





Best Web Hosting Provider In India 2024

రష్మికతో ఎంగేజ్మెంట్.. విజయ్ దేవరకొండ నెట్ వర్త్ ఎంతో తెలుసా? 15 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు
టాలీవుడ్ మోస్ట్ ఫేమస్ లవ్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ జోడీ ఎంగేజ్మెంట్ జరిగిందనే వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ నెట్ వర్త్ ఎంత అనేది హాట్ టాపిక్ గా మారింది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని తెలిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీళ్ల వివాహం జరగనున్నట్లు టాక్. ఇప్పటికే ఈ జంట రహస్యంగా కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుందని సమాచారం. ఫిబ్రవరి 2026లో పెళ్లి జరగవచ్చు. అయితే ఈ జంట తమ సంబంధం గురించి లేదా నిశ్చితార్థం గురించి అధికారికంగా ధృవీకరించలేదు లేదా ఖండించలేదు అని ఎమ్9 న్యూస్ తెలిపింది.
విజయ్ నెట్ వర్త్
36 ఏళ్ల విజయ్ దేవరకొండ నెట్ వర్త్ ఎంత అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రష్మిక మందన్నతో పెళ్లి వార్తల నేపథ్యంలో వీళ్ల పేర్లు ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. జీక్యూ ఇండియా ప్రకారం 2024 ప్రారంభంలో విజయ్ దేవరకొండ నెట్ వర్త్ సుమారు రూ. 39 కోట్లుగా అంచనా వేశారు. ఇది సుమారు $4 మిలియన్లు. ఈ లైగర్ నటుడి సంపదకు కారణం అతని సినిమాలు, అతని ఫ్యాషన్ లేబుల్ రౌడీ క్లబ్, వాలీబాల్ జట్టు యాజమాన్యం, వివిధ ఎండార్స్‌మెంట్ ఒప్పందాలు.
రూ.15 కోట్ల బంగ్లా
హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న విజయ్ దేవరకొండ బంగ్లా విలువ రూ. 15 కోట్లు. తన కుటుంబం, సైబీరియన్ హస్కీ జాతికి చెందిన పెంపుడు కుక్క స్టార్మ్‌తో కలిసి ఉంటున్నాడు విజయ్. టాలీవుడ్ సూపర్ స్టార్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్, చిరంజీవి నివసించే ప్రాంతంలోనే అతని ఇల్లు కూడా ఉంది. విశాలమైన తోట, టెర్రస్ బాల్కనీ, మల్టీపర్పస్ బార్, భారీ ప్రవేశ ద్వారం, బెడ్‌రూమ్‌లతో పాటు లివింగ్ స్పేస్ ఈ భవంతికి మరింత శోభను చేకూరుస్తాయి. అతని బంగ్లా విజయ్ దేవరకొండ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
రౌడీ వేర్
అక్టోబర్ 15, 2018న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించాడు. అంతే కాకుండా 2020లో రౌడీ వేర్ మింత్రాలో కూడా భాగమైంది. ఈ ఫ్యాషన్ లేబుల్ సంవత్సరాలుగా అథ్లీజర్ వేర్‌లలో ఒకటిగా విజయవంతంగా కొనసాగుతోంది.
ఇక విజయ్ దేవరకొండ దగ్గర లగ్జరీ కార్లున్నాయి. అతని దగ్గరున్న బీఎండబ్ల్యూ 5 సిరీస్ కారు విలువ రూ. 61.48 లక్షలు. ఫోర్డ్ మస్టాంగ్ ధర రూ. 75 లక్షలు. వోల్వో ఎక్స్ సీ 90 విలువ రూ. 85 లక్షలు. రేంజ్ రోవర్ విలువ రూ. 64 లక్షలు. ఇటు యాక్టింగ్ తో, అటు ఎండార్స్ మెంట్లు, దుస్తుల బిజినెస్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాగానే సంపాదిస్తున్నాడు.
సంబంధిత కథనం
