





Best Web Hosting Provider In India 2024

బిగ్ బాస్ 9 తెలుగు: ఈ వారం నామినేషన్లలో ఆరుగురు.. సెలబ్రిటీలు ముగ్గురు.. డేంజర్ జోన్లో హరీష్, శ్రీజ.. టాప్ లో హీరోయిన్
బిగ్ బాస్ 9 తెలుగు ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. నాలుగో వారం నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ రణరంగంగా మార్చాడు. టాస్క్ లు పెట్టి, గెలిచిన వాళ్లకు నామినేషన్ చేసే అవకాశమిచ్చాడు. ఈ వారం ఆరుగురు నామినేట్ అయ్యారు.
తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 నుంచి మరొకరు ఎలిమినేట్ కావడానికి రంగం సిద్ధమవుతోంది. నాలుగో వారం నామినేషన్లలో ఆరుగురున్నారు. ఇందులో ముగ్గురు కామనర్లు, ముగ్గురు సెలబ్రిటీలు. ఈ వారం నామినేషన్ ప్రక్రియను డిఫరెంట్ గా నిర్వహించాడు బిగ్ బాస్. కెప్టెన్ పవన్ కు పవర్స్ ఇచ్చి, కంటెస్టెంట్లతో ఇమ్యూనిటీ కోసం టాస్క్ లు నిర్వహించాడు.
బిగ్ బాస్ 9 నామినేషన్
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతోంది. నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. చివరకు ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. సెలబ్రిటీల్లో సంజన గల్రానీ, ఫ్లోరా సైనీ, రీతు చౌదరి నామినేట్ అయ్యారు. కామనర్స్ లో శ్రీజ, దివ్య నిఖిత, హరిత హరీష్ నామినేషన్స్ లో ఉన్నారు. మరి ఇందులో నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.
బిగ్ బాస్ 9 ఎలిమినేషన్
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ నాలుగో వారం ఎలిమినేషన్ ఇంట్రెస్టింగ్ గా మారింది. డేంజర్ జోన్లో కామనర్స్ ఉన్నారు. ఇందులో హరిత హరీష్, శ్రీజకు ఓట్లు చాలా తక్కువగా వస్తున్నాయి. తాజా రిజల్ట్ ప్రకారం హరీష్, శ్రీజ లాస్ట్ రెండు ప్లేస్ ల్లో ఉన్నారు.
బిగ్ బాస్ ఓటింగ్
నాలుగో వారం నామినేషన్లలో ఉన్న సంజన గల్రానీ, ఫ్లోరా సైనీ, రీతు చౌదరి, దివ్య నిఖిత, హరీష్, శ్రీజ కోసం అభిమానులు ఓట్లు వేస్తున్నారు. అయితే ఇందులో హరీష్ 13.16 ఓటింగ్ శాతంతో అయిదో స్థానంలో ఉన్నాడు. 11.88 శాతంతో శ్రీజ లాస్ట్ ప్లేస్ లో కొనసాగుతుంది. ఇప్పటికైతే వీళ్లే లాస్ట్ పొజిషన్స్ లో ఉన్నారు. మరి ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా? లేదా వీళ్ల పొజిషన్స్ ఏమైనా మారతాయా? చూడాలి.
టాప్ లో సంజన
బిగ్ బాస్ 9 తెలుగులో గత వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ స్జేజీ దాకా వెళ్లి రిటర్న్ వచ్చిన సంజన గల్రానీ ఈ వారం నామినేట్ అయింది. ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం చూస్తే ఆమె టాప్ ప్లేస్ లో ఉంది. ఆమెకు 24.19 శాతం ఓట్లు పడ్డాయి. ఇక ఫ్లోరా సైనీ 18.1 శాతం ఓట్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది.
గత వారం వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన దివ్య నిఖితకు కూడా ఓట్లు బాగానే పడుతున్నాయి. రీతు చౌదరి (14.85 శాతం) కంటే ఎక్కువగా దివ్య (17.82 శాతం)కు ఓటింగ్ శాతముంది.
సంబంధిత కథనం
టాపిక్
