బిగ్ బాస్ 9 తెలుగు: ఈ వారం డేంజర్ జోన్లో ఇద్దరు-డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? లక్స్ పాప, మాస్క్ మ్యాన్ కు షాక్ తప్పదా?

Best Web Hosting Provider In India 2024

బిగ్ బాస్ 9 తెలుగు: ఈ వారం డేంజర్ జోన్లో ఇద్దరు-డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? లక్స్ పాప, మాస్క్ మ్యాన్ కు షాక్ తప్పదా?

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ నాలుగో వీక్ ఓటింగ్ ఎప్పటికప్పుడూ మారిపోతుంది. టాస్క్ లు, ఆర్గ్యుమెంట్ల కారణంగా కంటెస్టెంట్ల గ్రాఫ్ పెరుగుతుంది. కొంతమందిది తగ్గుతుంది. మరి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయేందుకు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో చూద్దాం.

బిగ్ బాస్ 9 తెలుగు నాలుగో వారం ఎలిమినేషన్ (youtube)

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ నుంచి మరొకరు ఎలిమినేట్ అయ్యేందుకు టైమ్ దగ్గరపడుతోంది. మరి ఈ సారి సెలబ్రిటీ వెళ్తారా? లేదా కామనర్ ఎలిమినేట్ అవుతారా? అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. బిగ్ బాస్ 9 తెలుగు నాలుగో వారం నామినేషన్లలో ఆరుగురున్నారు. మరి ఇందులో డేంజర్ జోన్లో ఉన్నది ఎవరు? ఈ సారి డబుల్ ఎలిమినేషన్ ఏమైనా ఉంటుందా? అనేది చూద్దాం.

బిగ్ బాస్ 9 తెలుగు నామినేషన్స్

బిగ్ బాస్ 9 తెలుగు నాలుగో వారం నామినేషన్స్ లో ఆరుగురు ఉన్నారు. ఇందులో ముగ్గురు సెలబ్రిటీలు. ముగ్గురు కామనర్స్. సెలబ్రిటీలు సంజన గల్రానీ, ఫ్లోరా సైనీ, రీతు చౌదరి కాగా.. కామనర్స్ శ్రీజ దమ్ము, దివ్య నిఖిత, హరిత హరీష్. వీళ్లలో ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు.

బిగ్ బాస్ 9 తెలుగు ఓటింగ్

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ నాలుగో వారం ఇప్పటివరకూ ఓటింగ్ చూసుకుంటే సెలబ్రిటీ సంజన గల్రానీ మరోసారి టాప్ లో కొనసాగుతున్నారు. ఆమె ప్రతీది ప్లాన్ గా ఆడుతున్నారు. కావాల్సినంత కంటెంట్ అందిస్తూనే ఉంది. కెప్టెన్సీ వదులుకున్న ఇమ్మాన్యుయేల్ కు సపోర్ట్ చేయడంతో మంచి ఒపీనియన్ కూడా ప్లస్ అయింది. ఓటింగ్ లో 21 శాతం ఓట్లతో సంజన టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఇమ్మాన్యుయేల్ ఓటింగ్ కూడా సంజనకు ట్రాన్స్ ఫర్ అవుతోందని టాక్.

దమ్ము శ్రీజ

ఇక బిగ్ బాస్ 9 తెలుగులో టాస్క్ లు అంటే ప్రాణం పెట్టేసే దమ్ము శ్రీజ, రీతు చౌదరి ఓటింగ్ కూడా బాగానే ఉంది. టాస్క్ లో ఆడటంతో వీళ్ల ఓటింగ్ తారుమారైంది. శ్రీజ 18 శాతం ఓట్లతో సెకండ్ ప్లేస్ లో, రీతు 16 శాతం ఓట్లతో మూడో ప్లేస్ లో ఉన్నారు. రీతుకు డీమాన్ పవన్ ఓటింగ్ కూడా కలిసొస్తుంది. దివ్య నిఖిత కూడా 16 శాతం ఓటింగ్ తో నాలుగో ప్లేస్ లో ఉంది.

ఈ ఇద్దరు డేంజర్లో

బిగ్ బాస్ 9 తెలుగు నాలుగో వారం డేంజర్ జోన్లో హరిత హరీష్, ఫ్లోరా సైనీ ఉన్నారు. అయితే వీళ్లలో చూసుకుంటే హరిత హరీష్ పొజిషన్ కాస్త బెటర్ గా ఉంది. ఫ్లోరా అయితే లాస్ట్ ప్లేస్ లో ఉంది. ఆమెకు తెలుగు రాకపోవడం సమస్యగా మారింది. అందుకే ఓట్లు పడటం లేదని తెలిసింది. ఈ వారం హౌస్ నుంచి లక్స్ పాప ఫ్లోరా లేదా మాస్క్ మ్యాన్ హరీష్ లో ఒకరు ఎలిమినేట్ అవొచ్చు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరూ వెళ్లిపోయే ఛాన్స్ ఉంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024