




Best Web Hosting Provider In India 2024

రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం.. 67వేలకుపైగా ఉద్యోగాలు!
11వ ఎస్‌ఐపీబీ సమావేశంలో పెట్టుబడులపై లోతుగా చర్చ జరిగింది. రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర లభించింది.
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్ఐపీబీ(State Investment Promotion Board) సమావేశం జరిగింది. ఇందులో మంత్రులు పాల్గొన్నారు. సుమారు మూడు గంటలపాటు సుదీర్ఘంగా ఎస్ఐపీబీ సమావేశం జరగ్గా.. పలు అంశాలపై లోతుగా చర్చించారు.
ఈ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు సమావేశంలో రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించిందని అధికారులు తెలిపారు. ఈ 30 పెట్టుబడులు ఐటీ, ఇంధనం, పర్యాటకం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర రంగాలకు సంబంధించినవి ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 67,000 ఉద్యోగాలను వస్తాయని అధికారులు భావిస్తున్నారు.
’11వ రాష్ట్ర పెట్టుబడి ప్రమోషన్ బోర్డు(SIPB) సమావేశం ఐటీ, ఇంధనం, పర్యాటకం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర రంగాలలో రూ.1.14 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆమోదించింది.’ అని ఒక పత్రికా ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది.
రేడియన్ ఇన్ఫో టెక్ డేటా సెంటర్ రూ. 87,520 కోట్ల పెట్టుబడి ఆమోదం లభించింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇది అని అధికారులు వెల్లడించారు. ఈ పెట్టుబడి అనుమతులపై మాట్లాడుతూ.. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి గత 15 నెలలుగా చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమావేశంలో పెద్ద ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారులను నియమించాలని, ఆ ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేసే బాధ్యతను వారు వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
గతంలో ఎన్నడూ ఇంత పెద్ద స్థాయిలో ఎఫ్‌డీఐ రాలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. రేడియన్ ఇన్ఫో టెక్ డేటా సెంటర్ ఏర్పాటు కొత్త చరిత్రను లిఖిస్తుందని ఎస్ఐపీబీ సమావేశంలో అధికారులు అన్నారు. ఇప్పటి వరకు జరిగిన 11 ఎస్ఐపీబీ సమావేశాల ద్వారా రూ. 7 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆమోదం లభించింది. వీటి ద్వారా 6.2 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
టాపిక్
