





Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: వైరా ట్రాప్-జ్యోత్స్నను కాపాడిన కార్తీక్-అగ్రిమెంట్ తీసుకొని వెళ్లిపో-శివన్నారాయణ ఫైర్
కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 6వ తేదీ ఎపిసోడ్ లో వైరా ట్రాప్ లో పడి జ్యోత్స్న వేలం పాట పెంచుకుంటూ పోతుంది. అందులో నుంచి జ్యోను కార్తీక్ కాపాడతాడు. కానీ కార్తీక్ తప్పు చేశాడంటూ ఊగిపోయిన శివన్నారాయణ అగ్రిమెంట్ పేపర్స్ చేతిలో పెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటాడు.
కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 6వ తేదీ ఎపిసోడ్ లో సాంబార్ చేయమని దీపకు సుమిత్ర చెప్తుంది. అబద్దాలు చెప్పి చెప్పి అదే నీ జీవితమైంది. ఈ రోజు నా కూతురు గెలిచి ఇంటికి వస్తుంది. ప్రేమగా భోజనం చేస్తున్నప్పుడు నువ్వు కళ్లు తిరిగి పడిపోతే ఇబ్బందిగా ఉంటుంది. నా కూతురి జీవితంలోకి ఏ ఆనందం వచ్చినా నువ్వు తట్టుకోలేవు. పాడు చేయడానికి ప్రయత్నిస్తావు. ప్లీజ్ దీప నన్ను ఈ ఒక్క పూట అయినా నా కూతురితో కడుపు నిండుగా తిననివ్వమని సుమిత్ర అంటుంది.
గడ్డితో జ్యూస్
మమ్మల్ని పట్టించుకోవా? అని దీపను పారిజాతం అడుగుతుంది. బంగాళదుంపలు దీప తీసుకొస్తే, ఏదైనా కారంగా పెట్టమని అడుగుతుంది దీప. బయట గడ్డి ఉంది తింటానని పారు అంటే, గడ్డితో జ్యూస్ చేస్తానని దీప చెప్తుంది. దమ్మిడి ఆదాయం లేకుండా మీరెలా బతుకుతున్నారు? ఏ ధైర్యంతో బతుకుతున్నారు? అని పారు అడుగుతుంది. మా బావ ఉన్నాడనే ధైర్యంతో అని దీప కౌంటర్ ఇస్తుంది.
వేలం పాట
నా టెన్షన్ అంతా జ్యోత్స్న గురించే. పైగా ఆ వైరా ఇక్కడే ఉన్నాడు. కార్తీక్ నువ్వు ఇక్కడే ఉండు అని దశరథ, శివన్నారాయణ వెళ్లిపోతారు. ఉన్నట్లుండి ఫుడ్ సేఫ్టీ వాళ్లు రైడ్ కు రావడం ఏంటీ? అని కార్తీక్ అనుకుంటాడు. వేలం పాట జరుగుతుంది. రూ.10 కోట్ల ప్రాపర్టీ వాల్యూకు జ్యోత్స్న రూ.12 కోట్ల వేలం పాట పాడటంతో ఇదేంటీ అని కార్తీక్ అనుకుంటాడు. జ్యోత్స్న, వైరా ఎంతకీ తగ్గరు.
రూ.20 కోట్లు
దశరథ కూతురి చేతిలో ఓడిపోవాలా? అది నాకు చావుతో సమానం. దశరథతో పోటీపడాలనుకున్నా కానీ వాడు, వాడి బాబు పారిపోయారు. రూ.20 కోట్లు దాటించి ఆపేస్తానని వైరా అంటాడు. రూ.20 కోట్లకు వేలం పాడతాడు. వైరా టార్గెట్ ఏంటో అర్థమైంది? జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కు కోలుకోలేని నష్టం తేవాలనుకుంటున్నాడు. ముందే జ్యోత్స్నను రెచ్చగొట్టాడు. ఇంకా ఇక్కడే ఆపేయాలని కార్తీక్ అనుకుంటాడు.
