గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనా మరణ వాంగ్మూలం- ప్రభావతిపై గృహహింస కేసు- బాలుపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన శివ

Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనా మరణ వాంగ్మూలం- ప్రభావతిపై గృహహింస కేసు- బాలుపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన శివ

Sanjiv Kumar HT Telugu

గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 6 ఎపిసోడ్‌లో మీనా ఇంట్లోంచి వెళ్లిపోయిందని అంతా వెతుకుతాడు బాలు. ఇంటికొచ్చిన కామాక్షి నీ మీద మీనా గృహహింస కేసు పెట్టింది. ఇన్నాళ్లు భరించిన మీనా ఇవాళ తెగించింది అని ప్రభావతితో అంటుంది. బాలుపై మీనా తమ్ముడు శివ పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. శివతో బాలు గొడవ పడతాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 6 ఎపిసోడ్‌

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో మీనా పుట్టింటికి బాల్ కాల్ చేసి అడిగితే.. అక్క అక్కడ లేదని సుమతి చెబుతుంది. మా అక్క అక్కడ ఎందుకు లేదు అని సుమతి అంటుంది. పూలు ఇవ్వడానికి వెళ్లింది. ఇంకా రాలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది అందుకే నీకు చేశా అని బాలు అంటాడు. బావ నిజం చెప్పు. ఏమైనా గొడవ జరిగిందా అని సుమతి అడుగుతుంది.

మందు కొట్టి ఏదో చేసి ఉంటాడు

మీ అక్క గురించి నాకంటే నీకే బాగా తెలుసు. తను గడప దాటేది కాదు. నువ్వు కంగారుపడి మీ అమ్మను కంగారుపెట్టకు అని బాలు ఫోన్ కట్ చేస్తాడు. సుమతి మాట్లాడంగా విన్న పార్వతి వచ్చి అడుగుతుంది. ఇంతలో శివ వస్తాడు. అక్క ఇంట్లో లేదట. ఇక్కడికి వచ్చిందేమో అని కాల్ చేశాడు అని సుమతి అంటుంది. వాడే ఏదో చేసి ఉంటాడు అక్కని. మందు కొట్టి ఏదో చేసి ఉంటాడు అని శివ అంటాడు.

మరోవైపు సత్యం ఇంట్లో అంతా భోజనం చేస్తుంటారు. హడావిడిగా చేసిన రోహిణి బాగా చేసింది. ఈ రసం బాగుంది. ఇటివ్వు అని మనోజ్ అంటాడు. అది రసం కాదు సాంబార్ అని రోహిణి అంటుంది. ఏంటి సాంబారా ఇంత నీళ్లలా ఉందేంటీ అని రవి అంటాడు. ఏదోటి చేసిందిగా అన్న మనోజ్ ఆ కొబ్బరి చట్నీ ఇవ్వమంటే.. అది పుదీనా చట్నీ అని రోహిణి చెబుతుంది. ఇంత తెల్లగా ఉందేంటని శ్రుతి అడిగితే.. పుదీనా తక్కువ ఉందని మైదా కలిపానని చెబుతుంది రోహిణి.

దాంతో శ్రుతి, రవి రోహిణి వంటకు భయపడతారు. ఏదోటి చేసిందిగా తినండి అని ప్రభావతి వెనుకేసుకొస్తుంది. పిజ్జా తినాలనిపిస్తుంది. ఆర్డర్ పెట్టుకుంటానని శ్రుతి వెళ్లిపోతుంది. సత్యం అటు ఇటు తిరుగుతుంటాడు. సత్యంను తినడానికి రమ్మని ప్రభావతి చెబుతుంది. కోడలి లేదని కొంచెం అయినా ఉందా అని సత్యం తిడతాడు. నాకు చెప్పి వెళ్లిందా ఏంటీ అని పట్టించుకోదు ప్రభావతి.

మీనాను బాధపెడితే పాపంరా

బాలు వచ్చి మీనా వాళ్ల పుట్టింట్లో కూడా లేదని చెబుతాడు. ఒకవేళ బాలు మీద కోపంతో మీనా వెళ్లిపోయిందేమో. వాళ్లు గొడవ పడ్డారుగా అని రోహిణి అంటుంది. ఏరా చిన్న మాట అన్నావ్. ఇంకా నీకు పెళ్లి జరిగిన విషయాన్ని మర్చిపోవా. మీ అమ్మను భరిస్తూ ఉంటుంది. అలాంటి మీనాను ఇంకా బాధపెడితే పాపంరా. ఎక్కడుందో ఏంటో అని సత్యం అంటాడు.

నిజంగానే మీనా వెళ్లిపోయిందా అని రోహిణి అంటే.. నాకు అదే అనిపిస్తుంది. ఎప్పుడో వెళ్లిపోవాల్సింది అని ప్రభావతి అంటుంది. దాంతో ప్రభావతిపై అరుస్తాడు సత్యం. మీనాను వెతకడానికి వెళ్తాడు. మీనా ఏమైనా చేసుకుంటేదేమో భయంగా ఉందని బాలు అంటే తను అలా మూర్ఖంగా ఆలోచించదు అని రాజేష్ అంటాడు. రవి వచ్చి పూలకొట్ల దగ్గర అడిగాను. ఎవరికి తెలియదన్నారని అంటాడు.

