





Best Web Hosting Provider In India 2024

సమాజాన్ని ప్రతిబింబించే భావోద్వేగ చిత్రం.. సాయి దుర్గ తేజ్ రిపబ్లిక్‌కు నాలుగేళ్లు.. ఈ 2 ఓటీటీల్లో చూడొచ్చు!
సాయి దుర్గ తేజ్ నటించిన సినిమాల్లో రిపబ్లిక్ మూవీ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది. దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిజమైన సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. కుళ్లిపోయిన సమాజాన్ని బాగుపరచాలనే కంకణం కట్టుకున్న ఐఏఎస్ అధికారికి ఏం జరిగిందనేదే ఈ సినిమా కథ. రిపబ్లిక్‌ను ఈ 2 ఓటీటీల్లో చూడొచ్చు.
సాయి దుర్గ తేజ్ అకా సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమాల్లో రిపబ్లిక్ మూవీకి ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ మూవీ నిజమైన సమాజాన్ని, ప్రజల పోకడను ప్రతిబింబిస్తుంది. కుళ్లిపోయిన సమాజాన్ని బాగుపరచాలనే కోరుకున్న ఓ ఐఏఎస్ అధికారికి ఏం జరిగిందనేదే ఈ సినిమా కథ.
దేవా కట్టా దర్శకత్వంలో
నాలుగు సంవత్సరాల క్రితం ‘రిపబ్లిక్’ మూవీ వచ్చి అందరిలోనూ ఎన్నో ఆలోచనల్ని రేకెత్తించింది. దేవా కట్టా దర్శకత్వంలో వచ్చిన రిపబ్లిక్ మూవీని రాజకీయాలు, అవినీతి, సమాజంలోని అసమానతల నేపథ్యంలో తెరకెక్కించారు. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు.. సమాజాన్ని ప్రతిబింబించే భావోద్వేగ చిత్రం.
నాలుగేళ్లు పూర్తి
నటుడిగా సాయి దుర్గ తేజ్ స్థానాన్ని సుస్థిరం చేసిన చిత్రంగా ‘రిపబ్లిక్’ నిలుస్తుంది. వ్యవస్థాగతంగా కుళ్లిపోయిన సమాజంలో విధి నిర్వహణలో ఉన్న ఐఏఎస్ అధికారిగా సాయి దుర్గ తేజ్ అసమానమైన నటనను కనబర్చారు. ‘రిపబ్లిక్’ మూవీ వచ్చి నాలుగేళ్లు అవుతోంది.
యాక్సిడెంట్ అవడం
‘రిపబ్లిక్’ విడుదలకు కొన్ని వారాల ముందు, సాయి దుర్గ తేజ్ ప్రమాదానికి గురి అవ్వడం, ప్రమోషన్స్‌కి అందుబాటులో లేకపోవడం, క్లిష్టకాలంలో విడుదలైన ఈ చిత్రం అందరి ప్రశంసల్ని అందుకుంది. ఈ సినిమాలో సంక్రాంతికి వస్తున్నాం భాగ్యం ఐశ్వర్య రాజేష్, పాగల్ బ్యూటీ నివేతా పేతురాజ్ ఇద్దరు హీరోయిన్స్‌గా నటించారు.
రెండు ఓటీటీల్లో
జగపతి బాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, ఆమని తదితరులు కీలక పాత్రలు పోషించిన రిపబ్లిక్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా రెండు ఓటీటీల్లో రిపబ్లిక్ మూవీని చూసేయొచ్చు. అమెజాన్ ప్రైమ్ అండ్ జీ5 ఓటీటీల్లో రిపబ్లిక్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
అమెజాన్ ప్రైమ్‌లో అలా
అయితే, అమెజాన్ ప్రైమ్‌లో రూ. 99 చెల్లించి చూసేలా రెంటల్ విధానంలో రిపబ్లిక్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కాన, జీ5లో మాత్రం సబ్‌స్క్రిప్షన్ ఉంటే ఎలాంటి రుసుము లేకుండా రిపబ్లిక్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇప్పటికీ చూడనివాళ్లు ఉంటే రిపబ్లిక్ మూవీపై లుక్కేయొచ్చు.
విరూపాక్ష-బ్రో
ఇదిలా ఉంటే, రిపబ్లిక్ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ అనంతరం సాయి దుర్గ తేజ్ నటించిన సినిమా విరూపాక్ష. ఏప్రిల్ 2023న విడుదలైన విరూపాక్ష అతని కెరీర్‌లో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ మూవీ రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసి ఓ చరిత్రగా సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో నిల్చింది.
సంబరాల ఏటి గట్టు మూవీతో
అనంతరం ‘బ్రో’ మూవీతో తన గురువు, ఆరాధ్యుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుని సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
సంబంధిత కథనం
