





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలో దంచికొడుతున్న అనుష్క మూవీ.. ఒక్క రోజులోనే ట్రెండింగ్ నంబర్ వన్.. స్మగ్లింగ్ స్టోరీతో రివేంజ్ థ్రిల్లర్
ఓటీటీలో అనుష్క లేటెస్ట్ మూవీ ఘాటి అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఒక్క రోజులోనే ట్రెండింగ్ లోకి దూసుకెళ్లింది. ఇండియాలో నంబర్ వన్ మూవీగా ట్రెండ్ అవుతోంది ఈ రివేంజ్ థ్రిల్లర్.
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి లేటెస్ట్ క్రైమ్ రివేంజ్ థ్రిల్లర్ ఘాటి ఓటీటీలో అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఒక్క రోజులోనే ఈ సినిమా ట్రెండింగ్ నంబర్ వన్ ప్లేస్ కు దూసుకెళ్లింది. గంజాయి స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో సాగే ఈ మూవీలో ఘాటిల కోసం పోరాడే క్యారెక్టర్ లో హీరోయిన్ అనుష్క నటించింది.
ఓటీటీ ట్రెండింగ్ ఘాటి
అనుష్క కొత్త మూవీ ఘాటి ఓటీటీలో సత్తాచాటుతోంది. ఈ రివేంజ్ థ్రిల్లర్ ఓటీటీ ట్రెండింగ్ నంబర్ వన్ లోకి దూసుకొచ్చింది. ఘాటి సినిమా శుక్రవారం (సెప్టెంబర్ 26)న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఇప్పుడు ఒక్క రోజులోనే అంటే శనివారం ప్రైమ్ వీడియో ఇండియన్ నంబర్ వన్ మూవీగా ఘాటి ట్రెండ్ అవుతోంది.
ఓటీటీ నాలుగు భాషల్లో
ఘాటి మూవీ నిన్న ఓటీటీలోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాకు క్రిష్ జాగర్లముడి డైరెక్టర్. థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే ఘాటి డిజిటల్ స్ట్రీమింగ్ కు రావడం గమనార్హం.
గంజాయి స్మగ్లింగ్
గంజాయి స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఘాటిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కానీ థియేటర్లలో మాత్రం మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఆడియన్స్ ను ఏ మాత్రం థియేటర్లకు రప్పించలేపోయింది. అట్టర్ ప్లాఫ్ అయింది. సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఈ సినిమా దెబ్బకు అనుష్క శెట్టి కొన్ని రోజులు సోషల్ మీడియా కు దూరంగా ఉంటానని ప్రకటించింది.
ఘాటి కథ
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని కఠినమైన తూర్పు కనుమల నేపథ్యంలో సాగే గంజాయి స్మగ్లింగ్ నెట్ వర్క్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది ఘాటి. క్రూరమైన నాయుడు సోదరులు నడిపే ఈ అక్రమ వ్యాపారం, స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లోకి బలవంతంగా ఇరుక్కున్న ‘ఘాటీల’ జీవితాలను ఈ సినిమాలో చూపించారు. శీలవతి (అనుష్క), దేశి రాజు (విక్రమ్ ప్రభు) తమ ప్రజలను ఈ దోపిడీ చక్రం నుండి విముక్తి చేయాలని కలలు కంటారు.
కుంధుల్ నాయుడు (చైతన్య రావు మదాడి), కాస్తాల నాయుడు (రవీంద్ర విజయ్) నేతృత్వంలోని క్రూరమైన సిండికేట్‌కు వ్యతిరేకంగా శీలవతి, దేశి రాజు నిలబడతారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? గంజాయి సిండికేట్ కు వ్యతిరేకంగా శీలవతి ఎలాంటి పోరాటం చేసిందన్నదే ఘాటి కథ.
సంబంధిత కథనం
