





Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:ఇదంతా నీ కూతురి కోసమే అత్త-కుండబద్ధలు కొట్టిన కార్తీక్-మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్-జ్యో షాక్
కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 7వ తేదీ ఎపిసోడ్ లో జ్యోత్స్నపై ఫైర్ అవుతారు శివన్నారాయణ, దశరథ. రూ.11 కోట్లు నష్టం రాకుండా కార్తీక్ కాపాడాడని, అగ్రిమెంట్ పేపర్లు తీసుకుని వెళ్లమంటాడు. కానీ కార్తీక్ వెళ్లడు. సుమిత్ర అడిగితే నీ కూతురి కోసమే ఇదంతా చేస్తున్నానని కుండబద్ధలు కొడాతాడు. జ్యోకు షాక్ ఇస్తాడు.
కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 7వ తేదీ ఎపిసోడ్ లో అగ్రిమెంట్ పేపర్లు తీసుకుని కార్తీక్ ను వెళ్లిపొమ్మంటాడు శివన్నారాయణ. మెడ పట్టుకుని బయటకు గెంటేయాలని జ్యోత్స్న అనగానే నోర్ముయ్ అని గట్టిగా అరుస్తాడు శివన్నారాయణ. ఈ మాట అనే అర్హత ఉందా నీకు? నాకున్న కోపానికి నిన్ను కొట్టకుండా ఉండటానికి నా వల్ల కావట్లేదు. నువ్వు అసలు మనిషివేనా? నీకు బుద్ధి ఉందా? అని శివన్నారాయణ ఫైర్ అవుతాడు.
వైరాకు కాల్
వేలం పాటను ఆపి మనకు నష్టం తీసుకొచ్చిన కార్తీక్ ను తిట్టకుండా జ్యోత్స్నను అంటారేంటీ అని సుమిత్ర అడుగుతుంది. ఎవరు నష్టం రాకుండా ఆపారో అందరికీ తెలిసేలా చేయమని దశరథకు చెప్తాడు శివన్నారాయణ. వైరాకు కాల్ చేస్తాడు దశరథ. రూ.10 కోట్ల విలువైన ప్రాపర్టీని రూ.20 కోట్ల వరకూ పాడేలా చేశావు. నేను ఆపేద్దామనుకునే టైమ్ లో నువ్వు నీ కూతురితో ఆపించి దెబ్బ కొట్టావని వైరా అంటాడు. ఏం చేసుకుంటావో చేసుకోమని దశరథ కాల్ కట్ చేస్తాడు.
నష్టం రాకుండా
రెస్టారెంట్ మీద ఫుడ్ సేఫ్టీ రైడ్ అని తెలిసి వెళ్లిపోయాం. కానీ అలా చేసింది జ్యోత్స్న అని తెలిసింది. అప్పటికే డౌట్ వచ్చి కార్తీక్ ను వేలం పాట దగ్గరే ఉండమన్నా. రూ.10 కోట్ల విలువ చేసే ప్రాపర్టీని వాడు తెలివిగా రూ.19 కోట్ల వరకూ జ్యోత్స్నతో పాడించాడు. జ్యోత్స్న గెలవాలని 21 అనేలా ఉంది. అప్పుడు మనకు రూ.11 కోట్ల నష్టం వచ్చేది. ఆ టైమ్ లో కార్తీక్ ఫోన్ చేసి చెప్పాడని దశరథ అంటాడు. వెంటనే ఫేక్ కాల్ చేసి జ్యోత్స్నను ఆపించానని కార్తీక్ చెప్తాడు.
సిగ్గు లేకుండా
వైరా ఎవరో నాకు తెలియకపోయినా వచ్చీ రాగానే వార్నింగ్ ఇచ్చాడు. అందుకే అంత పోటీకి పాడా. బావ ఆపకపోయి ఉంటే నేనే ఆపేదాన్ని అని జ్యోత్స్న అంటుంది. సిగ్గు లేకుండా నిన్ను నువ్వు ఎలా సమర్థించుకుంటున్నావ్? అక్కడ నీ అహానికి పోయి కంపెనీకి మరింత నష్టాన్ని తీసుకొచ్చే పని చేశావని దశరథ అంటాడు. నిన్ను నేను సీఈఓ ఎలా చేశానో నాకే అర్థం కావడం లేదని శివన్నారాయణ ఫైర్ అవుతాడు.
