




Best Web Hosting Provider In India 2024

భారత నౌకదళంలోకి మరో యుద్ధనౌక ఆండ్రోత్.. ఇందులో అనేక ప్రత్యేకతలు!
భారత నౌకదళంలోకి మరో యాంటి సబ్ మెరైన్ వార్‌ఫైర్ ఐఎన్ఎస్ ఆండ్రోత్ చేరింది. కలకత్తాకు చెందిన ఈ నౌక.. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది.
విశాఖపట్నంలో భారత నౌకదళంలోకి మరో యాంటి సబ్ మెరైన్ వార్‌ఫైర్ ఐఎన్ఎస్ ఆండ్రోత్ చేరింది. స్వదేశీ పరిజ్ఞాన్ని ఎక్కువగా ఉపయోగించి దీన్ని తయారు చేశారు. ఐఎన్ఎస్ ఆండ్రోత్‌ను ఈఎన్‌సీ చీఫ్ పెందార్కర్ ప్రారంభించారు. భారత నావికాదళంలో రెండో యాంటి సబ్‌మెరైన్ వార్‌ఫైర్‌గా చేరింది ఐఎన్ఎస్ ఆండ్రోత్. మూడు నెలల క్రితం ఐఎన్ఎస్ ఆర్నాల మెుదట యాంటి సబ్ మెరైన్ వార్‌ఫైర్‌గా భారత నౌకదళంలో చేరిన విషయం తెలిసిందే.
ఆండ్రోత్‌ను నౌకను కలకత్తాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్లింగ్ అండ్ ఇంజినీర్స్ కంపెనీ తయారు చేసింది. లక్షద్వీప్ దీవుల్లో ఒక దీవీ పేరు మీదుగా ఐఎన్ఎస్ ఆండ్రోత్‌కు నామకరణం చేశారు. ఈ నౌకతో భారత సముద్ర భద్రత మరింత బలపడనుంది. సముద్ర తీర ప్రాంతాల్లో సబ్ మెరైన్ ధ్వంసం, కంట్రోల్, కోస్టల్ ప్రొటెక్షన్ కోసం ఆండ్రోత్‌ను ఉపయోగిస్తారు. తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో శత్రు జలాంతర్గాములను సులభంగా గుర్తించి నాశనం చేయగలదు.
ఈ నౌకను కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (GRSE) నిర్మించింది. దానిలోని 80 శాతం కంటే ఎక్కువ భాగాలు దేశీయంగా తయారు చేసినవే. కొత్త సాంకేతికత, స్వదేశీ పరిష్కారాలపై నావికాదళం ఆధారపడటం గురించి ఇది చెబుతుంది. GRSE ద్వారా రూపొందించిన దీనికి భారతీయ పరిశ్రమలు, షిప్‌యార్డుల నుండి చాలా సహకారం అందింది. ఇది నావికాదళ సామర్థ్యాలను పెంచడమే కాకుండా దేశ సముద్ర భద్రతను కూడా బలోపేతం చేస్తుంది.
ఇటీవలి నెలల్లో, నావికాదళం అర్నాలా, నిస్టార్, ఉదయగిరి, నీలగిరి, ఇప్పుడు ఆండ్రోత్ వంటి అనేక కొత్త నౌకలను చేర్చుకుంది. ఆండ్రోత్ రాకతో నావికాదళం జలాంతర్గామి సామర్థ్యాలు బలపడతాయి. ఈ రోజుల్లో శత్రు జలాంతర్గాములు తీరం దగ్గర నుండి దాడి చేయగలవు. ఈ నౌక అటువంటి ముప్పులను ఎదుర్కోవడంలో నైపుణ్యం కలిగి ఉంది. తూర్పు నావికాదళం దీనితో మరింత బలోపేతం అవుతుంది.
ఆండ్రోత్ అత్యాధునిక తేలికపాటి టార్పెడోలు, సబ్‌మెరైన్ల విధ్వంసక రాకెట్లను కలిగి ఉంది. దేశ సముద్ర భద్రతలో ఈ నౌక కీలకంగా నిలుస్తుందని నేవీ అధికారులు చెబుతున్నారు. ఆండ్రోత్ యుద్ధ నౌకలో దేశీయంగా రూపొందించిన 30 ఎంఎం సర్ఫేస్ గన్ ఉంది. లోతు తక్కువగా ఉన్న జలాల్లోని జలాంతర్గాములను వేటాడే 16 అధునాతన నౌకలకు నేవీ ఆర్డర్ పెట్టింది.
టాపిక్
