




Best Web Hosting Provider In India 2024

ఏపీ రైతులకు అప్డేట్ – ఈ-క్రాప్ నమోదు గడువు పెంపు, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకండి
ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఈ-పంట నమోదు గడువుపై ఏపీ వ్యవసాయశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ గడువును ఈనెల 25వ తేదీ వరకు పొడిగించారు. మార్పు చేర్పులకు ఈ నెల30 వరకు అవకాశం కల్పించింది.
ఖరీఫ్ 2025 కోసం ఈ-క్రాప్ డిజిటల్ సర్వే కింద భూమి, పంటల రిజిస్ట్రేషన్ గడువును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ చివరి వరకు పొడిగించింది. క్షేత్రస్థాయిలో పలు ఇబ్బందలు కారణంగా…. ఈ గడువును పొడిగిస్తున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ దిల్లీరావు తెలిపారు.
గడువు పొడిగింపు…
ఈ సీజన్లో ఈ-క్రాప్ డిజిటల్ సర్వే కింద భూముల 100 శాతం కవరేజీని సాధించాలని ప్రభుత్వం నిశ్చయించుకుందని ఆయన చెప్పారు. రిజిస్ట్రేషన్ కు చివరి తేదీని అక్టోబర్ 25 గా నిర్ణయించామని తెలిపారు. సోషల్ ఆడిట్, దిద్దుబాట్లు మరియు మార్పులు అక్టోబర్ 30 వరకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తుది జాబితా అక్టోబర్ ౩1వ తేదీన ప్రదర్శించబడుతుందన్నారు.
కృష్ణా, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో 50 శాతానికి పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఇక వైఎస్సార్ కడప, చిత్తూరు, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 22 శాతం కంటే తక్కువ నమోదైంది. సాగు భూములు, బీడు భూములను గడువులోగా రిజిస్ట్రేషన్ చేసేలా చూడాలని ఉద్యానవన శాఖ అధికారులకు కూడా ఆదేశాలు జారీ అయ్యాయి.
రైతు సేవా కేంద్రాల సిబ్బందిని ఇతర సర్వేలకు మళ్లించరాదని…. గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్ఓలు) వెరిఫికేషన్ లో పాల్గొనాలని ఢిల్లీ రావ్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు ప్రతిరోజూ పురోగతిని సమీక్షించాలని సూచించారు. ఈ-క్రాప్ డిజిటల్ సర్వే డేటా అన్ని రకాల రైతు సంక్షేమం మరియు అభివృద్ధి పథకాలకు సింగిల్ బేస్ ఫ్లాట్ ఫామ్ గా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
జిల్లా కలెక్టర్లు ఈ పర్యవేక్షణను బలోపేతం చేయాలని… అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలన్నారు. రిజిస్ట్రేషన్లను సకాలంలో పూర్తి చేయడానికి శాఖల మధ్య సమన్వయాన్ని నిర్ధారించాలని కోరారు.
వ్యవసాయ పంటలను మండల వ్యవసాయ అధికారి నమోదు చేస్తారు. ఉద్యాన పంటలకు హార్టికల్చర్ ఆఫీసర్ బాధ్యతలు తీసుకుంటారు. క్రాప్ బుకింగ్‌లో నమోదు చేయాల్సిన సమాచారం ఏంటి అంటే.. పంటల సాగు వివరాలు, రైతు ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ ఉండాలి.
తీవ్ర వర్షాభావం, భారీ వర్షాలు లేదా తుపానుల కారణంగా పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం బీమా ద్వారా అన్నదాతలు ఉపశమనం అందిస్తుందన్న విషయం తెలిసిందే. ఇన్సూరెన్స్ లబ్ధి పొందడానికి ఏ పంట వేశారన్న సమాచారం తప్పనిసరిగా ఉండాలి. లబ్ధిదారులకు ఈ పథకాలు అందేందుకు ప్రభుత్వం ఈ క్రాప్ బుకింగ్ చేయిస్తుంది.
పంటలు సాగు చేసిన రైతులు తప్పకుండా తమ పంటల వివరాలను క్రాప్ బుకింగ్‌లో నమోదు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల ప్రయోజనాలు పొందాలంటే క్రాప్ బుకింగ్, కేవైసీ పూర్తి చేయడం ముఖ్యమని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
సంబంధిత కథనం
టాపిక్
