దుల్క‌ర్ స‌ల్మాన్‌పై కాసుల వ‌ర్షం.. రూ.100 కోట్ల క్ల‌బ్‌లో లోకా.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మ‌ల‌యాళ సూప‌ర్ హీరో మూవీ

Best Web Hosting Provider In India 2024

దుల్క‌ర్ స‌ల్మాన్‌పై కాసుల వ‌ర్షం.. రూ.100 కోట్ల క్ల‌బ్‌లో లోకా.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మ‌ల‌యాళ సూప‌ర్ హీరో మూవీ

దుల్కర్ సల్మాన్ నిర్మించిన లోకా చాప్టర్ 1 చంద్ర బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటుతోంది. అద్భుతమైన రెస్పాన్స్ తో ఈ మలయాళ సూపర్ హీరో మూవీ కోట్ల రూపాయాలు కొల్లగొడుతోంది. 7 రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది.

లోకా కలెక్షన్లు

కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన సూపర్ హీరో సినిమా ‘లోకా చాప్టర్ 1: చంద్ర’ థియేటర్లలో అదరగొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రారంభంలోనే మంచి స్టార్ట్ ఇచ్చిన ఈ మలయాళ యాక్షన్ సినిమా వీక్ డేస్ లో కూడా అద్భుతంగా రాణించింది. దీంతో ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.105.50 కోట్ల వసూళ్లు సాధించింది.

లోకా ఇండియాలో ఇలా

ఆగస్టు 28న లోకా చాప్టర్ 1 మూవీ థియేటర్లలో రిలీజైంది. దీనికి స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసర్. మలయాళ తొలి ఫీమేల్ సూపర్ హీరో మూవీ ఇది. ఏడో రోజు ముగిసే సరికి ఈ సినిమా ఇండియాలో రూ.46 కోట్ల నెట్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. దేశీయ గ్రాస్ కలెక్షన్లు రూ.53.50 కోట్లుగా ఉన్నాయి. మొదటి సోమవారం కలెక్షన్లలో కేవలం 28% తగ్గుదల మాత్రమే నమోదు కాగా, మంగళవారం ఆశ్చర్యకరంగా 6% పెరుగుదల కనిపించింది. బుధవారం కేవలం 12% తగ్గుదలతో పెద్ద ఎదురుదెబ్బ తప్పించుకుంది.

లోకా రూ.100 కోట్లు

విదేశాల్లోనూ లోకా చాప్టర్ 1 అద్భుతంగా రాణిస్తోంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్, యుఎస్ లో బలమైన ప్రదర్శనల ద్వారా దీనికి మరింత ఊపు లభించింది. ట్రేడ్ అంచనాల ప్రకారం లోకా చాప్టర్ 1 విదేశాల్లో $6 మిలియన్లు (రూ.52 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. దీంతో ఏడు రోజుల తర్వాత దాని ప్రపంచవ్యాప్త వసూళ్లు రూ.105.50 కోట్లకు చేరుకున్నాయి. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన లోకా అదిరే కలెక్షన్లు రాబడుతుంది.

ఆ సినిమాలను దాటి

లోకా చాప్టర్ 1 దక్షిణాది సూపర్ హిట్లను ఓడించింది. ప్రపంచవ్యాప్త బాక్స్ ఆఫీస్ వద్ద లోకా చాప్టర్ 1 నేరు (రూ.86 కోట్లు), భీష్మ పర్వం (రూ.89 కోట్లు), గురువాయూర్ అంబలనడయిల్ (రూ.90 కోట్లు) వంటి అనేక మలయాళ హిట్ చిత్రాల లైఫ్ టైమ్ కలెక్షన్లను అధిగమించింది. అలాగే కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ చిత్రం ప్రస్తుతం అత్యధిక వసూళ్లు సాధించిన ఫీమేల్ లీడ్ దక్షిణాది చిత్రం కూడా నిలిచింది. కీర్తి సురేష్ నటించిన మహానటి (రూ.85 కోట్లు), అనుష్క శెట్టి నటించిన అరుంధతి (రూ.69 కోట్లు) బాక్స్ ఆఫీస్ వసూళ్లను దాటేసింది.

లోకా చాప్టర్ 1 గురించి

డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించి, దుల్కర్ సల్మాన్ నిర్మించిన సినిమా లోకా చాప్టర్ 1. దుల్కర్ వేఫరర్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇది ఫస్ట్ పార్ట్. ఈ చిత్రంలో నాస్లెన్, సాండీ, అరుణ్ కురియన్, చందు సాలిమ్కుమార్, నిశాంత్ సాగర్, రాఘునాథ్ పాలేరి, విజయరాఘవన్, నిత్య శ్రీ మరియు శరత్ సభా కూడా నటించారు. ఈ చిత్రం విమర్శకుల నుండి సర్వత్రా ప్రశంసలు అందుకుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024