నెల రోజుల్లోపే ఓటీటీలోకి మిరాయ్.. 150 కోట్ల బ్లాక్ బస్టర్.. తేజ వర్సెస్ మనోజ్ వార్.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్

Best Web Hosting Provider In India 2024

నెల రోజుల్లోపే ఓటీటీలోకి మిరాయ్.. 150 కోట్ల బ్లాక్ బస్టర్.. తేజ వర్సెస్ మనోజ్ వార్.. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్

రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ మిరాయ్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో అదరగొట్టిన ఈ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ నెల రోజుల్లోపే డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. మిరాయ్ ఓటీటీ రిలీజ్ డేట్, ప్లాట్ ఫామ్ గురించి తెలుసుకోండి.

మిరాయ్ పోస్టర్ లో తేజ సజ్జా (x/JioHotstar Telugu)

ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘మిరాయ్’ దూసుకొస్తోంది. సడెన్ గా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ను అనౌన్స్ చేశారు. బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ ఫ్యాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్ రూ.150 కోట్లు కలెక్ట్ చేసింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో తేజ సజ్జా హీరో కాగా, మంచు మనోజ్ విలన్ గా నటించాడు.

మిరాయ్ ఓటీటీ

తెలుగు బ్లాక్ బస్టర్ సినిమా మిరాయ్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను ఇవాళ (అక్టోబర్ 4) ప్రకటించారు. అక్టోబర్ 10న మిరాయ్ ఓటీటీ రిలీజ్ కానుందని జియోహాట్‌స్టార్‌ ప్లాట్ ఫామ్ అనౌన్స్ చేసింది. ఈ సినిమా జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

‘‘9 గ్రంథాలు. అంతులేని శక్తి. బ్రహ్మాండాన్ని కాపాడే ఒక సూపర్ యోధ. ఇండియా సొంత సూపర్ హీరో మిరాయ్ మీ ఇంటికి వస్తున్నాడు. అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది’’ అని జియోహాట్‌స్టార్‌ ఎక్స్ లో పోస్టు చేసింది.

నెల రోజుల్లోనే

మిరాయ్ సినిమా థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైంది. రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.150 కోట్లు రాబట్టింది. ఇప్పుడు అక్టోబర్ 10 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది సినిమా.

మిరాయ్ కథ

అశోకుని 9 గ్రంథాలను దక్కించుకుని ఆ శక్తితో ప్రపంచాన్ని నాశనం చేయాలనుకునే మహాబీర్ లామా అలియాస్ బ్లాక్ స్వోర్డ్ (మంచు మనోజ్), ఆ ప్రయత్నాన్ని ఆపాలనుకునే వేద (తేజ సజ్జా)కు మధ్య పోరాటమే మిరాయ్. మహాబీర్ లామా క్రూరంగా అందరనీ చంపేస్తూ 8 గ్రంథాలను సొంతం చేసుకుంటాడు. కానీ 9వ గ్రంథం దక్కకుండా వేద అడ్డుగా నిలుస్తాడు. అందుకు రాముని ఆయుధం మిరాయ్ ను చేరుకుంటాడు.

మరి మహాబీర్ లామా 9 గ్రంథాలను దక్కించుకున్నాడా? అతణ్ని తేజ సజ్జా ఎలా ఆదుకున్నాడు? ఇందులో వేద తల్లి అంబిక ప్రజాపతి (శ్రియా సరణ్) చేసిన త్యాగం ఏంటీ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విజువల్ వండర్

మిరాయ్ ను విజువల్ వండర్ అని చెప్పొచ్చు. వీఎఫ్ఎక్స్ క్వాలిటీ అదిరిపోయింది. ముఖ్యంగా మిరాయ్ కోసం వెళ్లే క్రమంలో వచ్చే సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇక వేద, మహాబీర్ లామా మధ్య ఫైటింగ్ సీక్వెన్స్ కూడా అలరిస్తుంది. ఇందులో తేజ సజ్జా హీరో. రితిక నాయక్ హీరోయిన్. మంచు మనోజ్ విలన్. శ్రియా సరణ్, జగపతి బాబు, జయరాం తదితరులు కూడా నటించారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024