నా పాట దాటి పాడే సత్తా ఎవరికీ లేదు అని జ్యోత్స్నను రెచ్చగొడతాడు వైరా. జ్యోను ఆపాలని కార్తీక్ ఫోన్ పట్టుకుని బయటకు వెళ్తాడు. జ్యో నా పాట అనేసరికి ఫోన్ రింగ్ అవుతుంది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసిన జ్యో నువ్వే గెలిచావని కంగారుగా వెళ్లిపోతుంది. వైరా బుక్కయిపోతాడు.
కాశీ కాఫీ తిప్పలు
బయటకు వచ్చిన జ్యోత్స్న నువ్వు ఇక్కడున్నావ్ ఏంటీ? అని కార్తీక్ ను అడిగితే, కంపెనీని కాపాడటానికి అని కార్తీక్ చెప్తాడు. ఫోన్ కాల్ నేనే చేయించానని అంటాడు. మరోవైపు అత్తయ్యను కాఫీ ఇవ్వమని అడగాలా వద్దా అని సందేహంలో ఉంటాడు కాశీ. స్వప్న కాఫీ పట్టుకుని మీ ఆయనకు ఇచ్చి రా అని శ్రీధర్ చెప్తాడు. థ్యాంక్స్ దిల్లు నేనే అడుగుదామనుకున్నానని కాశీ చెప్తాడు.
అడగకుండానే కాఫీ ఇవ్వాలని స్వప్నతో అంటాడు కాశీ. ఇప్పుడు తమరి భర్తకు జాబ్ లేదు. బంధువులకు అడ్డమైన విషయాలు కావాలి. అల్లుడు మనసులో పెట్టుకుని బాధపడతాడు. ఇలాంటి టైమ్ లో భార్య సపోర్ట్ గా ఉండి ధైర్యం చెప్పాలి. అతని అలవాట్లు భార్యగా నువ్వు తెలుసుకోవాలి. మీ అమ్మ నా విషయంలో ఎలా ఉంటుందో నువ్వు అతని విషయంలో అలా ఉంటే చాలని శ్రీధర్ చెప్తాడు.
జ్యోత్స్నకు కోపం
నా గెలుపును ఓర్చుకోలేని వాళ్లు నా చుట్టూనే ఉన్నారని ముందే చెప్పా కదా తాత. వాళ్లెవరో కాదు వీళ్లిద్దరే అని కార్తీక్, దీపపై అరుస్తుంది జ్యోత్స్న. ఇంకో రూ.కోటి పాడి ఉంటే ఆ రెస్టారెంట్ నాది అయ్యేది? నువ్వు ఆ వైరాకు అమ్ముడుపోయావా బావ? ఎంత ఇచ్చారు నీకు? అని జ్యో అడుగుతుంది. ఇదంతా ట్రాప్ అని కార్తీక్ చెప్పబోతుంటే జ్యోత్స్న వినదు.
శివన్నారాయణ ఫైర్
శివన్నారాయణ కూడా కార్తీక్ పైనే అరుస్తాడు. నువ్వెవరివి రా నా మనవరాలి పాట ఆపడానికి? పాపం తనేదో వేలం పాటలో రెస్టారెంట్ దక్కించుకుని తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే ఎందుకు ఆపావు? నీ లాంటి వాళ్లు ఇంట్లో ఉండటానికి వీల్లేదు. జ్యోత్స్న వెళ్లి అగ్రిమెంట్ తీసుకుని రా అని ఫైర్ అవుతాడు శివన్నారాయణ.
నా కూతురి జీవితంలోకి ఏ సంతోషాన్ని వీళ్లు రానివ్వరు. అది మాత్రం అర్థమవుతోందని సుమిత్ర అంటుంది. మీ భార్యభర్తలు కలిసి ఇన్నాళ్లు మాకు చేసిన మంచి చాలు అని శివన్నారాయణ అంటాడు. కార్తీక్ చేతిలో అగ్రిమెంట్ పెట్టి భార్యను తీసుకుని బయటకు వెళ్లమంటాడు. వీడు తప్పు చేశాడా లేదా జ్యోత్స్న. వీడిని ఇలాగే వదిలేయాలా? అని శివన్నారాయణ అడుగుతాడు. మెడ పట్టుకుని బయటకు గెంటేయాలని జ్యో అనడంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
