బ్రహ్మముడి అక్టోబర్ 9 ఎపిసోడ్: తాత మాట లెక్కచేయని రాజ్- ఇంట్లోంచి వెళ్లిపోయిన కావ్య- రాత్రి లెటర్ రాసిపెట్టి మరి బయటకు!

Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి అక్టోబర్ 9 ఎపిసోడ్: తాత మాట లెక్కచేయని రాజ్- ఇంట్లోంచి వెళ్లిపోయిన కావ్య- రాత్రి లెటర్ రాసిపెట్టి మరి బయటకు!

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 9 ఎపిసోడ్‌లో అప్పుకు కావ్య నిజం చెప్పేందుకు వెళ్తుంటే ధాన్యలక్ష్మీ గొడవ చేస్తుంది. కావ్య, రాజ్ వల్ల అప్పుకు ఇలా జరుగుతుందని, ఇలాగే కొనసాగితే తాము ఇంట్లో ఉండమని ధాన్యలక్ష్మీ అంటుంది. దానికి రాజ్ ఒప్పుకుంటాడు. దాంతో రాజ్‌ను కొట్టిన సీతారామయ్య నిర్ణయం మార్చుకోమంటాడు.

బ్రహ్మముడి సీరియల్‌ అక్టోబర్ 9 ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కల్యాణ్‌కు డాక్టర్ కాల్ చేస్తే.. రాజ్‌తో మాట్లాడిస్తాడు. డాక్టర్‌తో మాట్లాడిన రాజ్ కావ్యకు నిజం చెబితే ఒప్పుకోదేమోనని భయపడుతున్నట్లు చెబుతాడు. కావ్య ఐదో నెలకు దగ్గరిలో ఉందని, ఒక్కసారి ఐదో నెల వస్తే తల్లి, బిడ్డ ఇద్దరిని రక్షించలేమని, ఇద్దరిని కోల్పోతామని, వీలైనంత త్వరగా ఒప్పించండి అని డాక్టర్ చెబుతుంది.

గొడవలు జరుగుతూనే ఉంటాయ్

వదినకు నిజం చెప్పేయమని కల్యాణ్ అంటే నిజం చెప్పి తనను దూరం చేసుకునేకన్నా ఈ అబద్ధాన్ని ఇలాగే కంటిన్యూ చేసి ఎలాగైనా తనను కాపాడుకుంటాను అని రాజ్ అంటాడు. మరోవైపు అప్పు కావ్య, రాజ్ మాట్లాడింది నిద్రలో కలవరించి అరుస్తుంది. ఈ గొడవలు ఇలాగే జరగుతాయ్. త్వరగా అక్కకు నిజం చెప్పేయాలని అప్పు లేస్తే.. ధాన్యలక్ష్మీ వస్తుంది.

అక్క దగ్గరికి అంటే అవసరం లేదని, జ్యూస్ తాగమని ఇస్తుంది ధాన్యలక్ష్మీ. అప్పు ఎలా తాగను అని కావ్య గురించి అంటే.. నువ్ నీరసంగా పడిపోతే హాస్పిటల్స్ చుట్టూ తిప్పాలా. అమ్మలా చెబుతున్నాను. తాగు అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో అప్పు జ్యూస్ తాగి, ధాన్యం ఇచ్చిన ట్యాబ్లెట్స్ వేసుకుని పడుకుంటుంది. అలా అప్పు ప్రయత్నాన్ని ధాన్యం ఆపుతుంది.

బయటకు వచ్చిన ధాన్యలక్ష్మీతో రుద్రాణి పుల్లలు పెడుతుంది. నీకు అసలు వారసుడు కావాలని ఉందా. ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతుంటే ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డపై పడదా. ఎన్ని గొడవలు జరిగినా నువ్వు సైలెంట్‌గా ఉంటే నువ్ నీ మనవడి గురించి మర్చిపోవాల్సిందే. నీ ఇష్టం అని ఫిటింగ్ పెట్టి వెళ్లిపోతుంది రుద్రాణి. మరోవైపు కావ్య బాధపడుతుంటే అపర్ణ, ఇందిరాదేవి వచ్చి నచ్చజెపుతారు.

అప్పుకు నిజం చెబుతా

అప్పు పరిస్థితికి తానే కారణం అని కావ్య అంటుంది. అది నా జీవితం కోసం బెంగ పెట్టుకున్నట్లుంది. నేను విడాకులు ఇస్తున్నా అప్పటినుంచి ఇంకా భయపడిపోతుంది. ఇందాక అది వచ్చినప్పుడు దానికి నిజం చెప్పేయాలనుకున్నా. కానీ, అది ఎక్కడ కల్యాణ్‌కు చెబుతుందో అని భయపడ్డాను. ఇప్పుడు నిజం చెబుతాను అని కావ్య అంటుంది.

నా మనవడు బయటపడే సమయానికి ఇలా అంటావేంటీ అని ఇందిరాదేవి అంటుంది. నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. నేను వెళ్లి నిజం చెప్పేస్తాను అని కావ్య పైకి వెళ్తుంటి కిందకు వచ్చిన ధాన్యలక్ష్మీ కళావతిపై అరుస్తుంది. ఎందుకలా అరుస్తున్నావని ఇందిరాదేవి అంటుంది. ఈరోజు ఓ విషయం తేలాలి అని ధాన్యలక్ష్మీ అంటుంది.

