





Best Web Hosting Provider In India 2024

మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి ఎన్టీఆర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరికొన్ని గంటల్లోనే డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా అనౌన్స్ చేసింది.
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ మూవీ వార్ 2 డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. గురువారం (అక్టోబర్ 9) నుంచే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. చాలా రోజులుగా స్ట్రీమింగ్ గురించి వార్తలు వస్తున్నా.. బుధవారం నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా అనౌన్స్ చేసింది.
వార్ 2 ఓటీటీ రిలీజ్ డేట్
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 మూవీ ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినా.. ఇప్పటి వరకూ డిజిటల్ ప్రీమియర్ కాలేదు. సుమారు రెండు నెలల తర్వాత మొత్తానికి అక్టోబర్ 9 నుంచి ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళంలలోనూ స్ట్రీమింగ్ కానుంది.
“కోపాన్ని రెట్టింపు చేసుకోండి.. ఆవేశాన్ని రెట్టింపు చేసుకోండి.. వార్ కోసం సిద్ధంగా ఉన్నారా” అనే క్యాప్షన్ తో వార్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ ఇంటెన్స్ లుక్స్ తో ఉన్న పోస్టర్ చూడొచ్చు. థియేటర్లలో మిస్ అయిన వారికి ఓటీటీలో చూసేందుకు ఇది మంచి అవకాశం.
వార్ 2 గురించి..
వార్ 2 అనేది యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లోని ఆరో థ్రిల్లర్ మూవీ. ఇది సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన ఏక్ థా టైగర్ తో ప్రారంభమైంది. టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3 వంటి హిట్ చిత్రాలను ఈ ఫ్రాంచైజీ అందించింది. వార్ 2 చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. వార్ 2 స్క్రిప్ట్ ను శ్రీధర్ రాఘవన్, అబ్బాస్ టైర్వాలా చొప్రా అసలు కథ నుండి రాశారు.
టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ నటించిన 2019 చిత్రం వార్ కు సీక్వెల్ గా వార్ 2 రిలీజైంది. ఈసారి ఈ సినిమాలో ష్రాఫ్ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించారు. బాలీవుడ్ లో తారక్ కు ఇదే ఫస్ట్ మూవీ. అతనితో పాటు కియారా అద్వానీ, అశుతోష్ రాణా, అనిల్ కపూర్ కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు.
వార్ 2 కబీర్ ధలివాల్ (రోషన్) తో ప్రారంభమవుతుంది. ఒకప్పుడు రా లోని అత్యంత విశ్వసనీయ ఏజెంట్ ఇప్పుడు దేశానికి అతిపెద్ద ముప్పుగా మారతాడు. కబీర్ తో సమస్యాత్మక చరిత్రను పంచుకునే స్పెషల్ యూనిట్స్ ఆఫీసర్ మేజర్ విక్రమ్ చలపతి (జూనియర్ ఎన్టీఆర్) మధ్య పోరు ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం.
సంబంధిత కథనం
