




Best Web Hosting Provider In India 2024

ఓయూ దూర విద్యలో ఎంబీఏ, ఎంసీఏ అడ్మిషన్లు – అప్లికేషన్ల గడువు పొడిగింపు, చివరి తేదీ ఇదే
ఓయూ దూర విద్యలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ గడువును అధికారులు పొడిగించారు. ఇందుకు సెప్టెంబర్ 20వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. రూ.500 అపరాధ రుసుముతో 25వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
ఉస్మానియా యూనివర్శిటీలో(PGRRCDE) దూర విద్యలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువును అధికారులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన అభ్యర్థులు… సెప్టెంబర్ 20వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా 2025 – 2026 విద్యా సంవత్సరానికి గాను ఎంబీఏ, ఎంసీసీఏ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఆన్ లైన్ ద్వారానే అప్లయ్ చేసుకోవాలి. ఇక రూ. 500 ఫైన్ తో సెప్టెంబర్ 25వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తాజా ప్రకటనలో పేర్కొన్నారు.
ఎంట్రెన్స్ పరీక్ష తేదీ ఇదే…
సెప్టెంబర్ 28వ తేదీన ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహిస్తారు. ఐసెట్ – 2025లో క్వాలిఫై అయిన వారు ఈ ఎంట్రెన్స్ రాయాల్సిన అవసరం లేదు. వీరికి నేరుగానే అడ్మిషన్లు కల్పించనున్నారు.
ఈ కోర్సులకు దరఖాస్తు చేసకునే అభ్యర్థులు డిగ్రీ పాసై ఉండాలి. ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు అయితే డిగ్రీలో 50 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది. ఇక ఎంసీఏలో చేరాలనుకునేవాళ్లు అయితే డిగ్రీలో మ్యాథ్స్ చదివి ఉండాలి.
ఎంట్రెన్స్ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. 90 నిమిషాల సమయం ఉంటుంది. దరఖాస్తు ఫీజును రూ. 900గా నిర్ణయంచారు.అర్హులైన అభ్యర్థులు http://www.ouadmissions.com లేదా www.osmania.ac.in. వెబ్ సైట్ లోకి అప్లయ్ చేసుకోవాలి.
డిగ్రీ, పీజీ ప్రవేశాలు :
ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు కూడా కొనసాగుతున్నాయి.2025 – 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫేజ్ 1 కింద అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా… తాజాగా అధికారులు గడువును పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 15 వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని సూచించారు.
ఈ లింక్ పై క్లిక్ చేసి ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు ఆన్ లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు
సంబంధిత కథనం
టాపిక్