జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : తుది ఓటర్ల జాబితా విడుదల – ఏ క్షణంలోనైనా ఎలక్షన్ షెడ్యూల్…..!

Best Web Hosting Provider In India 2024

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : తుది ఓటర్ల జాబితా విడుదల – ఏ క్షణంలోనైనా ఎలక్షన్ షెడ్యూల్…..!

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి ఈసీ కసరత్తు కొనసాగుతోంది. తాజాగా తుది ఓటర్ల జాబితా విడుదలైంది. నియోజకవర్గంలో మొత్తం 3,98,982 ఓటర్లుగా ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక – ఓటర్ల తుది జాబితా విడుదల (image source tsec.gov.in/getInfo.)

త్వరలోనే జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నికలు జరగనున్నాయి. మాగంటి గోపినాథ్ మృతితో ఈ స్థానానికి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏ క్షణమైనా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం…. తాజాగా తుది ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది.

మొత్తం ఓటర్లు ఎంతంటే..?

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో మొత్తం 3,98,982 మంది ఓటర్లు ఉన్నారు. సవరణల తర్వాత జాబితాలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది. 6,106 మంది యువ ఓటర్లు (18–19 సంవత్సరాలు), 2,613 మంది వృద్ధులు (80 ఏళ్లు పైబడిన వారు), 1,891 మంది దివ్యాంగులు ఉన్నారు. మొత్తం 139 కేంద్రాల్లో 409 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈసీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

ఏ క్షణమైనా షెడ్యూల్…!

తుది ఓటర్ల జాబితా ఖరారు అయిన నేపథ్యంలో ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అన్ని కుదిరితే ఈ వారంలోనే ఈ ప్రకటన రావొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఈసీ కూడా కసరత్తు పూర్తి చేయటంతో…. షెడ్యూల్ విడుదలైతే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి.. నామినేషన్లను స్వీకరిస్తారు. ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియను చేపడుతారు.

ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోలింగ్​ శాతం 47.49 నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా 3 పర్యాయాలు విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో మాగంటి 80,549 ఓట్లు సాధించగా… సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజాహరుద్దీన్​కు 64,212 ఓట్లు దక్కిన సంగతి తెలిసిందే.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsJubilee HillsJubilee Hills By ElectionTrending TelanganaState Election Commission
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024