




Best Web Hosting Provider In India 2024

తీరం దాటిన తీవ్రవాయుగుండం – ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్, వంశధార నదికి వరద ఉద్ధృతి..!
తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ఒడిశా గోపాల్ పూర్ సమీపంలో తీరం దాటగా… ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ బలహీనపడుతోంది. ఇవాళ ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.
తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడుతోంది. తీరం దాటినప్పటికీ….. కోస్తా జిల్లాలపై వాయుగుండం ప్రభావం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఇవాళ ఉత్తరాంధ్రలో పలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.శ్రీకాకుళం,విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ,అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.
ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల దాటికి వంశధార నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ప్రస్తుత ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 80,844 క్యూసెక్కులుగా ఉంది. శ్రీకాకుళం,మన్యం జిల్లా లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు కూడా రావొచ్చని… స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో భారీగా ఈదురుగాలుల వీస్తున్నాయి. ఒడిశా-ఆంధ్ర సరిహద్దుల్లోని కొఠియా గ్రామాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. ఇక విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో వరద బీభత్సం కొనసాగుతోంది. చంపావతి నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో… పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఉత్తరాంధ్రలోని పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను ఎప్పటికప్పుడు అలెర్ట్ చేయాలని నిర్దేశించారు.
కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు సేవలు అందిస్తూ, అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు బృందాలు సిద్ధంగా ఉండాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. మంత్రులు, విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితులను పరిశీలిస్తూ ఉండాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పారు.
సంబంధిత కథనం
టాపిక్
