




Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి సూపర్ హిట్ కన్నడ రూరల్ యాక్షన్ డ్రామా.. ఐఎండీబీలో 8.9 రేటింగ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
సూపర్ హిట్ కన్నడ రూరల్ యాక్షన్ డ్రామా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఐఎండీబీలో ఏకంగా 8.9 రేటింగ్ సొంతం చేసుకున్న సినిమా ఇది. మరికొన్ని గంటల్లోనే ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కు రాబోతోంది.
కన్నడ సూపర్ హిట్ యాక్షన్ డ్రామా కోత్తలవాడి (Kothalavadi) డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఆగస్టు 1న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకులు ఈ సినిమాకు ఐఎండీబీలో 8.9 రేటింగ్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది.
కోత్తలవాడి ఓటీటీ రిలీజ్ డేట్
కోత్తలవాడి ఓ కన్నడ రూరల్ యాక్షన్ డ్రామా. ఈ సినిమా థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత శుక్రవారం (సెప్టెంబర్ 5) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మధ్యే ఈ మూవీ డైరెక్టర్ పుష్ప అరుణ్‌కుమార్ ఈ సినిమా ఐదు భాషల హక్కులను ప్రైమ్ వీడియోకి ఇచ్చినట్లు వెల్లడించాడు.
దీంతో ఇప్పుడీ కోత్తలవాడి కన్నడతోపాటు తెలుగు, మలయాళం, తమిళం, హిందీల్లోనూ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాకు థియేటర్లలో పాజిటివ్ రివ్యూలు వచ్చిన నేపథ్యంలో ఓటీటీలో మరింత మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.
కోత్తలవాడి మూవీ గురించి..
కోత్తలవాడి సినిమాలో పృథ్వీ అంబర్, గోపాలకృష్ణ దేశ్‌పాండేలతోపాటు కావ్య శైవ, రాజేష్ నటరంగాలాంటి వాళ్లు కూడా నటించారు. ఈ రూరల్ యాక్షన్ డ్రామా కోత్తలవాడి అనే ఊరి చుట్టూ తిరుగుతుంది. అక్కడి ఓ అవినీతి వ్యక్తి గ్రామస్థులను అక్రమ ఇసుక తవ్వకాలకు పురిగొల్పుతాడు. అయితే ఈ క్రమంలో వారి మధ్య ఆధిపత్య పోరు మొదలవుతుంది.
అలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామస్థులు ఏం చేశారన్నది ఈ కోత్తలవాడి సినిమా కథ. ఈ మూవీకి మొదటి షో నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దాదాపు ప్రతి వెబ్ సైట్ కనీసం 3 స్టార్ రేటింగ్ ఇచ్చింది. అంతేకాదు అటు ప్రేక్షకులు కూడా ఐఎండీబీలో 8.9 రేటింగ్ ఇవ్వడం విశేషం. 2 గంటల 44 నిమిషాల నిడివితో వచ్చిన ఈ సినిమాలో లీడ్ రోల్స్ నటనకు కూడా ప్రశంసలు దక్కాయి.
ఈ సినిమాను డైరెక్ట్ చేసిన పుష్ప అరుణ్‌కుమార్ కు ఇదే తొలి మూవీ. అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. మరి ఈ సినిమాకు ప్రైమ్ వీడియోలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మరికొన్ని గంటల్లోనే సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుంది.
సంబంధిత కథనం