




Best Web Hosting Provider In India 2024

అయ్యో… ఎంత విషాదం…! వేడి వేడి పాల గిన్నెలో పడి చిన్నారి మృతి – గురుకులంలో ఘటన
అనంతపురం జిల్లాలోని ఓ గురుకులంలో అనుకోని విషాద ఘటన చోటు చేసుకుంది. వంట గదిలో ఉంచిన వేడి వేడి పాల గిన్నెలో పడి 16 నెలల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం జిల్లా కొర్రపాడు గ్రామంలోని గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. వేడి చేసి ఉంచిన పాల గిన్నెలో పడి 16 నెలల బాలిక మృతి చెందింది. సెప్టెంబర్ 20వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వేడి వేడి పాల గిన్నెలో పడి…
ప్రాథమిక వివరాల ప్రకారం…. కొర్రపాడు బాలికల గురుకుల పాఠశాలలో కృష్ణవేణి మహిళా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. ఆమెకు అక్షిత అనే 16 నెలల పాప ఉంది. అయితే గత శనివారం కృష్ణవేణి పాఠశాలలోని వంటగదిలో టీ తాగడానికి వెళ్లింది. తల్లిని అనుసరిస్తూనే ఆ చిన్నారి కూడా వెళ్లింది. అయితే ఈ విషయాన్ని తల్లి గమనించలేదు. అప్పటికే గదిలో 20 లీటర్ల పాలను వేడి చేసి ఓ పెద్ద పాత్రలో ఉంచారు.
ఈ క్రమంలోనే వంటగదిలోకి వెళ్లిన చిన్నారి… ప్రమాదవశాత్తు పాల గిన్నెలో పడింది. వెంటనే గుర్తించిన తల్లి బయటకు తీసినా అప్పటికే 70 శాతం గాయాలయ్యాయి. వెంటనే చికిత్సకోసం అనంతపురం తరలించారు. మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది.
ఈ ఘటనపై అనంతపురం రూరల్ డీఎస్పీ టి.వెంకటేసులు స్పందించారు. తీవ్రమైన కాలిన గాయాలతో బాధపడిన చిన్నారిని మొదట స్థానిక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) లో చికిత్స అందించారని తెలిపారు. ఆ తర్వాత కర్నూలులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారని వివరించారు. మూడు రోజులు చికిత్స పొందినప్పటికీ సెప్టెంబర్ 23న చిన్నారి మృతి చెందిందని తెలిపారు. ఈ ఘటన బీఎన్ఎస్ సెక్షన్ 194 కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
సంబంధిత కథనం
టాపిక్
