ఓటీటీలోకి సరికొత్త తమిళ థ్రిల్లర్- తెలుగులోనూ స్ట్రీమింగ్- వర్చువల్, రియాలిటీకి తేడా మారితే- ఎక్కడ చూడాలంటే?

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి సరికొత్త తమిళ థ్రిల్లర్- తెలుగులోనూ స్ట్రీమింగ్- వర్చువల్, రియాలిటీకి తేడా మారితే- ఎక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి సరికొత్తగా తమిళ థ్రిల్లర్ గేమ్ యు నెవర్ ప్లే ఎలోన్ స్ట్రీమింగ్ కానుంది. జెర్సీ, డాకు మహారాజ్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ వర్చువల్, రియాలిటీ ప్రపంచాల మధ్య తేడా మారితే వంటి కథతో తెరకెక్కింది. గేమ్ యు నెవర్ ప్లే ఎలోన్ ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఎక్కడో తెలుసుకుందాం.

ఓటీటీలోకి సరికొత్త తమిళ థ్రిల్లర్- తెలుగులోనూ స్ట్రీమింగ్- వర్చువల్, రియాలిటీకి తేడా మారితే- ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలోకి ఎన్నో రకాల కంటెంట్ వస్తూ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంటాయి. అలా ఓటీటీలోకి సరికొత్త థ్రిల్లర్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అదే గేమ్: యు నెవర్ ప్లే ఎలోన్. తమిళంలో తెరకెక్కిన ఈ సిరీస్ తెలుగులో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

జెర్సీ హీరోయిన్ ప్రధాన పాత్ర

గేమ్ యు నెవర్ ప్లే ఎలోన్ ఓటీటీ సిరీస్‌లో జెర్సీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్, సంతోష్ ప్రతాప్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కు రాజేష్ ఎం సెల్వ దర్శకత్వం వహించారు. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గేమ్ యు నెవర్ ప్లే ఎలోన్ సిరీస్‌ను నిర్మించారు.

వర్చువల్ గేమ్ ఆడుతున్నప్పుడు

నిజానికి ఫన్ కోసం ఆటలు ఆడాలి. కానీ, అదే ఆట ఆడుతుంటే నిజ జీవితంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు సరికొత్త తమిళ థ్రిల్లర్ సిరీస్ ట్రైలర్ చూస్తుంటే కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది. వర్చువల్ గేమ్ ఆడుతున్నప్పుడు నిజ జీవితంలో దానివల్ల సంఘటన చోటు చేసుకున్నట్టుగా ఈ థ్రిల్లర్ ట్రైలర్ కనిపిస్తోంది.

రియల్ లైఫ్‌లో

వర్చువల్, రియాలిటీ ప్రపంచాల మధ్య తేడా మారి గేమ్‌లో ఆడినట్లుగా రియల్ లైఫ్‌లో సంఘటనలు చోటు చేసుకుంటే ఎలా ఉంటుందో చెప్పేలా గేమ్ యు నెవర్ ప్లే ఎలోన్ సిరీస్ తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది. ఇలాంటి సరికొత్త కాన్సెప్ట్‌తో గేమ్ యు నెవర్ ప్లే ఎలోన్ ఓటీటీ రిలీజ్ కానుంది.

గేమ్ యు నెవర్ ప్లే ఎలోన్ ఓటీటీ రిలీజ్

నెట్‌ఫ్లిక్స్‌లో గేమ్ యు నెవర్ ప్లే ఎలోన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, ఇతర భాషల్లో అక్టోబర్ 2న నెట్‌ఫ్లిక్స్‌లో గేమ్ యు నెవర్ ప్లే ఎలోన్ ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ సిరీస్‌లో శ్రద్ధా శ్రీనాథ్, సంతోష్ ప్రతాప్‌తోపాటు చాందిని, శ్యామ హరిణి, బాల హసన్, సుబాష్ సెల్వం, వివియా సంత్, ధీరజ్, హేమ ఇతర కీలక పాత్రలు పోషించారు.

సున్నితమైన గీతను

గేమ్ యు నెవర్ ప్లే ఎలోన్ ఓటీటీ రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ రాజేష్ ఎం సెల్వ మాట్లాడుతూ.. “ది గేమ్‌తో, మేము సృష్టించే ప్రపంచాలు, మనం జీవించే జీవితాల మధ్య సున్నితమైన గీతను అన్వేషించాలనుకున్నాను. ఈ సిరీస్ ఫ్యామిలీ డ్రామా, కాంప్లికేటెడ్ రిలేషన్స్‌తో కూడిన ఓ థ్రిల్లర్” అని అన్నారు.

కేవలం వర్చువల్‌గా మిగలదు

“హైపర్-కనెక్టెడ్ యుగంలో, ఏదీ కేవలం వర్చువల్‌గా మిగలదు. తెరపై జరిగే విషయం వాస్తవంలోకి చొచ్చుకొస్తుంది.. నియంత్రించలేని పరిణామాలతో. ప్రతి మాస్క్ వెనుక ఒక సత్యం దాగి ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌తో నా మొదటి తమిళ ఒరిజినల్‌గా నా విజన్ జీవం పోసుకోవడం అత్యంత ఆనందకరమైన అనుభవం” అని డైరెక్టర్ రాజేష్ ఎం సెల్వ తెలిపారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024