గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణి బ్లాక్‌మెయిలర్‌ను కొట్టి, పోలీసులకు పట్టించిన బాలు, గుణ.. ఊహించని ట్విస్ట్

Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణి బ్లాక్‌మెయిలర్‌ను కొట్టి, పోలీసులకు పట్టించిన బాలు, గుణ.. ఊహించని ట్విస్ట్

Hari Prasad S HT Telugu

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (అక్టోబర్ 9) ఎపిసోడ్ లో రోహిణి బ్లాక్‌మెయిలర్ ను గుణ, బాలు ఇద్దరూ కొడతారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగిస్తారు. అటు అత్త ప్రభావతికి రోహిణి ఓ అదిరిపోయే ఐడియా చెబుతుంది.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణి బ్లాక్‌మెయిలర్‌ను కొట్టి, పోలీసులకు పట్టించిన బాలు, గుణ.. ఊహించని ట్విస్ట్

గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 528వ ఎపిసోడ్ బాలు, మీనాతోపాటు రోహిణి, గుణ, ప్రభావతి చుట్టూ తిరిగింది. తన బ్లాక్‌మెయిలర్ ను భయపెట్టాలంటూ గుణ దగ్గరకు రోహిణి వెళ్లడం, ఆ తర్వాత బాలు కూడా దినేష్ ను చితగ్గొట్టి పోలీసులకు అప్పగించడం ఈ ఎపిసోడ్ హైలైట్ గా చెప్పొచ్చు.

అత్తను చితగ్గొడతానన్న శృతి.. మీనాను తిట్టిన ప్రభావతి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (అక్టోబర్ 9) ఎపిసోడ్ కిచెన్ లో శృతి, మీనా మాట్లాడుకునే సీన్ తో మొదలవుతుంది. ఆంటీ నిన్ను అన్ని తిట్టినా నువ్వు భరిస్తావు.. నేనైతే అస్సలు భరించను.. తిట్టుకు తిట్టు.. దెబ్బకు దెబ్బ ఇస్తానని శృతి అంటుంది. అవసరమైతే అట్ల కాడ కాల్చి వాత పెడతానని కూడా చెబుతుంది.

దీంతో మీనా కూడా నవ్వుతుంది. ఇదంతా బయటి నుంచి విన్న ప్రభావతి కిచెన్ లోకి రాగానే శృతి వెళ్లిపోతుంది. దీంతో వాళ్లను నువ్వు రెచ్చగొట్టి నాపైకి ఉసిగొల్పుతున్నావా అంటూ మరోసారి మీనాపై ప్రభావతి మండిపడతుంది.

దినేష్‌ను భయపెట్టాలంటూ గుణ దగ్గరికి రోహిణి

అటు తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్న దినేష్ ను భయపెట్టాలని అడుగుతూ గుణ దగ్గరికి వెళ్తారు రోహిణి, విద్య. మళ్లీ అప్పు కావాలా అని గుణ అడిగితే సాయం కావాలి.. ఒకడిని భయపెట్టాలి అంటూ దినేష్ ఫొటోలు చూపిస్తుంది రోహిణి. వీడు ఎవడు? ఎందుకు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని గుణ అడిగితే.. అవన్నీ అడగొద్దని, లేదంటే వేరే ఎవరినైనా చూసుకుంటామని రోహిణి అంటుంది.

ఎంత డబ్బు ఖర్చవుతుందని అడిగితే.. డబ్బేమీ అవసరం లేదు.. మీరు నా రెగ్యులర్ కస్టమర్లు కాబట్టి మీకోసం వాడిని ఫ్రీగానే భయపెడతాను మీరు వాడి ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లండని రోహిణి, విద్యను పంపిస్తాడు గుణ. తర్వాత దినేష్ కు ఫోన్ చేయమని అసిస్టెంట్ కు చెబుతాడు.

బాలుకు మీనా లంచ్

అటు మీనా ఇంట్లో ఎంత టెన్షన్ పెట్టిందో ఫ్రెండ్ కు చెబుతుంటాడు బాలు. ఆ దెబ్బకు రోడ్డుపై ఎవరు వెళ్తున్నా మీనాలాగే కనిపిస్తున్నారని బాలు అంటాడు. అప్పుడే అక్కడికి మీనా వస్తుంది. తాను బయటకు వెళ్తున్నానని, మీకోసం లంచ్ తీసుకొచ్చానని అంటుంది. ఫ్రెండ్ ముందే బాలును ఆటపట్టిస్తుంది. గతంలో తమకు సాయం చేసిన వారు సాయం కోరితే వెళ్తున్నానని, అందుకే చెప్పి వెళ్దామని వచ్చినట్లు లంచ్ బాక్స్ బాలు చేతుల్లో పెట్టి మీనా వెళ్లిపోతుంది.

