





Best Web Hosting Provider In India 2024

బ్లాక్‌బస్టర్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ వచ్చేస్తోంది.. పీఎం కాబోతున్న మహారాణి.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
బ్లాక్‌బస్టర్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మహారాణి సరికొత్త సీజన్ తో తిరిగి వస్తోంది. ఈ మచ్ అవేటెడ్ సీజన్ స్ట్రీమింగ్ తేదీని గురువారం (అక్టోబర్ 9) సోనీ లివ్ ఓటీటీ అనౌన్స్ చేసింది. మహారాణి ఇప్పుడు సీఎం పదవి వదిలి దేశాన్ని ఏలడానికి సిద్ధమవుతోంది.
ఇండియన్ ఓటీటీలోని టాప్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి మహారాణి. సోనీ లివ్ ఓటీటీలో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్.. ఇప్పుడు నాలుగో సీజన్ తో వస్తోంది. ఈ నాలుగో సీజన్ ట్రైలర్ తోపాటు స్ట్రీమింగ్ తేదీని గురువారం (అక్టోబర్ 9) మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘మహారాణి 4’ నవంబర్ 7న SonyLIVలో విడుదలవుతుందని మేకర్స్ ఎట్టకేలకు వెల్లడించారు. ఈ కొత్త సీజన్లో రాణీ భారతి పాట్నాను వదిలి ఢిల్లీ రాజకీయాలకు వెళ్లనున్నట్లు చూపించారు.
‘మహారాణి 4’ స్టోరీ ఇదే..
ప్రముఖ బాలీవుడ్ నటి హుమా ఖురేషీ లీడ్ రోల్లో నటించిన వెబ్ సిరీస్ మహారాణి. తొలి మూడు సీజన్లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ‘మహారాణి 4’ కేవలం పాట్నాలో అధికారం కోసం జరిగే పోరాటంపై మాత్రమే కాకుండా.. దేశ సింహాసనం కోసం జరిగే పోరాటంపై కూడా దృష్టి పెడుతుంది. ఈ కొత్త సీజన్ రాణి భారతి (హుమా ఖురేషి) కథను కొనసాగిస్తుంది. ఆమె బీహార్, ఢిల్లీలలో మరింత ప్రమాదకరమైన రాజకీయ వాతావరణంలో ఎలా తనదైన మార్గాన్ని ఏర్పరుచుకుంటుందో చూపించబోతోంది.
ఈ కథలో మరింత శక్తివంతమైన రాణి భారతి కొత్త రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇది ఆమె రాజకీయ ప్రయాణాన్ని కొత్త స్థాయికి తీసుకువెళుతుంది. తాజాగా రిలీజైన ట్రైలర్లో ఆమె దేశ ప్రధానికే వార్నింగ్ ఇవ్వడం చూపించారు. పీఎం నుంచి ఎదురైన అవమానంతో ఆమె ఇక ముఖ్యమంత్రి పదవి వదలి ప్రధాన మంత్రి పదవి కోసం బయలుదేరినట్లు చూపించారు.
మేకర్స్ ఈ ట్రైలర్‌ను షేర్ చేస్తూ.. “తన ఇంటిని రక్షించుకోవడానికి సింహం తిరిగొచ్చింది. రాణి తన అతిపెద్ద యుద్ధానికి సిద్ధమవుతోంది” అని క్యాప్షన్ ఇచ్చారు.
రాణి భారతి పాత్రను పోషిస్తున్న హుమా ఖురేషి ‘మహారాణి 4’ గురించి మాట్లాడుతూ.. తన ప్రయాణం ఎప్పుడూ అడ్డంకులను ధిక్కరించడం గురించే ఉంటుందని, అయితే ఈ సీజన్‌లో ఆమె ఆశయం ఒక సరికొత్త స్థాయికి చేరుకుందని చెప్పింది. “ఇది రాణి అత్యంత సాహసోపేతమైన, తీవ్రమైన, ఫిల్టర్ లేని వెర్షన్. ఆమె ఎదుగుదలను ప్రేక్షకులు చూసేందుకు నేను వేచి ఉండలేకపోతున్నాను” అని హుమా అన్నది.
మహారాణి 4 గురించి..
పునీత్ ప్రకాష్ దర్శకత్వం వహించిన, సుభాష్ కపూర్ క్రియేట్ చేసిన ‘మహారాణి 4’ లో హుమా ఖురేషి తో పాటు జాతీయ అవార్డు గెలుచుకున్న నటి శ్వేతా బసు ప్రసాద్ కూడా కొత్తగా నటించింది. ఈ నటీనటుల జాబితాలో విపిన్ శర్మ, అమిత్ సియాల్, వినీత్ కుమార్, శార్దూల్ భరద్వాజ్, కణి కుస్రుతి, ప్రమోద్ పాఠక్ వంటి అద్భుతమైన నటులు కూడా ఉన్నారు.
మహారాణి వెబ్ సిరీస్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్లు ఈ నాలుగో సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా వచ్చిన ట్రైలర్ తో వాళ్లలో ఉత్సాహం రెట్టింపైంది. మరి నవంబర్ 7 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ కొత్త సీజన్ వాళ్ల అంచనాలను అందుకుంటుందా లేదా చూడాలి.
సంబంధిత కథనం
