద్దరు హీరోయిన్లు, కమెడియన్స్- కంటెస్టెంట్ ఫైనల్ లిస్ట్ ఇదే! మీకు ఎంతమంది తెలుసు?
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఇద్దరు హీరోయిన్లు ఉండటం విశేషంగా మారింది.
మళ్లీ బుల్లితెరపై బిగ్ బాస్ తెలుగు టీవీ రియాలిటీ షో సందడి చేయనుంది. సెప్టెంబర్ 7 నుంచి అంటే మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ప్రారంభం కానుంది. స్టార్ మా ఛానెల్‌లో ఆదివారం సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ 9 తెలుగు టీవీ ప్రీమియర్ కానుంది.
అగ్ని పరీక్ష అంటూ
బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ నుంచి హోస్ట్‌గా నిర్వహిస్తున్న టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ఈ సీజన్‌కు కూడా వ్యాఖ్యాతగా ఉండనున్నాడు. అయితే, ఇదివరకు ఎప్పుడు లేనంతగా చాలా డిఫరెంట్‌గా బిగ్ బాస్ షో ప్రారంభానికి ముందే అగ్ని పరీక్ష అంటూ కామనర్స్‌ను కంటెస్టెంట్స్‌గా సెలెక్ట్ చేసే ప్రక్రియ మొదలు పెట్టిన విషయం తెలిసిందే.
టాప్ 6 కామనర్స్
45 మందితో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు అగ్ని పరీక్ష ఇప్పుడు టాప్ 6కి చేరుకుంది. టాప్ 6లో దివ్య, ప్రసన్న, పవన్, శ్రేయ, అనుష, శ్వేత కామనర్స్ ఉన్నారు. వీరిలో ఇద్దరు లేదా ఐదుగురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లో అడుగుపెట్టనున్నారు. ఇక మరోవైపు సెలబ్రిటీల కంటెస్టెంట్స్ 99.9 శాతం కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.
కంటెస్టెంట్స్‌గా సెలబ్రిటీలు
బిగ్ బాస్ తెలుగు 9లో పాల్గొనే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. వారిలో జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి ఉన్నట్లు టాక్. బిగ్ బాస్ తెలుగులో ఎప్పుడో పాల్గొనాల్సిన ఈ ముద్దుగుమ్మ ఈ 9వ సీజన్‌లో అందాలతో సందడి చేయనుందని తెలుస్తోంది.
సీరియల్ బ్యూటి
అలాగే, జబర్దస్త్ ద్వారా కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఇమ్మాన్యూయేల్ కూడా బిగ్ బాస్ 9 తెలుగులో కంటెస్టెంట్‌గా రానున్నాడట. బొంబాయికి రాను సాంగ్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న రాము రాథోడ్, ఫోక్ సింగర్ నాగ దర్గ, సీరియల్ నటుడు భరణి శంకర్, ముద్ద మందారం సీరియల్ బ్యూటి తనూజ గౌడ కూడా ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.
కాంట్రవర్సీ కొరియోగ్రాఫర్
వీరితోపాటు ఇటీవల కాంట్రవర్సీకి గురైన లేడి కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ కూడా బిగ్ బాస్ తెలుగు 9లో పాల్గొననుందట. జానీ మాస్టర్ లైంగిక వేధించాడంటూ శ్రేష్టి వర్మ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇద్దరు బ్యూటిఫుల్ టాలీవుడ్ హీరోయిన్స్ కూడా బిగ్ బాస్ తెలుగు 9లో గ్లామర్‌తో అట్రాక్ట్ చేయనున్నారు.
ఓటీటీ వెబ్ సిరీసులతో
ప్రభాస్ బుజ్జిగాడు హీరోయిన్ సంజన గల్రానీ, వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్ ఆశా సైనీ ఇద్దరు బిగ్ బాస్ తెలుగు 9లోకి కంటెస్టెంట్స్‌గా రానున్నట్లు సమాచారం. ఆశా సైని ఫ్లోరా సైనీ పేరుతో బాలీవుడ్‌లో ఓటీటీ వెబ్ సిరీస్‌లతో సందడి చేస్తోంది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగులోకి ఆశా సైనీ రావడం మరింత విశేషంగా మారింది.
పది మంది సెలబ్రిటీలు
ఇలా కామనర్స్ గ్రూప్ పక్కన పెడితే సెలబ్రిటీల నుంచి పది మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లోకి అడుగుపెట్టనున్నారని సమాచారం. మరి వీరిలో మీకు ఎంతమంది గుర్తు ఉన్నారో ఓసారి చెక్ చేసుకోండి.
సంబంధిత కథనం
టాపిక్