అది రాదు. వాడితో వేగలేక, బతకలేక వెళ్లిపోయింది అని ప్రభావతి అంటుంది. నీ నోటికి మంచి మాటలే రావా. వాడు మీనాను బంగారంలా చూసుకుంటున్నాడు. నీ నుంచి కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆ మాటకొస్తే నీలాంటిదాన్ని పెళ్లి చేసుకున్న నేను వదిలేసి సన్యాసుల్లో కలిసిపోవాలి. పనిలేకుండా పార్కుల్లో పడుకున్న మనోజ్ గాడిని వదిలేసి రోహిణి వెళ్లిపోవాలి అని సత్యం అంటాడు.

ఇంటికి వచ్చిన కామాక్షి

బాలు, మీనా కష్టసుఖాల్లో ఉన్నారు అని సత్యం అంటాడు. దెయ్యాలు వేదాలు వల్లిస్తాయా. అమ్మ ఎప్పుడైనా మనోజ్ గురించి తప్పా మంచిగా మాట్లాడిందా అని రవి అంటాడు. కామాక్షి ఇంటికి వెళ్లిందేమో కాల్ చేసి అడుగు అని సత్యం అంటాడు. దాంతో మీనా అక్కడికి వచ్చిందా అని కామాక్షిని అడిగేసరికి వెంటనే ఇంటికి వచ్చేస్తుంది కామాక్షి. ఏమైందని అడుగుతుంది.

ఇంట్లోంచి వెళ్లిపోయిందని బాలు అన్నదాని గురించి, తను అన్నది మొత్తం చెబుతుంది ప్రభావతి. వాడు సరదాగా అంటే నీకు బుద్ధి లేదా అని కామాక్షి అంటుంది. ఇంతలో మనోజ్, రోహిణి వస్తారు. మీ ముగ్గురికి ఉంటుంది. మీ ముగ్గురు కలిసేగా అపహాస్యం చేసింది. వెళ్లి గృహహింస కేసు పెట్టిందేమో. పోలీసులు వస్తారేమో. మీ ముగ్గురిని తీసుకెళ్తారు అని కామాక్షి అంటుంది.

ఇవాళ తిట్టింది అంటే అన్నింటికి తెగించిందన్నమాట. ఏనాడు నిన్ను అనని మీనా ఇవాళ అందంటే అంతేగా అని కామాక్షి అంటుంది. మేమేం అనలేదు మాకేం సంబంధం లేదు అని మనోజ్, రోహిణి వెళ్లిపోతారు. కేసు అనగానే నిన్ను ఇరికించి వాళ్లు వెళ్లిపోతున్నారు. నీకు ఇలాంటి వాళ్లంటేనే ఇష్టం అని కామాక్షి అంటుంది. మీనా కోసం పూలకొట్ల దగ్గర వెతుకుతాడు బాలు.

వేడుకున్న బాలు

మీనా ఎంతకు దొరకపోవడంతో గుడికి వెళ్లి చేతులెత్తి దండం పెట్టుకుని మొక్కుకుంటాడు. తను ఒక్కపూట కనిపించకపోయేసరికి ఒంటరితనం వెంటాడుతుంది. మనికిష్టమైన వాళ్లు దూరమైతే వాళ్లేంటో తెలుస్తుంది. అది నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇంకెప్పుడు మీనాను అనను. తనను నా దగ్గరికి పంపించు అని బాలు వేడుకుంటాడు.

మరోవైపు అంతా అయిపోయింది. నీ పరువు అంతా పోయింది. కడుపులో పెట్టుకోవాల్సిన కోడలిని పొట్టన పెట్టుకున్నావ్. నీ చేతికి ఇనుప సంకెళ్లు వేస్తారు. నిన్ను వెలివేస్తారు. కటకటాల వెనక్కి నెట్టేస్తారు. ఈరోజుతో ప్రభావతి శకం ముగుసిపోతుంది అని కామాక్షి అంటుంది. దాంతో ప్రభావతి తెగ వణికిపోతుంది. గృహిణి ఆత్మహత్య వంటివి వినలేదా అని కామాక్షి అంటుంది.

అదంతా పిరికిది కాదు. కొమ్ములు తిరిగిన మగాళ్లనే ఇటుకరాయితో కొట్టింది అని ప్రభావతి అంటుంది. మీనా బతికి ఉంటే ఓకే లేకపోతే అంటూ ఏడుస్తుంది కామాక్షి. ఇంతలా బెదరగొడుతున్నావ్ ఏంటీ. సలహా ఇవ్వు అని ప్రభావతి అంటుంది. పద మీనా గది వెతుకుదాం. ఏదైనా లెటర్ ఉండొచ్చు. అది ఉభయకుశలోపరి ఉత్తరం కాదు మరణ వాంగ్మూలం అని కామాక్షి అంటుంది.

శివ పోలీస్ కంప్లైంట్

దాంతో మీనా గదిలో కామాక్షి, ప్రభావతి రహస్యంగా వెతుకుతుంటే శ్రుతి, రోహిణి వస్తారు. వాళ్లిద్దరిని చూసి కామాక్షి, ప్రభావతి చూసి ఉలిక్కిపడతారు. వాళ్లకు విషయం చెప్పి వెతకమంటుంది కామాక్షి. శ్రుతికి ఓలెటర్ దొరుకుతుంది. మరోవైపు శివకు గుణ ఎక్కిస్తాడు. భార్యాభర్తల గొడవలు హత్యలకు దారితీస్తాయి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోతే ఎలా అని చెబుతాడు గుణ.

దాంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బాలుపై కంప్లైంట్ ఇస్తాడు శివ. అప్పుడే బాలు వస్తాడు. శివతో బాలు గొడవ పడతాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024