





Best Web Hosting Provider In India 2024

అప్పుడు ఒక్క షో కోసం కాళ్లు పట్టుకున్నా.. ఇప్పుడు కాంతార చాప్టర్ 1 సినిమా 5 వేల ప్లస్ హౌస్ ఫుల్ షోలు: రిషబ్ శెట్టి
గురువారం థియేటర్లలో రిలీజైన కాంతార చాప్టర్ 1 మూవీ అదరగొడుతోంది. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ దక్కాయి. దీంతో ఈ చిత్ర హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి గ్రేట్ ఫుల్ గా ఫీలవుతున్నాడు. ఎక్స్ లో అతను పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.
భారీ అంచనాల మధ్య రిలీజైన కాంతార చాప్టర్ 1ను అదిరే ఓపెనింగ్స్ దక్కాయి. గురువారం (అక్టోబర్ 2) రిలీజైన ఈ సినిమా తొలి రోజు ఇండియాలోనే రూ.60 కోట్లు కొల్లగొట్టింది. ఈ భారీ ఓపెనింగ్స్ పై కాంతార చాప్టర్ 1లో హీరోగా చేయడంతో పాటు రచన, దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి రియాక్టయ్యాడు. అతను ఎక్స్ లో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.
అప్పుడు ఒక్క షో
కాంతార చాప్టర్ 1కి రచన, దర్శకత్వం వహించి, నటించిన నటుడు రిషబ్ శెట్టి చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో రిషబ్ దాదాపు ఒక దశాబ్దం క్రితం తన సినిమాకు ఒక సాయంత్రం షో పొందడానికి కూడా కష్టపడిన రోజులను గుర్తు చేసుకున్నాడు. రిషబ్ సినిమా కాంతార చాప్టర్ 1 గురువారం థియేటర్లలో విడుదలైంది. కాంతార చాప్టర్ 1 బలమైన ఓపెనింగ్‌కు రిషబ్ శెట్టి కృతజ్ఞతా నోటు రాశాడు.
రిషబ్ శెట్టి పోస్టు
“2016లో ఒక సాయంత్రం షో కోసం కష్టపడటం నుండి 2025లో 5000+ హౌస్‌ఫుల్ షోల వరకు. ఈ ప్రయాణానికి కారణం మీ ప్రేమ, మద్దతు, దేవుడి దయ తప్ప మరేమీ కాదు. ఇది సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ కృతజ్ఞుడను. (ఎరుపు గుండె ఎమోజి)” అని 2016లో చేసిన ట్వీట్ ను రీషేర్ చేస్తూ పోస్టు చేశాడు రిషబ్ శెట్టి.
2016లో రిషబ్ శెట్టి పెట్టిన ట్వీట్‌లో, “చేతులు, కాళ్ళు పట్టుకుని వేడుకున్న తర్వాత రేపటి నుండి నా సినిమా కోసం మంగళూరులోని బిగ్ సినిమాస్‌లో ఒక సాయంత్రం షో దొరికింది. ఆసక్తి ఉన్నవారు చూడగలరు” అని ఉంది. రిషబ్ ఆ సినిమా పేరు చెప్పలేదు. అయితే అతని దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం క్రైమ్ థ్రిల్లర్ ‘రిక్కీ’ 2016లో విడుదలైంది. ఇందులో రక్షిత్ శెట్టి, హరిప్రియ, అచ్యుత్ కుమార్, రవి కాలే నటించారు. ఈ సినిమా గురించే ఆ ట్వీట్ పెట్టినట్లు తెలుస్తుంది.
ఫ్యాన్స్ రియాక్షన్
రిషబ్ ట్వీట్‌పై అభిమానులు రియాక్టయ్యారు. “మీరు దీనికి అర్హులు. ఇప్పుడే సినిమా నుండి బయటకు వచ్చాను. నేను చూసింది ఇంకా నమ్మలేకపోతున్నాను. ఇంకా వణుకుతూనే ఉన్నాను. కాంతారా చాప్టర్ 1లో మీరు చేసిన దాంట్లో 1% కూడా ఎవరూ మ్యాచ్ చేయలేరు’’ అని ఓ ఫ్యాన్ రాసుకొచ్చాడు. ఒక ట్వీట్‌లో.. “మీరు దీనికి అర్హులు. ఈరోజు చాప్టర్ 1 చూశా. అద్భుతమైన విజువల్స్, నేపథ్య సంగీతం, ముఖ్యంగా మన సనాతన దేవతలు, విలువల ప్రాతినిధ్యం బాగుంది. విశ్వరూప దర్శనం (భగవద్గీత నుండి ప్రేరణ పొందినది) పరిశోధనను చూపిస్తుంది” అని ఉంది.
మరో స్థాయికి
మరొక అభిమాని ట్వీట్ చేస్తూ, “ఇప్పుడే థియేటర్ నుండి వచ్చాను. అద్భుతంగా ఉంది. మీ బృందం కన్నడ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది” అని అన్నారు. ఒక వ్యక్తి రాస్తూ “మొదటిసారిగా కన్నడిగుల కంటే కన్నడిగేతరులు కన్నడ సినిమాను మొదటి రోజు, మొదటి ఆట చూడటం చూశాను. కన్నడ సినిమా పెరుగుతున్న బలం, పరిధిని నిజంగా ప్రతిబింబించే గర్వించదగిన క్షణం. ప్రపంచానికి కన్నడిగులు ఏమి చేయగలరో చూపించినందుకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నాడు.
సంబంధిత కథనం