ఇంట్లో జరుగుతున్న అన్ని గొడవలకు రాజ్, కావ్య ఇద్దరే కారణం. దానివల్ల ఎవరికి మనశ్శాంతి లేదు. అందుకే అప్పు ఇలా అయింది. కారణాలు ఏవైనా నా కోడలు బాధపడుతుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. నా కోడలు అని వేరు చేసి మాట్లాడుతున్నావ్. ఇది మన కుటుంబం కాదా అని అపర్ణ అంటుంది. నీకు ఏం కావాలి అని రాజ్ అంటాడు.

ఇంట్లోంచి వెళ్లిపోతాం

ఇంట్లో ఏ గొడవ జరగదనే నమ్మకం కావాలి. మీరిద్దరు మొండిపట్టు పట్టుకుని ఉన్నారు. ఇవాళ ఇదంతా తేలిపోవాలి. ఇంట్లో ఏ గొడవలు జరగడానికి వీళ్లేదు. నాకు ఇక్కడే మీ నిర్ణయాలు చెప్పాలి. లేకపోతే నా నిర్ణయం నేను తీసుకుంటాను. వీళ్లకు నా కోడలి గురించి, తనకు పుట్టబోయే బిడ్డ గురించి పట్టింపు లేనప్పుడు మనమెందుకు ఈ ఇంట్లో ఉండాలి. మనం మన కొడుకుని, కోడలిని తీసుకుని బయటకు పోదాం అని ధాన్యలక్ష్మీ అంటుంది.

దానికి అంతా షాక్ అవుతారు. ఈరోజు నాకు విషయం తేలకపోతే చేతల్లో చూపిస్తాను. చెప్పు రాజ్ మిమ్మల్ని ఉండమంటావా వెళ్లమంటావా అని ధాన్యలక్ష్మీ అంటుంది. కావ్య నా మాట వినట్లేదు. నేను కావ్య మాట వినడం జరగని పని అని రాజ్ అంటాడు. అయితే నేను ఇంట్లో ఉండటం కూడా జరగని పని. మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్లిపో అని చెబుతున్నావా అని ధాన్యలక్ష్మీ అంటుంది.

మీ నిర్ణయం అదే అయితే నేను అడ్డుపడను పిన్ని అని రాజ్ అంటాడు. దానికి అంతా షాక్ అవుతారు. రాజ్ అని లేచిన సీతారామయ్య వెళ్లి చెంప చెల్లుమనిపిస్తాడు. ఏం మాట్లాడుతున్నావురా. వీళ్లను ఇంట్లోంచి వెళ్లిపో అని చెబుతున్నావా. ఇల్లును ముక్కలు చేయాలని చేస్తున్నావా. నీ మాట వినకుంటే వెళ్లిపోండి అన్నట్లుంది. నువ్వు వెళ్తున్న దారి తప్పు అని ఇదివరకే చెప్పాను. అయినా మార్చుకోలేదు అని సీతారామయ్య అంటాడు.

ఇంట్లోంచి వెళ్లిపోయిన కావ్య

పిన్ని అనవసరంగా గొడవ చేస్తుంది అని రాజ్ అంటాడు. చేస్తారురా. ఇంట్లో ఏదైనా నచ్చనప్పుడు గొడవ చేస్తారు. కంపెనీతో పాటు ఇంటి బాధ్యతలు కూడా ఇచ్చింది చక్కదిద్దడానికి. ఎలాగోలా వాళ్లను ఒప్పించాలి. ఇంట్లో నీ వల్లే గొడవలు వస్తున్నాయని అంటున్నారు. నీ సమాధానం ఏంటీ. ఈ ఇంటి ఆడబిడ్డ కన్నీటికి కారణం అవుతున్నావ్. ఇప్పటికైనా మించిపోలేదు. నీ నిర్ణయం చెప్పు అని సీతారామయ్య అంటాడు.

ఇంటి బాధ్యతలు తీసుకున్నప్పుడే ఎవరు విడిపోకుండా చూసుకుంటానని చెప్పాను. ఇప్పటివరకు దానికోసం ఎంతో కష్టపడ్డాను. ఇప్పుడు ఇంత జరుగుతున్న నాకు బిడ్డ వద్దు అంటున్నా కూడా మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు కూడా చెబుతున్నా నాకు బిడ్డ వద్దు. మీరంతా కలిసి కళావతిని ఎలా ఒప్పిస్తారో నాకు తెలియదు. కానీ, నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు అని రాజ్ వెళ్లిపోతాడు.

రాజ్ పడుకుని ఉంటాడు. కావ్య లెటర్ రాసి పెట్టి రాత్రి వెళ్లిపోతుంది. మరుసటి రోజు ఉదయం పని మనిషి ఊడుస్తూ ఆ లెటర్ చూస్తుంది. అది అపర్ణకు ఇస్తుంది. ఇంట్లోంచి వెళ్లిపోతున్నాను అని లెటర్‌లో ఉంటుంది. నువ్వు చేసిన నిర్వాకం వల్ల కావ్య ఇంట్లోంచి వెళ్లిపోయిందని రాజ్‌ను తిడుతుంది అపర్ణ. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024