అద్భుతమైన విజువల్స్, లిరిక్స్‌తో ‘ఏమి మాయ ప్రేమలోన’ సాంగ్- దర్శకత్వం, సాహిత్యం అందించిన హీరో

Best Web Hosting Provider In India 2024

అద్భుతమైన విజువల్స్, లిరిక్స్‌తో ‘ఏమి మాయ ప్రేమలోన’ సాంగ్- దర్శకత్వం, సాహిత్యం అందించిన హీరో

Sanjiv Kumar HT Telugu

యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ సాంగ్ ఏమి మాయ ప్రేమలోన. ఈ పాటకు హీరోగా చేసిన అనిల్ ఇనుమడుగు సాహిత్యం అందించడంతోపాటు దర్శకత్వం వహించారు. అద్భుతమైన విజువల్స్, ఆకట్టుకునే లిరిక్స్‌తో సాగే ఏమి మాయ ప్రేమలోన సాంగ్‌పై లుక్కేద్దాం.

అద్భుతమైన విజువల్స్, లిరిక్స్‌తో ‘ఏమి మాయ ప్రేమలోన’ సాంగ్- దర్శకత్వం, సాహిత్యం అందించిన హీరో

అకీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌లో రూపొందిన లేటెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ఏమి మాయ ప్రేమలోన. అనిల్ ఇనుమడుగు హీరోగా వేణి రావ్ హీరోయిన్‌గా నటించారు. అయితే, ఇటీవల విడుదలైన ‘ఏమి మాయ ప్రేమలోన’ మ్యూజిక్ ఆల్బంకు మంచి ఆదరణ లభిస్తోంది.

హీరో, దర్శకత్వం

లీడ్ రోల్స్‌లో నటించిన అనిల్ ఇనుమడుగు ఈ పాటకు లిరిక్స్ అందించడంతో పాటు దర్శకత్వం వహించడం విశేషం. మార్క్ ప్రశాంత్ సంగీతం అందిచిన ఏమి మాయ ప్రేమలోన సాంగ్‌ను దిన్కర్ కలవుల, దివ్య ఐశ్వర్య ఆలపించారు.

సున్నితమైన కథాంశంతో

కేరళలో బోటు నడిపే ఓ అనాథ కుర్రాడి జీవితంలో ఓ మేఘాలు కమ్ముకున్న రోజు కనిపించిన మేఘాల మధ్యన దాగిన మెరుపులా ఆ కుర్రాడికి తారాసపడిన ఆ అమ్మాయి ప్రేమని గెలుచుకునే ఓ సున్నితమైన కథాంశం నేపథ్యంలో తెరకెక్కింది ఏమి మాయ ప్రేమలోన సాంగ్.

దసరా కానుకగా యూట్యూబ్‌లో

ఏమి మాయ ప్రేమాలోన సాంగ్ దసరా కానుకగా యూట్యూబ్‌లో రిలీజ్ అయింది. విడుదలైన రోజు నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ఈ సాంగ్. అంతేకాకుండా యూట్యూబ్‌లో ఏమి మాయ ప్రేమాలోన పాట భారీ వ్యూస్ రాబడుతూ దూసుకెళ్తోంది.

కేరళలోని లొకేషన్స్‌ను

ఈ పాటలో కాన్సెప్ట్‌తో పాటు డైరెక్షన్ కూడా మెచ్చుకోదగిన విధంగా ఉందని ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పాటలోని సినిమాటోగ్రఫీ సూపర్బ్‌గా ఉందని, విజువల్ల్ ఆహ్లాదకరంగా ఉన్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కేరళలోని లొకేషన్స్‌ను చూడముచ్చటగా చూపించాడు సినిమాటోగ్రాఫర్ శ్రవణ్.

సహజంగా హీరో హీరోయిన్ల నటన

ఏమి మాయ ప్రేమాలోన పాటలోని ప్రతి ఫ్రేమ్‌ను రిచ్‌గా మలిచాడు. ఇక లీడ్ రోల్స్ చేసిన అనిల్, వేణి రావ్ జోడి బాగుంది. స్క్రీన్ మీదా ఇద్దరు సహజంగా నటించారు. వారి మధ్య వచ్చే కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది.

పది నిమిషాల రన్ టైమ్

ప్రస్తుతం ఏమి మాయ ప్రేమాలోన సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పది నిమిషాల నిడివి కలిగిన ఏమి మాయ ప్రేమలోన సాంగ్‌ను అకి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌లో యంగ్ నిర్మాతలు అజయ్, విష్ణు నిర్మించారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్ వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‌లో ఉన్న ఏమి మాయ ప్రేమలోన సాంగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024