తెలుగు సినిమా గుండె విజయవాడలో కొట్టుకుంటుందని వాళ్లు ఎల్లప్పుడూ చెబుతారు.. హీరో ప్రియదర్శి కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

తెలుగు సినిమా గుండె విజయవాడలో కొట్టుకుంటుందని వాళ్లు ఎల్లప్పుడూ చెబుతారు.. హీరో ప్రియదర్శి కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

ప్రియదర్శి నటించిన లేటెస్ట్ కామెడీ మూవీ మిత్ర మండలి. ఈ మూవీలో హీరోయిన్‌గా సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ నిహారిక ఎన్ఎమ్ నటిస్తోంది. విజయేందర్ దర్శకత్వం వహించిన మిత్ర మండలి అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ ఈవెంట్‌లో ప్రియదర్శి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తెలుగు సినిమా గుండె విజయవాడలో కొట్టుకుంటుందని వాళ్లు ఎల్లప్పుడూ చెబుతారు.. హీరో ప్రియదర్శి కామెంట్స్

హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ప్రియదర్శి. హీరోగా ప్రియదర్శి నటించిన లేటెస్ట్ కామెడీ సినిమా మిత్ర మండలి. సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ నిహారిక ఎన్ఎమ్ హీరోయిన్‌గా ఈ సినిమాలో నటించింది.

కీలక పాత్రల్లో రాగ్ మయూర్

బివి వర్క్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌లపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ఇతర కీలక పాత్రలు పోషించారు.

అక్టోబర్ 16న మిత్ర మండలి సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే మిత్ర మండలి చిత్ర బృందం విజయవాడ ఉత్సవ్ ఈవెంట్‌‌లో సందడి చేసింది. దసరా సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో హీరో ప్రియదర్శితోపాటు పలువురు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

పరిశ్రమలోని వ్యక్తులు

హీరో ప్రియదర్శి మాట్లాడుతూ .. “మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు విజయవాడ ఉత్సవ్ కమిటీ, ఏపీ పోలీసు బలగాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. తెలుగు సినిమా గుండె విజయవాడలో కొట్టుకుంటుందని మా పరిశ్రమలోని వ్యక్తులు ఎల్లప్పుడూ చెబుతారు. అక్టోబర్ 16న రానున్న ‘మిత్ర మండలి’ థియేటర్లలో కుటుంబం మొత్తంతో ఆస్వాదించగల క్లీన్ ఎంటర్‌టైనర్ చిత్రం” అని అన్నారు.

“విజయవాడ ఉత్సవ్‌లో మమ్మల్ని ఇక్కడకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఈ రోజు ఇలా మీ అందరితో ఇక్కడ ఉండటం నాకు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ‘మిత్ర మండలి’ పక్కా కామెడీ చిత్రం. కాబట్టి దయచేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి” అని హీరోయిన్ నిహారిక ఎన్ఎమ్ తెలిపింది.

కెరీర్‌కు టర్నింగ్ పాయింట్

సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్ మాట్లాడుతూ .. “మిత్ర మండలి నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. ఈ మూవీలోని ప్రతీ పాటను శ్రోతలు చార్ట్ బస్టర్‌లుగా మార్చారు. ఈ మూవీతో అందరికీ తప్పకుండా వినోదం లభిస్తుంది. అక్టోబర్ 16న మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయండి” అని పేర్కొన్నారు.

యాక్టర్ ప్రసాద్ బెహరా మాట్లాడుతూ .. “మా మీద ఇంత ప్రేమను కురిపిస్తున్న విజయవాడ ప్రజలకు ధన్యవాదాలు. అక్టోబర్ 16న మా ‘మిత్ర మండలి’తో అందరినీ నవ్విస్తామని హామీ ఇస్తున్నాం” అని చెప్పుకొచ్చారు.

లిటిల్ హార్ట్స కంటే ఎక్కువగా

నటుడు విష్ణు ఓయి మాట్లాడుతూ .. “మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు విజయవాడ ఎక్స్‌పో, ఉత్సవ్ కమిటీకి ధన్యవాదాలు. మా ‘మిత్ర మండలి’ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం చివరి వరకు మిమ్మల్ని నవ్విస్తుంది. ‘లిటిల్ హార్ట్స్’ కంటే ఎక్కువగా ఈ చిత్రం అందరినీ నవ్విస్తుంది” అని తెలిపారు.

“ప్రియదర్శి ఎప్పుడూ ఓ డిఫరెంట్ కంటెంట్‌లను ఎంచుకుంటూ ఉంటారు. ఈ టీంలో ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్ఎమ్, నేను, రాగ్ మయూర్, సత్య, వెన్నెల కిషోర్, ఇంకా చాలా మంది ప్రతిభావంతులైన కళాకారులు ఉన్నారు. అక్టోబర్ 16న సినిమాను ఆస్వాదించండి” అని యాక్టర్ విష్ణు ఓయి చెప్పారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024