




Best Web Hosting Provider In India 2024

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత – ఈ నెల 4న అంత్యక్రియలు
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి బుధవారం కన్నుమూశారు.అక్టోబర్ 4న సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. దామోదర్ రెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు, పలు పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కన్నుమూత
కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. బుధవారం రాత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
2004 నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లోఐటీ మంత్రిగా పనిచేశారు. సూర్యాపేట, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు. దామోదర్ రెడ్డి పార్థివదేహాన్ని ఇవాళ సూర్యాపేటకు తీసుకెళ్లి ప్రజల సందర్శనార్థం ఉంచాపు.
అంతిమ నివాళులు అర్పించేందుకు వీలుగా ఆయన అంత్యక్రియలు అక్టోబర్ 4న సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో జరుగుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. దామోదర్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఇతర నేతలు సంతాపం తెలిపారు.
రాజకీయ ప్రస్థానం వివరాలు…
- ఖమ్మం జిల్లా పాతలింగాల గ్రామానికి చెందిన రాంరెడ్డి నారాయణరెడ్డి, కమలమ్మ దంపతులకు 1952 సెప్టెంబరు 14న రాంరెడ్డి దామోదర్‌రెడ్డి జన్మించారు.
- తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1985 నుంచి 2009 వరకు ఐదుసార్లు పోటీ చేశారు. ఒక్కసారి ఓడిపోగా… 4 సార్లు గెలిచారు.
- 1994లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
- 2004లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక సూర్యాపేట నియోజకవర్గం నుంచి 2009లో కూడా గెలిచారు.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కేబినెట్ లో ఐటీశాఖ మంత్రిగా పనిచేశారు.
- 2014, 2018, 2023 కాంగ్రెస్ పార్టీ తరపున సూర్యాపేట నియోజకవర్గంలో నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.
- ఆయన సోదరుడైన రాంరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉండేవారు. ఆయన కూడా 2009 నుంచి 14 వరకు మంత్రిగా పని చేశారు. ఆయన కూడా అనారోగ్యంతో 2016లో కన్నుమూశారు.
సంబంధిత కథనం
టాపిక్
Telangana NewsCongressNalgondaSuryapet
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
