తొలివారం ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా కాంతార ఛాప్టర్ 1.. హాలీవుడ్ సినిమాలను కూడా మించి..

Best Web Hosting Provider In India 2024

తొలివారం ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా కాంతార ఛాప్టర్ 1.. హాలీవుడ్ సినిమాలను కూడా మించి..

Hari Prasad S HT Telugu

రిషబ్ శెట్టి కాంతార ఛాప్టర్ 1 ఈవారం ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. హాలీవుడ్ లో టేలర్ స్విఫ్ట్, లియోనార్డో డికాప్రియోలాంటి వాళ్ల సినిమాలను కూడా వెనక్కి నెట్టడం విశేషం.

తొలివారం ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా కాంతార ఛాప్టర్ 1.. హాలీవుడ్ సినిమాలను కూడా మించి..

‘కాంతార చాప్టర్ 1’ సినిమా విడుదలైన మొదటి వారంలో బాక్సాఫీస్ వద్ద సాధించిన అద్భుతమైన వసూళ్లు కేవలం ఇండియన్ సినిమాకే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ల డాలర్లకు పైగా వసూళ్లను అధిగమించింది. దీనికి ప్రధానంగా ఇండియాలోలో సాధించిన బలమైన కలెక్షన్లు తోడయ్యాయి. దీంతో హాలీవుడ్‌లోని కొన్ని పెద్ద సినిమాలను కూడా వెనక్కి నెట్టి, విడుదలైన మొదటి వారంలో ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది నిలిచింది.

ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన’కాంతార చాప్టర్ 1′

రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ‘కాంతార చాప్టర్ 1’ ఇండియాలో మొదటి ఏడు రోజుల్లో రూ.379 కోట్ల గ్రాస్ (42 మిలియన్ డాలర్లు) వసూలు చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, గురువారం (అక్టోబర్ 9) నాటికి దాని మొదటి ఎక్స్‌టెండెడ్ వీక్ ముగిసేసరికి.. ఇది 45 మిలియన్ డాలర్లకు (రూ.400 కోట్లకు పైగా) పెరుగుతుందని అంచనా. దీనికి ఓవర్సీస్ నుండి అంచనా వేసిన 8 మిలియన్ డాలర్ల వసూళ్లను జోడిస్తే, ‘కాంతార చాప్టర్ 1’ తొలి వారం మొత్తం వసూళ్లు సుమారు 53 మిలియన్ డాలర్లుగా ఉంటాయి.

దీని ద్వారా ఇది వీకెండ్ లో 50 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ‘టేలర్ స్విఫ్ట్: ది అఫీషియల్ రిలీజ్ పార్టీ ఆఫ్ ఎ షోగర్ల్’ను అధిగమించింది. అయితే టేలర్ కొత్త ఆల్బమ్ విడుదల సందర్భంగా ఇది కేవలం వీకెండ్ లో మాత్రమే విడుదల కావడంతో సోమవారం తర్వాత దానికి వసూళ్లు పెరగలేదు.

‘కాంతార చాప్టర్ 1’.. అటు పాల్ థామస్ అండర్సన్ దర్శకత్వంలో లియోనార్డో డికాప్రియో నటించిన ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ను కూడా వెనక్కి నెట్టింది. ఆ సినిమా రెండవ వారంలో ప్రపంచవ్యాప్తంగా అంచనా ప్రకారం 40 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. రీరిలీజ్ అయిన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ కూడా ఇదే సమయంలో 10 మిలియన్ డాలర్ల కంటే తక్కువ వసూళ్లతో వెనుకబడి ఉంది.

‘కాంతార చాప్టర్ 1’ పాన్ ఇండియా సక్సెస్

సాధారణంగా కన్నడ భాషలో రూపొందించిన ‘కాంతార చాప్టర్ 1’.. వివిధ భాషల్లో విజయం సాధించిన అరుదైన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. దీని హిందీ వెర్షన్ బుధవారం (అక్టోబర్ 8) నాటికి దేశీయంగా రూ.100 కోట్ల నెట్ వసూలు చేసింది. ఆ తర్వాత శుక్రవారం (అక్టోబర్ 10) నాటికి కన్నడ వెర్షన్ కూడా అదే ఘనతను సాధించనుంది.

తెలుగు వెర్షన్ కూడా ఇప్పటివరకు రూ.60 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో దూసుకెళ్తోంది. మలయాళం, తమిళ డబ్బింగ్‌లు రెండూ ఒక్కొక్కటి రూ.20 కోట్లకు పైగా వసూలు చేశాయి.

‘కాంతార చాప్టర్ 1’ గురించి..

రిషబ్ శెట్టి రచన, దర్శకత్వం వహించిన ‘కాంతార చాప్టర్ 1’ లో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. 2022లో వచ్చిన ‘కాంతార’ సినిమాకు ఇది ప్రీక్వెల్. ఈ చిత్రం కథ.. మొదటి సినిమా సంఘటనలకు వెయ్యి సంవత్సరాల ముందు జరుగుతుంది. విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ మూవీ తర్వాత ‘కాంతార చాప్టర్ 2’ కూడా ఉంటుందని ప్రకటించారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024