





Best Web Hosting Provider In India 2024

బుల్లితెరపైకి ఓటీటీలోని మైథలాజికల్ హారర్ థ్రిల్లర్.. శివ శక్తిగా తమన్నా.. ఓదెల 2 టీవీ ప్రీమియర్ ఎక్కడ, ఎప్పుడంటే?
ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా ఓదెల 2 బుల్లితెరపై సందడి చేయనుంది. దసరా స్పెషల్ సందర్భంగా తమన్నా నటించిన ఈ హారర్ థ్రిల్లర్ టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేయనుంది. శివ శక్తిగా తమన్నా నటించిన ఓదెల 2 మూవీ టీవీ ప్రీమియర్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
వారం వారం సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న టీవీ ఛానెల్ జీ తెలుగు. అయితే, జీ తెలుగు ఈ దసరా పండగ సందర్భంగా సూపర్ హిట్ సినిమాతో మీ ముందుకు రానుంది. థియేటర్, ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న సెన్సేషనల్ మూవీ ‘ఓదెల 2’.
ఓదెల 2 ఓటీటీ ప్రీమియర్
2022లో ఓటీటీ వేదికగా అలరించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన ఓదెల 2 టీవీ ప్రీమియర్ కానుంది. జీ తెలుగు టీవీ ఛానెల్‌లో ఈ ఆదివారం (అక్టోబర్ 5) ఓదెల 2 సినిమా ప్రసారం కానుంది. అక్టోబర్ 5న జీ తెలుగులో మధ్యాహ్నం 3 గంటలకు ఓదెల 2 చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
ఓదెల 2 కథ
ఓదెల 2 కథలోకి వెళితే.. ఓదెల గ్రామంలో అనేక దారుణాలు చేసిన తిరుపతి (వశిష్ఠ)ని ఆ గ్రామస్థులు సమాధి చేసిన ఆరు నెలలకే మళ్ళీ ఒక భయంకర ఆత్మగా బయటకి వస్తాడు. అలా వచ్చి మళ్లీ ఓదెలలో మరింత విధ్వంసం సృష్టిస్తాడు. అతడిని కట్టడి చేసేందుకు గ్రామస్తులు శివ శక్తి అయిన భైరవి (తమన్నా భాటియా) సహాయాన్ని కోరతారు.
తిరుపతి మరణానికి కారణం
తిరుపతి మరణం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? భైరవి ఓదెల గ్రామానికి ఎందుకు వచ్చింది? అనే విషయాలు తెలియాలంటే జీ తెలుగులో ప్రసారమయ్యే ఓదెల 2 సినిమా చూడాల్సిందే. ఓదెల 2 సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ సంపత్ నంది పర్యవేక్షించారు.
హెబ్బా పటేల్-తమన్నా
డి. మధు నిర్మించిన ఓదెల 2 సినిమాలో తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిగా బ్యూటిఫుల్ హెబ్బా పటేల్, వశిష్ఠ ముఖ్యపాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే, ఎన్నో అంచనాలతో థియేటర్లలో విడుదలైన ఓదెల 2 పర్వాలేదనిపించుకుంది. థియేట్రికల్ ముగిసిన తర్వాత ఓదెల 2 ఓటీటీ రిలీజ్ అయింది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
అమెజాన్ ప్రైమ్‌లో ఓదెల 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ఆ ఓటీటీలోని హారర్ థ్రిల్లర్ మూవీ అయిన ఓదెల 2 వరల్డ్ టీవీ ప్రీమియర్ కానుంది. కాగా, ఇటీవల తమన్నా హాట్ స్పెషల్ సాంగ్‌తో అలరించింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్‌లో తమన్నా గఫూర్ అనే ఐటమ్ సాంగ్ చేసి ఆకట్టుకుంది.
సంబంధిత కథనం
టాపిక్
