థియేటర్లలో కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల కేక.. దసరా విన్నర్ గా రిషబ్ శెట్టి మూవీ.. థ్రిల్లర్ కు ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?

Best Web Hosting Provider In India 2024

థియేటర్లలో కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల కేక.. దసరా విన్నర్ గా రిషబ్ శెట్టి మూవీ.. థ్రిల్లర్ కు ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?

కాంతార చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 1: సూపర్ హిట్ మూవీ కాంతారకు ప్రీక్వెల్ గా వచ్చిన కాంతార చాప్టర్ 1 థియేటర్లలో కేక పెట్టిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ డే రికార్డు కలెక్షన్లు సొంతం చేసుకుంది.

కాంతార చాప్టర్ 1 పోస్టర్

కాంతార చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 1: ఎన్నో అడ్డంకులు దాటుకొని కాంతార చాప్టర్ 1 గురువారం (అక్టోబర్ 2) థియేటర్లలోకి వచ్చేసింది. 2022లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కాంతారకు ఇది ప్రీక్వెల్. రిషబ్ శెట్టి హీరోగా చేయడంతో పాటు దర్శకత్వం వహించిన ఈ ఫోక్ థ్రిల్లర్ కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో రిలీజైంది. ఫస్ట్ డే కాంతార 2 అదిరే కలెక్షన్లు రాబట్టింది.

కాంతార చాప్టర్ 1

ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం కాంతార చాప్టర్ 1 తొలి రోజు ఇండియాలో రూ.60 కోట్ల కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. భారతదేశంలో అన్ని భాషల్లో కలిపి 4 లక్షలకు పైగా కాంతార చాప్టర్ 1 టిక్కెట్లు అమ్ముడయ్యాయని ట్రాకర్ నివేదించింది. ఈ చిత్రం మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్‌ల పరంగా బలమైన ట్రెండ్‌లను చూపించింది. ఇది అడ్వాన్స్ టిక్కెట్ విక్రయం ద్వారా దేశవ్యాప్తంగా రూ.13.07 కోట్లు వసూలు చేసింది.

కన్నడ వర్షన్

విడుదలకి ఒక రోజు ముందు కాంతార చాప్టర్ 1 సినిమాకు సంబంధించి 12,511 షోలలో మొత్తం 4.75 లక్షల (4,75,785) టిక్కెట్లు అమ్ముడయ్యాయి. కన్నడ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లలో రూ.7.88 కోట్లతో, 2,28,947 టిక్కెట్లతో అగ్రస్థానంలో ఉంది. తరువాత హిందీ 2D రూ.2.10 కోట్లతో, 69,512 టిక్కెట్లు, తెలుగు రూ.1.31 కోట్లతో, 68,938 టిక్కెట్లు ఉన్నాయి. తమిళ, మలయాళ వెర్షన్‌లు వరుసగా రూ.74.67 లక్షలు, రూ. 1కోట్లు వసూలు చేశాయి.

దసరా రికార్డు

దసరా సందర్భంగా రిలీజైన కాంతార చాప్టర్ 1 రికార్డు కలెక్షన్లు సాధించింది. దసరా రిలీజ్ లలో పెద్ద సినిమాల కలెక్షన్లను దాటేసింది. రజనీకాంత్ మూవీ వెట్టయన్ (2024లో రూ.31.7 కోట్లు), నాని మూవీ దసరా (2023లో రూ.23.3 కోట్లు, చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్ (2022లో రూ.20.3 కోట్లు), మహేష్ బాబు స్పైడర్ (2017లో రూ.25 కోట్లు) సినిమాల ఫస్ట్ డే కలెక్షన్లను కాంతార చాప్టర్ 1 దాటేసింది.

కాంతార కలెక్షన్లు

2022లో వచ్చిన కాంతార మూవీ కర్ణాటకలో ఫస్ట్ డే రూ.1.95 కోట్లు మాత్రమే రాబట్టింది. ఆ తర్వాత మౌత్ టాక్ తో ఆ సినిమా అదరగొట్టింది. ఇప్పుడు కాంతార ప్రీక్వెల్ మాత్రం తొలి రోజే రూ.60 కోట్లు కొల్లగొట్టింది.

దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్ల నుండి అనేక విజువల్స్ ఆన్‌లైన్‌లో కనిపించాయి. బెంగళూరు నుండి వచ్చిన విజువల్స్‌లో ఒక సినిమా హాల్ ను పువ్వులు, అలంకరణలు, సినిమా పోస్టర్‌లతో అలంకరించారు. ఇలా దసరా రోజు కాంతార చాప్టర్ 1 వైబ్ కనిపించింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024