రెండేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి వస్తున్న తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ.. చనిపోయిన ముసలావిడ చెవి దుద్దులు మిస్సింగ్ కేసు

Best Web Hosting Provider In India 2024

రెండేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి వస్తున్న తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ.. చనిపోయిన ముసలావిడ చెవి దుద్దులు మిస్సింగ్ కేసు

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి ఓ తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఈ సినిమా రెండో ఓటీటీలోకి అడుగు పెడుతుండటం విశేషం. చనిపోయిన ఓ ముసలావిడ మిస్సయిన చెవిదుద్దుల చుట్టూ తిరిగే స్టోరీ ఇది.

రెండేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి వస్తున్న తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ.. చనిపోయిన ముసలావిడ చెవి దుద్దులు మిస్సింగ్ కేసు

ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చిన తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ మారీశన్ తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు అలాంటిదే మరో తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. నిజానికి ఇప్పటికే ఓ ఓటీటీలో ఉన్న ఈ సినిమా.. రెండేళ్ల తర్వాత రెండో ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

తందట్టి ఓటీటీ రిలీజ్ డేట్

ఈ తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ పేరు తందట్టి (Thandatti). ఈ సినిమా ఇప్పటికే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీలోకి కూడా రానుంది. శుక్రవారం (సెప్టెంబర్ 5) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ ఓటీటీ తెలిపింది.

“ఓ తెలివైన కథ, లోతైన ఎమోషన్స్, మీరు ఊహించని ఓ ట్విస్ట్. తందట్టి రేపటి నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ఈ విషయం వెల్లడించింది.

తందట్టి మూవీ గురించి..

తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ తందట్టి జూన్, 2023లో రిలీజైంది. ఇదొక డిఫరెంట్ స్టోరీతో వచ్చిన సినిమా. రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్న ఓ కానిస్టేబుల్ కు ఓ క్లిష్టమైన కేసు తగులుకుంటుంది. అది ఓ చనిపోయిన ముసలావిడ చెవి దుద్దులు కనిపించకుండాపోయిన కేసు. ఈ సినిమాను రామ్ సంగయ్య డైరెక్ట్ చేశాడు. పశుపతి, రోహిణి, వివేక్ ప్రసన్న, అమ్ము అభిరామిలాంటి వాళ్లు నటించారు.

కానిస్టేబుల్ వీర సుబ్రమణి పాత్రలో పశుపతి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ థియేటర్లలో రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఐఎండీబీలో 6.7 రేటింగ్ నమోదైంది. ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీలోకి కూడా రాబోతోంది.

ఇక ఈ మధ్యే తమిళ కామెడీ థ్రిల్లర్ అయిన మారీశన్ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. వడివేలు, ఫహాద్ ఫాజిల్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కావడంతోపాటు ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. ఇప్పుడు అలాంటిదే మరో సినిమా వస్తుండటంతో వీకెండ్ అభిమానులకు మంచి టైంపాస్ కానుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024