రహస్యంగా విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా ఎంగేజ్‌మెంట్- ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ముహుర్తాలు!

Best Web Hosting Provider In India 2024

రహస్యంగా విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా ఎంగేజ్‌మెంట్- ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ముహుర్తాలు!

Sanjiv Kumar HT Telugu

విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా ఎంగేజ్‌మెంట్ సీక్రెట్‌గా జరిగిందంటూ సోషల్ మీడియాలో, మీడియా సైట్లలో వార్తలు తెగ వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్, రష్మిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌లోని ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో వారిద్దరు సాంప్రదాయబద్ధంగా కనిపించడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

రహస్యంగా విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా ఎంగేజ్‌మెంట్- ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ముహుర్తాలు!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎంగేజ్‌మెంట్ జరిగిందంటూ అటు సోషల్ మీడియాలో, ఇటు మీడియా సైట్లలో వార్తలు జోరుగా వస్తున్నాయి. శుక్రవారం అంటే అక్టోబర్ 4న చాలా రహస్యంగా విజయ్, రష్మిక నిశ్చితార్థం జరిగనట్లు పలు బాలీవుడ్ సైట్స్ సైతం పేర్కొన్నాయి.

ఉదయం 11 గంటలకు

హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ నివాసంలోనే ఉదయం 11 గంటలకు రష్మిక మందన్నాతో నిశ్చితార్థం జరిగిందని సమాచారం. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో చాలా నిరాడంబరంగా విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా ఎంగేజ్‌మెంట్ జరిగిందని నిన్నటి నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది.

సన్నిహితుల నుంచి సమాచారం

ఈ విషయాన్ని హీరో హీరోయిన్ల సన్నిహితులు స్వయంగా ప్రకటించినట్లు సమాచారం. అంతేకాకుండా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విజయ్ రష్మిక పెళ్లికి ముహుర్తాలు కుదిరినట్లు తెలుస్తోంది. అలాగే, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

స్పందించని హీరో హీరోయిన్

అయితే, ఈ నిశ్చితార్థం, పెళ్లి వార్తలపై అటు విజయ్ దేవరకొండ గానీ ఇటు రష్మిక మందన్నా గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. దీనిపై స్పందించనూ కూడా లేదు. కానీ, ఈ ఎంగేజ్‌మెంట్ వార్తల నేపథ్యంలో విజయ్, రష్మికల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌ను నెటిజన్స్ సెర్చ్ చేసి మరి చూస్తున్నారు.

ఫొటోలు వైరల్

వాటిలో రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ విడివిడిగా షేర్ చేసిన ఫొటోల్లో ఇద్దరు సాంప్రదాయబద్ధంగా కనిపించడం ఈ నిశ్చితార్థపు వార్తలకు బలం చేకూర్చేలా కనిపిస్తోంది. ఎర్ర చీర, నుదుటన బొట్టుతోలో చాలా ట్రెడిషనల్‌గా రష్మిక కనిపిస్తే.. విజయ్ దేవరకొండ షేర్వానీలో స్టైలిష్‌గా అట్రాక్ట్ చేశాడు.

ఇతర సందర్భాల్లో

ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ఫొటోలు వేరే వేడుకల్లో భాగంగా తీసుకున్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దసరా సందర్భంగా రష్మిక అలా ఫొటోలు దిగితే.. న్యూయార్క్‌లో విజయ్ దేవరకొండ పోజులు ఇచ్చినట్లుగా వారి క్యాప్షన్ ద్వారా తెలుస్తోంది.

డేటింగ్ రూమర్స్

ఇదిలా ఉంటే, గత కొన్ని నెలలుగా రష్మిక, విజయ్ డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు ఈ విషయంపై డైరెక్ట్‌గా ఎప్పటికీ చెప్పకపోయినప్పటికీ పలు సందర్భాల్లో ఒకే ప్లేసులో విడివిడిగా ఫొటోలు షేర్ చేస్తూ దొరికిపోయారు. ఎయిర్ పోర్ట్, వెకేషన్స్‌లో విజయ్, రష్మిక షేర్ చేసిన ఫొటోలు వీరి లవ్ ట్రాక్ వార్తలకు ప్రాణం పోశాయి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024