12 అంతస్తులు, 2 వేల పడకలు..! కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభం

Best Web Hosting Provider In India 2024

12 అంతస్తులు, 2 వేల పడకలు..! కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభం

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులు షురూ అయ్యాయి. దసరా పండగ వేళ నిర్మాణ సంస్థ పూజలు నిర్వహించి పనులను ప్రారంభించింది. 12 అంతస్తులతో నూతన భవనాల నిర్మాణాలు చేపట్టనుండగా… రెండు వేల పడకలను ఏర్పాటు చేయనన్నారు.

ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణ పనులు ప్రారంభం

ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవన సముదాయ నిర్మాణ పనులు దసరా పండగ వేళ ప్రారంభయమయ్యా. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌ (ఎం ఈ ఐ ఎల్ ) ప్రాజెక్టుల విభాగం అధ్యక్షులు కె. గోవర్ధన్ రెడ్డి గురువారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు.

హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ భవనాల నిర్మాణానికి ఈ ఏడాది జనవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దసరా నాడు ప్రారంభమైన పనులు ఇక శరవేగంగా జరగనున్నాయి.

26 ఎకరాల విస్తీర్ణంలో….

ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణం రెండున్నర ఏళ్లలో పూర్తి కానున్నాయి. నూతన భవనాల సముదాయాన్ని 26 ఎకరాల విస్తీర్ణంలో 32 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రెండు వేల పడకలు ఏర్పాటు చేస్తారు. ఈ ఆసుపత్రిలో హాస్పిటల్ బ్లాక్‌ ఒక్కటే 22.96 లక్షల చదరపు అడుగులు విస్తీర్ణంలో నిర్మిస్తారు. అకడమిక్ బ్లాక్‌, పురుష, మహిళా వసతి గృహ బ్లాకులు, ధర్మశాల, మార్చురీ, యుటిలిటీ బిల్డింగ్‌, సెక్యూరిటీ బిల్డింగ్‌ మిగిలిన తొమ్మిది లక్షల నాలుగు వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తారు. రెండు స్థాయిల బేస్‌మెంట్ పార్కింగ్‌ను 1,500 కార్ల పార్కింగ్ కు అనువుగా నిర్మించనున్నారు.

ఆసుపత్రి సముదాయంలో 29 ప్రధాన, 12 చిన్న ఆపరేషన్ థియేటర్లు, హెలిప్యాడ్‌, రోబోటిక్ సర్జరీ థియేటర్లు, ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్లు, సీవేజ్ ట్రీట్మెంట్‌, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు నిర్మిస్తారు. అలాగే నర్సింగ్‌, డెంటల్‌, ఫిజియోథెరపీ కాలేజీలు వేర్వేరుగా ఉంటాయి. రూఫ్‌టాప్ టెర్రస్ గార్డెన్లు, క్రాస్ వెంటిలేషన్ టెక్నాలజీలతో నిర్మించే ఆసుపత్రి నూతన భవనాలు నిరంతరాయంగా సహజమైన గాలిని అందించి రోగులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించనున్నాయి.

గడువులోపే పనులు పూర్తి – గోవర్థన్ రెడ్డి

భవన నిర్మాణ పనులకు పూజ చేసిన అనంతరం ఎంఈఐఎల్ ప్రాజెక్టుల విభాగం అధ్యక్షులు కె. గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ…. నిర్ణయించిన గడువులోనే పనులు పూర్తి చేస్తామన్నారు. నూతన ఆసుపత్రి భవనాల్లో సౌకర్యాలు ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు ధీటుగా ఉంటాయన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక వసతులతో ఈ భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsHyderabadGhmcCm Revanth Reddy
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024