




Best Web Hosting Provider In India 2024

ఏపీలో పీహెచ్డీ అడ్మిషన్లు : ఇవాళ్టి నుంచే ఆన్ లైన్ దరఖాస్తులు – నవంబరులో ఎంట్రెన్స్ పరీక్షలు
ఏపీ రీసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (APRCET) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. నవంబర్ నెలలో ఎంట్రెన్స్ పరీక్షలు జరుగుతాయి. https://cets.apsche.ap.gov.in/ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ లో పీహెచ్డీ ప్రవేశాల కోసం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (APRCET) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే అర్హులైన అభ్యర్థుల నుంచి ఇవాళ్టి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. పూర్తి వివరాల కోసం https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్ చూడొచ్చు,
APRCET – 2024 ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలో ఉన్న పలు యూనివర్శిటీల్లో పీహెచ్డీ ప్రవేశాలను కల్పించనున్నారు. ఇందులో ఫుల్ టైమ్/పార్ట్ టైమ్ ప్రవేశాలు కూడా ఉంటాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి పీజీ పూర్తి చేసి ఉండాలి. సెట్, నెట్ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి.ప్రవేశ పరీక్ష, ఇంటర్వూ ద్వారా తుది జాబితా ప్రకటిస్తారు. ఈ పరీక్ష బాధ్యతలను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం చూస్తోంది.
నవంబర్ లో ఎంట్రెన్స్ పరీక్షలు,,,
పీహెచ్డీ ప్రవేశాల కోసం APRCET ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. నవంబర్ 3వ తేదీ నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. నవంబర్ 7తో అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఫీజును ఏపీ ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ చేయవచ్చు.
ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా ఆర్ట్స్, సైన్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, ఫైన్ ఆర్ట్స్, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ ప్లానింగ్, లా తో పాటు మరికొన్ని కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
సంబంధిత కథనం
టాపిక్
