





Best Web Hosting Provider In India 2024

పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ.. రష్మికతో ఎంగేజ్‌మెంట్ రింగ్ కనిపెట్టేసిన ఫ్యాన్స్
రష్మిక మందన్నాతో ఎంగేజ్‌మెంట్ తర్వాత పుట్టపర్తిలోని సత్యసాయిబాబా మహా సమాధి దగ్గరికి వెళ్లాడు విజయ్ దేవరకొండ. ఫ్యామిలీతో కలిసి అతడు వెళ్లగా.. అతని చేతికి ఉన్న రింగు అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
సెలబ్రిటీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గత వారం హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారని అతని టీమ్ ధృవీకరించింది. ఈ జంట తమ సోషల్ మీడియాలో ఎంగేజ్‌మెంట్ గురించి పోస్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు నిశ్చితార్థం తర్వాత విజయ్ తన కుటుంబంతో కలిసి పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మహా సమాధిని సందర్శించాడు.
పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ
రష్మిక మందన్నాతో ఎంగేజ్‌మెంట్ తర్వాత విజయ్ దేవరకొండ ఆదివారం (అక్టోబర్ 5) పుట్టపర్తి వెళ్లాడు. అతని పీఆర్ఓ తన సోషల్ మీడియాలో పుట్టపర్తి సందర్శనకు సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేస్తూ.. “దివ్య ఆశీస్సుల కోసం విజయ్ దేవరకొండ.. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మహా సమాధిని పుట్టపర్తిలో సందర్శించాడు” అని రాశారు.
ఈ వీడియోలో నటుడితో పాటు అతని సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండ, తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి ఉన్నారు. పుట్టపర్తి మేనేజ్‌మెంట్ అతనికి స్వాగతం పలికి శ్రీ సత్యసాయిబాబా ఫొటోను, ఒక బొకేను అందజేసి లోపలికి తీసుకెళ్లారు. అయితే అభిమానులందరి కళ్ళు మాత్రం అతని చేతి వేలికి ఉన్న ఎంగేజ్‌మెంట్ రింగుపైనే ఉన్నాయి.
విజయ్ చేతికి రింగు
విజయ్ పుట్టపర్తి సందర్శనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చక్కర్లు కొట్టడం ప్రారంభించాయి. ఇందులో చాలా మంది అభిమానులు అతడు పెట్టుకున్న నిశ్చితార్థపు ఉంగరాన్నే హైలైట్ చేశారు. ఒక అభిమాని ఆ ఉంగరం ఫొటోలను పోస్ట్ చేస్తూ.. “మీరంతా ‘ఫేక్’ అన్నారు బ్రో! అతడు దాన్ని తన వేలికి చూపించాడు” అని రాశారు.
మరొక అభిమాని స్పందిస్తూ.. “నా ప్రేమకు చివరికి నిశ్చితార్థం జరిగింది. ఆ ఉంగరం అన్నింటికీ సమాధానం చెబుతోంది. స్వచ్ఛమైన ఆనందం ప్రేమ” అని రాశారు. ఇంకొక అభిమాని వేరే ఫొటోలను పోస్ట్ చేస్తూ.. “ది ఎంగేజ్‌మెంట్ రింగ్!! అభినందనలు” అని కామెంట్ చేశారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్‌షిప్
విజయ్, రష్మిక 2018లో వచ్చిన హిట్ మూవీ ‘గీత గోవిందం’లో కలిసి పనిచేసినప్పటి నుండి డేటింగ్‌లో ఉన్నారనే వదంతులు వినిపిస్తున్నాయి. 2019లో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ మూవీలో కూడా వారి కెమిస్ట్రీని అభిమానులు బాగా ఇష్టపడ్డారు.
అయితే 2018లో, ఆ తర్వాత 2022లో కూడా విజయ్, అతని కుటుంబం ఒక బ్రెజిలియన్ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఆమెనే అతని గర్ల్‌ఫ్రెండ్ అని చాలా మంది భావించారు.
కానీ 2023లో మాల్దీవుల్లో విజయ్, రష్మిక ఇద్దరూ కలిసి వెకేషన్‌లో ఉన్నారని, వారు పోస్ట్ చేసిన ఫొటోల ద్వారా గమనించిన అభిమానులు వారు రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే వదంతులకు మరింత బలం చేకూర్చారు. ఈ జంట వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకోనుంది.
సంబంధిత కథనం