దినేష్‌ను కొట్టిన గుణ.. పోలీసులకు పట్టించిన బాలు

అటు గుణ దగ్గరికి దినేష్ వస్తాడు. తనతో మాట్లాడాలని పిలిచారట అనగానే.. ఎవరినో బ్లాక్‌మెయిల్ చేస్తున్నావట అంటూ దినేష్ ను తంతాడు గుణ. ఆ తర్వాత గుణ, అసిస్టెంట్ కలిసి దినేష్ చితకబాదుతారు. దీంతో వాళ్ల నుంచి తప్పించుకొని దినేష్ పారిపోతాడు. బైకుపై పారిపోతుండగా అతన్ని గుణ వెంబడిస్తాడు. దీంతో అతడు మరింత ఫాస్ట్ గా వెళ్తుంటాడు.

ఈ క్రమంలో బాలు, అతని ఫ్రెండ్ బైకును వేగంగా క్రాస్ చేస్తూ దినేష్ ముందుకు వెళ్తాడు. అంతలో ఎదురుగా వస్తున్న ఓ ముసలావిడను ఢీకొడతాడు. దీంతో బాలు అతని దగ్గరికి వెళ్లి మరోసారి దినేష్ ను చితకబాదుతాడు. ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు. బాలు జరిగిన విషయం చెబుతాడు. ఇక్కడ దొంగతనం జరిగిందని మనకు ఫోన్ వచ్చింది కదా.. అది వీడే అనుకుంటా అని కానిస్టేబుల్ అనడంతో దినేష్ ను ఎస్సై అరెస్ట్ చేయమంటాడు. దినేష్ ను పోలీసులు పట్టుకున్న ఫొటోను దూరం నుంచి తీసి రోహిణికి పంపిస్తాడు గుణ. ఆ ఫొటో చూసిన రోహిణి సంతోషిస్తుంది.

ప్రభావతికి డ్యాన్స్ స్కూల్ ఐడియా ఇచ్చిన రోహిణి

ఇటు ఇంట్లో ప్రభావతి, కామాక్షి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మీనా, రోహిణి ఇంటికి వస్తారు. దీంతో మీనాను మరోసారి ప్రభావతి తిడుతుంది. నీకోసం ఎవరెవరో ఇంటికి వచ్చి వెళ్తున్నారు.. నీ ఫోన్ నంబర్ అడుగుతున్నారు.. నాకేమీ పని లేదనుకుంటున్నావా అని అంటుంది. ఇంతలో కామాక్షి కూడా కాస్త వెటకారంగా మాట్లాడటంతో ప్రభావతి కోపం రెట్టింపవుతుంది.

దీంతో ఇక నుంచి తాను నీతో కలిసి పార్లర్ కు వస్తానని రోహిణితో అంటుంది ప్రభావతి. లేదంట ఫర్నీచర్ షాప్ కి వెళ్తానని అంటుంది. ఈమెను ఎలాగైనా వదిలించుకోవాలని రోహిణి అనుకుంటూ.. అక్కడికి, ఇక్కడికి ఎందుకు, మీరే ఏదైనా సొంతంగా ప్రారంభించిండని అంటుంది. ఇదీ బాగానే ఉంది.. తాను భరతనాట్యం డ్యాన్సర్ ని అని గుర్తు చేస్తుంది ప్రభావతి.

దీంతో భరతనాట్యం డ్యాన్స్ క్లాస్ పెట్టమని రోహిణి ఐడియా ఇస్తుంది. ఇదేదో బాగుందని ప్రభావతి అనుకుంటుంది. అలాగే చేస్తానంటూ దాని కోసం కామాక్షి ఇల్లు ఇవ్వమని అడుగుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె సరే అంటుంది. క్లాసికల్ డ్యాన్సర్ అవతారంలో కనిపించిన ప్రభావతి.. క్లాస్ ప్రారంభించడానికి సిద్ధమవగా గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024