కాంగ్రెస్ బాకీ కార్డు స్థానిక సంస్థల ఎన్నికల్లో మన బ్రహ్మాస్త్రం : హరీశ్ రావు

Best Web Hosting Provider In India 2024

కాంగ్రెస్ బాకీ కార్డు స్థానిక సంస్థల ఎన్నికల్లో మన బ్రహ్మాస్త్రం : హరీశ్ రావు

Anand Sai HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Anand Sai HT Telugu

కాంగ్రెస్ అబద్ధపు హామీలతో నమ్మించి ప్రజల గొంతు కోసిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి గ్యారంటీలకు టాటా చెప్పిండని, లంకె బిందెలకు వేటపట్టిండని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ బాకీ కార్డు

శం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేశారు. రాష్ట్రంలో ఏ పల్లెకు వెళ్లినా గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయని విమర్శించారు. ఓ దిక్కు రోడ్లు వేయకుండా ఫ్యూచర్ సిటీకి ఆరులేన్ల రహదారికి శంకుస్థాపన చేశారన్నారు. ఆరు గ్యారంటీలకు టాటా చెప్పి.. విలువైన భూములను విక్రయిస్తూ.. లంకె బిందెల వేట సాగిస్తున్నారని విమర్శించారు.

‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలవుతున్నా.. ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదు. మాటిమాటీకి మహిళలను కోటీశ్వరలను చేస్తానంటూ మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోని వర్గం లేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ రైతుకు రూ.75 వేలు, ప్రతీ మహిళకు 44 వేలు కాంగ్రెస్ బాకీ పడింది. కాంగ్రెస్ బాకీ కార్డుతో ఎండగడతాం. రానున్న రోజుల్లో బాకీ కార్డే కాంగ్రెస్‌కు ఉరితాడు కానుంది. ఈ బాకీ కార్డు లోకల్ బాడీ ఎన్నికల్లో మన బ్రహ్మాస్త్రం.’ అని హరీశ్ రావు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడింది? ఒక్కొక్క మహిళకు ఎంత బాకీ పడింది? ఒక్కొక్క రైతుకు ఎంత బాకీ పడింది? ఒక్కొక్క ఇంటికి ఎంత బాకీ పడ్డదో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నామన్నారు. రేపు సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి ఇంటికి బాకీ కార్డు పంపిణీ చేయాలని హరీశ్ రావు చెప్పారు. అందరూ కలిసి ప్రతీ ఇంటికి వెళ్లి.. బాకీ కార్డుని అందజేసి కాంగ్రెస్ పార్టీ ఎంత బాకీ పడిందో చెప్పాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే.. కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని సూచించారు.

200 ఉన్న పెన్షన్‌ కేసీఆర్ 2000 చేశారని, కాంగ్రెస్ 4000 పెన్షన్ ఇస్తానని ఈరోజుకు ప్రస్తావన లేదన్నారు హరీశ్ రావు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సంతకం పెట్టి గ్యారంటీ పేపర్లను పంచారని పేర్కొన్నారు. 100 రోజుల్లో ఇస్తామని చెప్పి.. 700 రోజులైనా.. హామీ నెరవేర్చలేదన్నారు. మెుదటి క్యాబినెట్‌లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తామని, 30 కేబినెట్ సమావేశాలనే ఆ ఊసే లేదన్నారు.

‘యూరియా బస్తాలు ఇచ్చే తెలివి లేదు. కానీ ఊరుకో మద్యం దుకాణం పెడతాడట. తాగుబోతుల తెలంగాణ చేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి. కనీసం కల్యాణ లక్ష్మీ చెక్కుల పైసలు లేవు. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అని చెప్పారు. ఒక్క విద్యార్థికైనా ఇచ్చారా? నమ్మించి ఏమార్చి గోంతు కోశాడు రేవంత్ రెడ్డి. నీళ్ల విషయంలో అబద్ధాలు, నియామకాల విషయంలో అబద్ధాలు, నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే.’ అని హరీశ్ రావు విమర్శించారు.

Anand Sai

eMail
ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

CongressBrsRevanth ReddyCm Revanth Reddy
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024