




Best Web Hosting Provider In India 2024

కొత్త వైన్స్ టెండర్లు 2025 : ఇక ఆన్‌లైన్‌లోనూ అప్లికేషన్లు – ఇలా డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణలో కొత్త వైన్స్ షాపుల లైసెన్స్ ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. ఆన్ లైన్ లోనూ అప్లికేషన్ ఫారమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాల వారీగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకు అక్టోబర్ 18వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అయితే దరఖాస్తు ఫారమ్ కు సంబంధించి ఎక్సైజ్ శాఖ మరో అప్డేట్ ఇచ్చింది.
ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫారమ్….
కొత్త వైన్స్ టెండర్ల కోసం దరఖాస్తు ఫారమ్ లను కేవలం ఆఫ్ లైన్ లోనే కాకుండా ఆన్ లైన్ లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు అధికారులు ప్రకటన చేశారు. సబ్మిషన్ మాత్రం ఆఫ్ లైన్ లోనే చేయాలి. కాకపోతే దరఖాస్తు ఫారంను ఆన్‌లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిని పూర్తి చేసిన తర్వాత… ఆయా ఎక్సైజ్ జిల్లాల కార్యాలయాల్లో సమర్పించుకోవచ్చు. అక్టోబర్ 18వ తేదీలోపే ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ ప్రాసెస్….
- ఆసక్తి గల దరఖాస్తులు tgbcl.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ అప్లికేషన్ ఫారమ్ కనిపిస్తుంది.
- దీనిపై క్లిక్ చేసి ఫారమ్ ఓపెన్ అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా అప్లికేషన్ ఫారమ్ కాపీని పొందవచ్చు.
రాష్ట్రంలోని 34 ఎక్సైజ్ జిల్లాలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్లను కూడా వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు దరఖాస్తుల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత…. అక్టోబర్ 23న కొత్త మద్యం షాపుల కేటాయింపునకు డ్రా తీస్తారు. డ్రా లో దుకాణాల లైసెన్స్ పొందిన వారు మొదటి విడత చెల్లింపు మొత్తాన్ని అక్టోబర్ 23 నుంచి చెల్లించాల్సి ఉంటుంది. ఈ గడువు అక్టోబర్ 24వ తేదీతో పూర్తవుతుంది. లైసెన్స్ ఫీజు మొత్తాన్ని 6 విడతలుగా చెల్లించుకోవచ్చు.
కొత్త దుకాణాలకు 2025 డిసెంబర్ 1 నుండి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాల పరిమితి ఉంటుంది. డ్రా పద్ధతిలో ఎంపికైన వారు… డిసెంబర్ 1వ తేదీ నుంచి దుకాణాలను ఓపెన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలు, గీత కార్మికులకు కేటాయించే మద్యం దుకాణాలను జిల్లా కలెక్టర్లు ఈ నెల 25వ తేదీనే డ్రా పద్దతిలో ఎంపిక చేశారు. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలల్లో గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లను కేటాయించారు.
సంబంధిత కథనం
టాపిక్
