




Best Web Hosting Provider In India 2024

హలో స్టూడెంట్స్.. ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేశారా? లేదా? మరికొన్ని రోజులే టైమ్!
NMMS Scholarship 2025 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకొచ్చిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ (ఎన్ఎంఎంఎస్) స్కాలర్ షిప్స్ పరీక్ష దరఖాస్తుకు మరికొన్ని రోజుల్లో గడువు ఉంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నాలుగేళ్ల పాటు స్కాలర్ షిప్ అందిస్తారు.
2025 నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్స్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారా? మరికొన్ని రోజులే టైమ్ మిగిలి ఉంది. అక్టోబర్ 15వ తేదీతో సమయం ముగుస్తుంది. ఎన్ఎంఎంఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నాలుగు సంవత్సరాలు స్కాలర్ షిప్ అందుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. కుటుంబ సంవత్సర ఆదాయం రూ. 3,50,000 లోపు ఉండాలి. అలాగే ఏడో తరగతిలో 55 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 5 శాతం మార్కులు సడలింపు ఉంటుంది. నమోదు చేసే సమయంలో విద్యార్థి ఆధార్ కార్డ్‌లో ఉన్న విధంగానే విద్యార్థి పేరు నమోదు చేయాలి.
పరీక్ష రాసే సమయానికి అన్ని ధృవపత్రాలు సిద్ధం చేసుకోవాలి. అందులో ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికేట్, గతేడాది మార్క్స్ మెమో, ఇన్‌కమ్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొట కావాలి. పరీక్ష రుసుము ఓసీ, బీసీ విద్యార్దులకు రూ.100, ఎస్‌సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 50గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయ వెబ్‌సైటు www.bse.ap.gov.in లో లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తెలుసుకోవచ్చు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ స్కాలర్‌షిప్ అందిస్తోంది. ఎన్ఎంఎంఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.12 వేలు చొప్పున మొత్తం రూ.48 వేలు స్కాలర్ షిప్ అందిస్తారు. 7, 8 తరగతి పాఠ్యాంశాల ఆధారంగా పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో రెండు విభాగాల్లో పరీక్ష ఉంటుంది. మొదటి విభాగంలో మానసిక సామర్థ్య పరీక్ష, రెండో పేపర్ విషయ సామర్థ్యంపై మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు.
ఒక్కో విభాగానికి 90 మార్కులు ఉంటాయి. మొత్తం 180 మార్కులతో ప్రశ్నాపత్రం ఉంటుంది. ఈ పరీక్ష రాసేందుకు విద్యార్థులకు మూడు గంటల సమయం. అర్హత సాధించిన వారికి నాలుగేళ్ల పాటు 9,10, రెండేళ్లు ఇంటర్మీడియట్ కోసం ప్రతి ఏటా రూ.12 వేలు స్కాలర్ షిప్ అందిస్తారు. అయితే తొమ్మిదో తరగతిలో 55 శాతం మార్కులు, పదో తరగతిలో 60 శాతం మార్కులు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 55 శాతం శాతం మార్కులు సాధిస్తేనే స్కాలర్ షిప్ అందుతుంది. అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
టాపిక్
