ఈవారం ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అది వచ్చే ముందే ఈ టాప్ 5 క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూసేయండి

Best Web Hosting Provider In India 2024

ఈవారం ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అది వచ్చే ముందే ఈ టాప్ 5 క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూసేయండి

Hari Prasad S HT Telugu

ఈవారం ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. అయితే ఈ సిరీస్ వచ్చే ముందు ప్రస్తుతం జియోహాట్‌స్టార్, జీ5లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ 5 క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూసేయండి.

ఈవారం ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అది వచ్చే ముందే ఈ టాప్ 5 క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూసేయండి

ఓటీటీ వచ్చిన తర్వాత క్రైమ్ థ్రిల్లర్ జానర్ వెబ్ సిరీస్ కు ఫ్యాన్స్ పెరిగారు. అలాంటి వారి కోసం ఈ శుక్రవారం (అక్టోబర్ 10) జియోహాట్‌స్టార్ లోకి సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ అనే సిరీస్ రాబోతోంది. అయితే అదే జియోహాట్‌స్టార్, జీ5 ఓటీటీల్లో ఇప్పటికే 5 ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటో చూడండి.

స్పెషల్ ఆప్స్ (Special Ops) – జియోహాట్‌స్టార్

ఇప్పటి వరకూ ఇండియన్ ఓటీటీ స్పేస్ లో వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి ఈ స్పెషల్ ఆప్స్. ఇప్పటికే రెండు సీజన్లు జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కే కే మీనన్ రా ఏజెంట్ హిమ్మత్ సింగ్‌గా నటించిన ఇండియన్ స్పై క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. అనేక ఉగ్రదాడుల వెనుక ఉన్న సూత్రధారిని ట్రాక్ చేయడానికి హిమ్మత్ ఒక టాస్క్ ఫోర్స్‌ను నడిపిస్తాడు. నిజ జీవిత గూఢచర్యం, జాతీయ సంఘటనల నుండి ఈ సిరీస్ ప్రేరణ పొందింది. ఈ కథ వివిధ దేశాలలో జరుగుతుంది.

ది నైట్ మేనేజర్ (The Night Manager) – జియోహాట్‌స్టార్

ఇది 2023లో వచ్చిన ఇండియన్ హిందీ భాషా క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్. ఇందులో మాజీ నేవీ ఆఫీసర్ షాన్ సేన్‌గుప్తా (ఆదిత్య రాయ్ కపూర్).. ఆయుధాల డీలర్ శైలేంద్ర ‘షెల్లీ’ రుంగ్టా (అనిల్ కపూర్) అంతర్గత వలయంలోకి చొరబడి, అతని గ్లోబల్ ఆయుధ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయాలని చూస్తాడు. ఇది బ్రిటిష్ షోకు రీమేక్. ఇందులో శోభిత ధూళిపాళ, శాశ్వత ఛటర్జీ, రవి బెహల్ కూడా నటించారు.

గ్యారా గ్యారా (Gyaarah Gyaarah) – జీ5 ఓటీటీ

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సిరీస్ ఇది. ఓ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. ఇందులో ఇద్దరు పోలీసు అధికారులు.. 2016లో ఇన్‌స్పెక్టర్ యుగ్ ఆర్య (రాఘవ్ జుయల్), 1990లో సీనియర్ డిటెక్టివ్ శౌర్య అంత్వాల్ (ధైర్య కర్వా) ప్రతి రోజూ రాత్రి 11:11 గంటలకు ఒక రహస్య వాకీ-టాకీ ద్వారా మాట్లాడుకుంటూ కోల్డ్ కేసులను పరిష్కరిస్తారు. ఈ సిరీస్‌లో కృతికా కామ్ర కూడా నటించింది.

క్రిమినల్ జస్టిస్ (Criminal Justice) – జియోహాట్‌స్టార్

క్రిమినల్ జస్టిస్ జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్. ఇది ఇండియన్ కోర్ట్‌రూమ్ డ్రామా ఆంథాలజీ సిరీస్. ప్రతి కొత్త సీజన్‌లో, అనుభవజ్ఞుడైన లాయర్ మాధవ్ మిశ్రా (పంకజ్ త్రిపాఠి) కొత్త క్రైమ్ కేసులను పరిష్కరిస్తాడు. ఈ కథ ఓ హత్య కేసు, దాని దర్యాప్తు చుట్టూ తిరుగుతుంది. మిశ్రా.. భారతీయ న్యాయ వ్యవస్థలోని సంక్లిష్టతలను నావిగేట్ చేస్తూ, దాగి ఉన్న నిజాలను వెలికితీసి క్లయింట్‌లకు న్యాయం చేస్తాడు.

దురంగా (Duranga) – జీ5 ఓటీటీ

దురంగా కూడా ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది ప్రసిద్ధ సౌత్ కొరియన్ డ్రామా ‘ఫ్లవర్ ఆఫ్ ఈవిల్’ ఆధారంగా రూపొందించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఒక పోలీస్ అధికారి భార్య తన భర్త గురించి దర్యాప్తు ప్రారంభించినప్పుడు.. వాళ్ల వైవాహిక జీవితం ఎలా గందరగోళానికి గురైందో ఇందులో చూపించారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024