క్యూటీ అంటూ భార్య స్నేహా రెడ్డికి అల్లు అర్జున్ బర్త్‌డే విషెస్.. వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సెలబ్రిటీ కపుల్

Best Web Hosting Provider In India 2024

క్యూటీ అంటూ భార్య స్నేహా రెడ్డికి అల్లు అర్జున్ బర్త్‌డే విషెస్.. వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సెలబ్రిటీ కపుల్

Hari Prasad S HT Telugu

అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. తన భార్య అల్లు స్నేహారెడ్డికి క్యూటీ అంటూ అతడు చెప్పిన బర్త్ డే విషెస్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. హ్యాపీ బర్త్ డే వదిన అంటూ ఫ్యాన్స్ కూడా ఆమెకు విషెస్ చెబుతున్నారు.

క్యూటీ అంటూ భార్య స్నేహా రెడ్డికి అల్లు అర్జున్ బర్త్‌డే విషెస్.. వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సెలబ్రిటీ కపుల్

అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి సోమవారం (సెప్టెంబర్ 29) తన పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ ద్వారా బర్త్ డే విషెస్ చెప్పాడు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను కూడా షేర్ చేశాడు. ఈ ఫొటోలు, అతడు చెప్పిన విషెస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఒకేలాంటి డ్రెస్సులో అర్జున్, స్నేహ

అల్లు అర్జున్ తను, స్నేహా ఒకేలాంటి మోనోక్రోమ్ డ్రెస్సులలో టూరిస్ట్‌ల లాగా పోజులిచ్చిన రెండు ఫొటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బ్లాక్ జాకెట్స్, సన్‌గ్లాసెస్, టీ-షర్ట్స్ ప్యాంట్స్‌లో ఉన్న ఈ జంట నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చింది. ఆ ఫొటోలను బన్నీ షేర్ చేస్తూ.. “హ్యాపీ బర్త్‌డే క్యూటీ” అని రాయడం విశేషం.

ఈ పోస్ట్ కు అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్, నటి అయిన లక్ష్మీ మంచు కూడా “హ్యాపీ బర్త్‌డే లవ్” అని కామెంట్ చేసింది. చాలామంది ఫ్యాన్స్ కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అర్జున్ తన ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అయిన ‘బన్నీ బాయ్ ప్రైవేట్’ నుంచి పంపిన శుభాకాంక్షలను కూడా స్నేహా రీ-షేర్ చేసింది. అతడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సూట్‌లో ఉన్న స్నేహా ఒక మోనోక్రోమ్ ఫొటోను పోస్ట్ చేసి ఆమెను ‘క్యూటీ’ అని పిలిచాడు. అలాగే ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు తీసిన ఆమె ఒక కాండిడ్ మూమెంట్ ఫొటోను కూడా షేర్ చేశాడు.

అల్లు అర్జున్.. స్నేహా రెడ్డిని మార్చి 6, 2011న హైదరాబాద్‌లో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. వీరికి అయాన్ అనే కొడుకు, అర్హ అనే కూతురు ఉన్నారు. అర్హ 2023లో సమంత రుత్ ప్రభు, దేవ్ మోహన్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘శాకుంతలం’ సినిమాతో టాలీవుడ్‌లో డెబ్యూ ఇచ్చింది. ఆమె అందులో ప్రిన్స్ భరత పాత్ర పోషించింది.

అల్లు అర్జున్ మూవీస్

అల్లు అర్జున్ చివరిగా పుష్ప 2లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. దంగల్, బాహుబలి 2 తర్వాత మూడో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది. ప్రస్తుతం అతడు అట్లీ డైరెక్షన్‌లో సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఇంకా పేరు పెట్టని ఒక ప్రాజెక్ట్ కోసం షూటింగ్ చేస్తున్నాడు.

ఇది ఒక సై-ఫి సినిమాగా ప్రచారం అవుతోంది. ఇందులో దీపికా పదుకోన్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. పుష్ప సినిమాల ద్వారా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున తర్వాతి ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. మొత్తం ఇండియాలోనే ఆసక్తి నెలకొంది. షారుక్ ఖాన్ తో జవాన్ లాంటి హిట్ ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ తో అట్లీ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024