





Best Web Hosting Provider In India 2024

అంతా తమనే చేశాడు.. అతని వల్లే రిలీజ్ వాయిదా.. అఖండ 2 రిలీజ్ ఎప్పుడో చెప్పిన బాలకృష్ణ
అఖండ 2 కొత్త రిలీజ్ ఎప్పుడో చెప్పాడు బాలకృష్ణ. నిజానికి ఈ నెల 25నే రిలీజ్ కావాల్సి ఉన్నా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వల్ల రిలీజ్ వాయిదా పడినట్లు కూడా అతడు వెల్లడించాడు. ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
అఖండ 2 మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సి ఉన్నా.. వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ చెప్పడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఇప్పుడు వాళ్లకు బాలకృష్ణ ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. అఖండ 2 ఎప్పుడు వస్తుందో రివీల్ చేశాడు.
డిసెంబర్ తొలి వారంలో అఖండ 2
గురువారం (సెప్టెంబర్ 4) బాలకృష్ణ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అఖండ 2 మూవీ రిలీజ్ పై స్పందించాడు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వల్ల మూవీ రిలీజ్ వాయిదా పడినట్లు వెల్లడించాడు. “అఖండ 2 త్వరలోనే వస్తోంది. సెప్టెంబర్ 25న కాదు. డిసెంబర్ తొలి వారంలో వస్తుంది.
తమన్ కు కాస్త ఎక్కువ సమయం కావాల్సి వచ్చింది. అఖండ సమయంలోనే ఆ మ్యూజిక్ కు వూఫర్లు బద్ధలైపోయాయి. ఇక ఇప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆ సినిమా కంటే రెట్టింపు కాదు 50 రెట్లు ఎక్కువ ఉండబోతోంది. సినిమా బాగా రావాలన్నదే ఉద్దేశం. అందుకే రిలీజ్ వాయిదా పడింది” అని బాలకృష్ణ చెప్పాడు.
అఖండ 2 ఓటీటీ హక్కులు
బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ డీల్ పై లేటెస్ట్ బజ్ వైరల్ గా మారింది. ఈ మూవీ ఓటీటీ హక్కులకు రికార్డు రేటు పలికినట్లు తెలిసింది. బోయపాటి శ్రీను-నందమూరి బాలకృష్ణ కాంబో అంటే ఉండే క్రేజే వేరు.
సింహాతో మొదలు ఈ ఇద్దరు కలిసి బాక్సాఫీస్ ఊచకోత కొనసాగిస్తున్నారు. లెజెండ్, అఖండతో అది మరో లెవల్ కు చేరింది. ఇప్పుడు అఖండ 2తో థియేటర్లను షేక్ చేసేందుకు వస్తున్నారు. ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ తో పాటు ఓటీటీ రైట్స్ కోసం కూడా ఫుల్ డిమాండ్ నెలకొంది.
అఖండ 2 సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ దక్కించుకుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో లాంటి దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ లను వెనక్కినెట్టి మరీ జియోహాట్‌స్టార్ హక్కులు సొంతం చేసుకుంది. అందుకు ఏకంగా రూ.85 కోట్లకు డీల్ చేసుకున్నట్లు సమాచారం. అన్ని భాషల్లో కలిపి అఖండ 2 ఓటీటీ రైట్స్ కోసం జియోహాట్‌స్టార్ రూ.85 కోట్లు చెల్లిస్తుందని ట్రేడ్ నివేదికలు చెబుతున్నాయి.
అఖండ 2 ఓటీటీ రైట్స్ కు రికార్డు స్థాయిలో రూ.85 కోట్లు పలికాయి. ఇది నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే హైయ్యస్ట్. అఖండ సినిమా బ్లాక్ బస్టర కావడం, అఖండ 2పై అంచనాలు పెరిగిపోవడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. ఓటీటీ రైట్స్ కు భారీ రేటు చెల్లించేందుకు రెడీ అయిన జియోహాట్‌స్టార్ ఓ కండీషన్ పెట్టినట్లు తెలిసింది.
సంబంధిత కథనం