రూ.11 కోట్లు
కార్తీక్ నీలాంటి తెలివైనోడిని ఇంకా డ్రైవర్ గా ఉంచుకోలేను. అగ్రిమెంట్ తీసుకొని వెళ్లు. ఈ రోజు రూ.11 కోట్లు నష్టం రాకుండా కాపాడాడు. అంటే డబ్బు కట్టినట్లే. కార్తీక్ నీ భార్యను తీసుకుని వెళ్లు అని శివన్నారాయణ అంటాడు. పెద్ద మేడం చెప్తేనే వెళ్తానని కార్తీక్ అంటాడు. వెళ్లిపో అని చెప్పు జ్యోత్స్న అని దశరథ అడుగుతాడు. బావ ఎక్కడికి వెళ్లడు. బావ లాంటి తెలివైన మనిషి నా లాంటి సీఈఓకు అవసరమని జ్యో అంటుంది. కార్తీక్ నేను చెప్తున్నా వెళ్లిపో అని శివన్నారాయణ మళ్లీ చెప్తాడు.
డ్యూటీలో జాయిన్ అయిన రోజే అన్నీ నేనే అని చెప్పారు. ఇప్పుడు కూడా యజమానికి మేలు చేశా. పెద్ద మేడం వెళ్లిపొమ్మని చెప్తే వెళ్లిపోతా. లేకపోతే ఇలాగే ఉంటానని అగ్రిమెంట్ ఇచ్చేసి కార్తీక్ వెళ్లిపోతాడు. నా భర్త మంచి కోసం నిలబడ్డాడు. అలాంటి మనిషికి నేనేం చెప్పాలి. మా బావ ఎవరికైనా మాటిస్తే దాని కోసం ఏదైనా వదులుకుంటాడని దీప అంటుంది.
ఒట్టేసి చెప్పు
నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు. నువ్వు చాలా తెలివైనోడివి. నువ్వు ఒక జవాబు చెప్పాలి. ఒట్టేసి నిజం చెప్తానని చెప్పు. అగ్రిమెంట్ రద్దు చేసుకోవడానికి దొరికిన అవకాశాలు వదిలేసి ఈ ఇంట్లో ఊడిగం చేయాలి? ఎందుకు డ్రైవర్ గా ఉండిపోతున్నావని అడుగుతుంది సుమిత్ర. కారణం నీ కూతురు అత్త. నీ కూతురి కోసమే ఇదంతా చేస్తున్నా. ఎందుకు, ఏంటీ అనే ప్రశ్నలకు అతి త్వరలోనే సమాధానాలు దొరుకుతాయని కార్తీక్ తెలివిగా చెప్తాడు.
పారు కంగారు
నీ కూతురి కోసమే అన్నావు కదా ఏంటీ సంబంధం అని కిచెన్ లోకి వచ్చి జ్యోత్స్న అడుగుతుంది. కారణం ఏంటంటే? నీకు బుద్ధి చెప్పడానికి అని కార్తీక్ అంటాడు. రెండింటికీ సంబంధం ఏంటీ అని పారిజాతం అడిగితే, ఏ పెద్ద మేడం సుమిత్ర మేడం కూతురు కాదా చెప్పండని కార్తీక్ అంటాడు. సుమిత్ర నవమాసాలు మోసి మరీ జన్మనిచ్చింది. నేనే పక్కనున్నానని పారు కంగారు పడుతూ చెప్తుంది.
పాలు పట్టడం, ఊయలలో వేయడం, ఊయల మార్చడం అని కార్తీక్ అనగానే పారు టెన్షన్ పడుతుంది. నువ్వు చెప్పు బావ నాకు బుద్ధి చెప్పడం ఏంటీ? అని జ్యో అడుగుతుంది. మన ఇద్దరి మధ్య తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. ఇప్పుడే ఇంటర్వెల్ వచ్చింది. సెకండాఫ్ ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటుందని కార్తీక్ అంటాడు. బావ ఇంత షాక్ ఇచ్చాడేంటీ అని జ్యో అనుకోవడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్
