రష్మిక మందన్న నెట్‌వ‌ర్త్ తెలిస్తే షాక్ అవాల్సిందే-కాబోయే భ‌ర్త విజ‌య్ దేవ‌ర‌కొండ కంటే ఎక్కువ‌- సినిమాకు ఎన్ని కోట్లంటే?

Best Web Hosting Provider In India 2024

రష్మిక మందన్న నెట్‌వ‌ర్త్ తెలిస్తే షాక్ అవాల్సిందే-కాబోయే భ‌ర్త విజ‌య్ దేవ‌ర‌కొండ కంటే ఎక్కువ‌- సినిమాకు ఎన్ని కోట్లంటే?

విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం చేసుకున్న నటి రష్మిక మందన్న వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకోనున్నారు. 29 ఏళ్ల ఈమె దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. ‘నేషనల్ క్రష్’ నెట్ వర్త్ ఎంతో ఇక్కడ తెలుసుకోండి.

రష్మిక మందన్న (Instagram)

తెలుగు సూపర్ స్టార్ విజయ్ దేవరకొండతో నటి రష్మిక మందన్న నిశ్చితార్థం ఇటీవల జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీళ్లు వివాహం చేసుకోనున్నారు. 36 ఏళ్ల విజయ్ బృందం శనివారం (అక్టోబర్ 4) హిందుస్థాన్ టైమ్స్‌కి ఈ విషయాన్ని ధృవీకరించింది. 1996 ఏప్రిల్ 5న జన్మించిన 29 ఏళ్ల రష్మిక మందన్న దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరు.

రష్మిక మందన్న నెట్ వర్త్

ఇన్‌స్టాగ్రామ్‌లో 47.1 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న రష్మిక మందన్న యాక్టింగ్ తో పాటు వివిధ ఎండార్స్‌మెంట్ ఒప్పందాలు, మోడలింగ్ అసైన్‌మెంట్‌లు, బ్రాండ్ అంబాసిడర్ పాత్రల ద్వారా రూ.కోట్లు సంపాదిస్తోంది. ఫోర్బ్స్ ప్రకారం రష్మిక నెట్ వర్త్ దాదాపు రూ. 66 కోట్లు. ఇది ఆమెకు కాబోయే భర్త విజయ్ దేవరకొండ నెట్ వర్త రూ.39 కోట్ల కంటే ఎక్కవ.

రెమ్యునరేషన్

మోడలింగ్‌తో కెరీర్‌ను ప్రారంభించి నటనలో తనదైన ముద్ర వేసింది రష్మిక. కన్నడ సినిమా కిరిక్ పార్టీతో ఆమెకు బ్రేక్ వచ్చింది. ఈ శాండల్‌వుడ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. మీడియా కథనాల ప్రకారం ఆమె ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల నుంచి రూ.8 కోట్ల మధ్య పారితోషికం తీసుకుంటుంది. అయితే పుష్ప 2 కోసం ఏకంగా రూ.10 కోట్లు సొంతం చేసుకుందని టాక్.

రష్మిక మందన్నను ఈ ఏడాది ఆగస్టులో స్వరోవ్స్కీ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితురాలైంది. ఫిట్‌నెస్ బ్రాండ్ ఐసోప్యూర్ మొదటి ఇండియన్ అంబాసిడర్‌ రష్మిక.

విలాసవంతమైన బంగ్లా

గతంలో రష్మిక మందన్న బోట్, కళ్యాణ్ జ్యువెల్లర్స్, 7అప్, మీషో, వేగన్ బ్యూటీ కంపెనీ ప్లమ్ వంటి అనేక బ్రాండ్‌లకు ప్రచారం చేసింది. ‘నేషనల్ క్రష్’గా పేరుగాంచిన రష్మిక మందన్నకు బెంగళూరులో రూ. 8 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లా ఉంది. దీనితో పాటు ముంబై, గోవా, కూర్గ్, హైదరాబాద్‌లో కూడా ఆమెకు ఆస్తులు ఉన్నాయి.

ఈ సినిమాలతో

కిరిక్ పార్టీ, డియర్ కామ్రేడ్, ఛలో, గీత గోవిందం, పుష్ప 1, పుష్ప 2, వారిసు తదితర సినిమాల్లో నటించింది రష్మిక మందన్న. 2022లో గుడ్‌బైతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. హిందీ చలన చిత్ర పరిశ్రమలో ఆమె మిషన్ మజ్ను, యానిమల్, ఇటీవలి ఛావా, సికందర్ చిత్రాలలో నటించింది.

రష్మిక మందన్న 4 సార్లు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును అందుకుంది. సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకుంది. దీనితో పాటు ఆమె భారతదేశం 2024 ’30 అండర్ 30′ జాబితాలో కూడా చోటు దక్కించుకుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024