




Best Web Hosting Provider In India 2024

వామ్మో ఇదేం డ్రైవింగ్‌రా బాబు.. పల్నాడులో స్కూటర్‌ను ఢీ కొట్టి 3 కి.మీ లాక్కెళ్లిన బోలెరో.. వీడియో!
పల్నాడు జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. ఓ బోలెరో వాహనం స్కూటర్‌ను ఢీకొట్టి.. సుమారు మూడు కిలోమీటర్లు లాక్కెళ్లింది.
ఏపీలోని పల్నాడు జిల్లాలో గూస్‌బంప్స్ తెప్పించేలా భయంకరంగా ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. బోలెరో వాహనం స్కూటర్‌ను ఢీకొట్టి సుమారు 3 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లింది. దీనికి సంబంధించిన దృశ్యాలను స్థానికులు రికార్డ్ చేశారు. వీడియో సో,ల్ మీడియాలో బాగా వైరల్ అయింది. స్కూటర్‌ను ఢీకొట్టిన తర్వాత కూడా డ్రైవర్ ఆపకుండా వెళ్తూనే ఉన్నాడు. స్థానికులు వెంటపడి వాహనాన్ని ఆపారు.
ఈ ఘటన పిడుగురాళ్ల సమీపంలోని బ్రాహ్మణపల్లి దగ్గర బైపాస్ రోడ్డు మీద జరిగింది. బోలెరో వాహనం స్కూటర్‌ను ఢీకొట్టి.. మూడు కిలో మీటర్లు లాక్కెళ్లే వీడియోలో నిప్పులు వచ్చాయి. బోలెరో నడిపే వ్యక్తి మద్యం తాగినట్టుగా గుర్తించారు. వాహనం చాలా స్పీడ్‌గా వస్తూ.. స్కూటర్‌ను ఢీ కొట్టింది. దీంతో స్కూటర్ కాస్త బోలెరో టైర్‌కు ఇరుక్కుపోయింది. బోలెరో వెళ్లే స్పీడుకు స్కూటర్ రోడ్డుకు రాసుకుంటూ నిప్పులు వచ్చాయి.
బోలెరోను ఆపేందుకు స్థానికులు చాలా కష్టపడాల్సి వచ్చింది. వాహనం వెంట పడ్డారు. డ్రైవర్ ఆపకుండా వెళ్లాడు. చివరకు ఎలాగోలా ఆపేశారు. స్కూటర్ యజమానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
2023లో దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.73 లక్షలకు పైగా ప్రజలు మరణించగా, 4.47 లక్షల మంది గాయపడ్డారని తాజాగా నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ నివేదిక విడుదల చేసింది. బాధితుల్లో దాదాపు 46 శాతం మంది ద్విచక్ర వాహనదారులు అని నివేదిక తెలిపింది. అతి వేగం, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం రోడ్డు ప్రమాదాలకు రెండు ప్రధాన కారణాలుగా తేలింది.
2023లో దేశంలో 4,64,029 రోడ్డు ప్రమాదాలు జరిగాయి, 2022 కంటే 17,261 ఎక్కువ. మరణాలలో 1.6 శాతం పెరుగుదల ఉంది, 2022లో మరణాల సంఖ్యం 1,71,100 నుండి 2023లో 1,73,826కి పెరిగింది.
95,984 కేసులు (20.7 శాతం) సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య నమోదయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్య, మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య జరిగిన ప్రమాదాలు వరుసగా 17.3 శాతం (80,482 కేసులు), 15 శాతం (69,397 కేసులు)గా ఉన్నాయి.
టాపిక్
