




Best Web Hosting Provider In India 2024

నల్గొండ జిల్లాలో పండగపూట విషాదం – వాగులో మునిగి ముగ్గురు మృతి
నల్లగొండ జిల్లాలోని చందంపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. డిండివాగులో మునిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిని తెనాలికి చెందిన గోపీ, సాయికాంత్,రాము గా గుర్తించారు.
దసరా పండగ కోసమని బంధువుల ఇంటికి వచ్చారు. అయితే సరదాగా పక్కన ఉన్న వాగులోకి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు 9 ఏళ్ల బాలుడు వాగులో మునిగిపోయాడు. ఇతడిని కాపాడేందుకు యత్నించిన మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలోని చందంపేట మండలంలో జరిగింది.
ప్రాథమిక వివరాల ప్రకారం…ఈ ఘటన చందంపేట మండలం దేవరచర్లలో చోటు చేసుకుంది. డిండివాగులోకి వెళ్లగా… ముగ్గురు మృతి చెందారు. ముందుగా 9 ఏళ్ల ఉమాకాంత్ మునిగిపోగా… ఇతడిని కాపాడేందుకు రాము(30), భరత్ కుమార్ (21) ప్రయత్నించారు. వీరు కూడా వాగులో కొట్టుకునిపోయి.. ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు…స్థానికలు సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. ఆంధ్రప్రదేశ్ లోని తెనాలికి చెందిన వాసులుగా గుర్తించారు. దసరా పండగ కోసం బంధువుల ఇంటికి వచ్చినట్లు తెలిసింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
సంతోషంగా పండగ జరుపుకునే వేళ… ఈ ముగ్గురు ప్రాణాలు కోల్పోవటంతో కుటుంబంలోనే కాకుండా రెండు గ్రామాల్లోనూ విషాదం నెలకొంది. కుటుంబ సబ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సంబంధిత కథనం
టాపిక్
