





Best Web Hosting Provider In India 2024

ఈ శుక్రవారం ఓటీటీలోకి వస్తున్న 6 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. మిరాయ్ కూడా..
ఓటీటీలోకి ఈ శుక్రవారం (అక్టోబర్ 10) తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. జియోహాట్‌స్టార్, జీ5, సన్ నెక్ట్స్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఇవి అందుబాటులోకి రానున్నాయి.
ఈ శుక్రవారం (అక్టోబర్ 10) అంటే మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి తేజ సజ్జ సూపర్ హీరోగా తిరిగి వస్తున్న ‘మిరాయ్’ స్ట్రీమింగ్ కానుంది. ‘మిరాయ్’ మాత్రమే కాకుండా తెలుగు సినిమా నుండి ‘త్రిబాణధారి బార్బారిక్’ కూడా రానుంది. మరోవైపు తమిళం నుంచి ‘వేడువన్’ వెబ్ సిరీస్, ‘రాంబో’ మూవీ వస్తున్నాయి. మలయాళం, కన్నడ నుండి కూడా ‘వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాస్ ఏ కళ్ళన్’ ‘మాంక్ ది యంగ్’ వస్తున్నాయి. మరి నాలుగు సౌత్ భాషల్లో వస్తున్న ఈ ఆరు సినిమాలు, వెబ్ సిరీస్ ఏవో చూడండి.
మిరాయ్ (Mirai) – జియోహాట్‌స్టార్
తేజ సజ్జ లీడ్ రోల్లో నటించిన మిరాయ్ మూవీ జియోహాట్‌స్టార్ లోకి వస్తోంది. ‘హను-మాన్’ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజ సజ్జ.. ఈ మిరాయ్ ద్వారా మరో ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ తో తిరిగి వచ్చాడు. పురాతన శక్తివంతమైన గ్రంథాన్ని ‘బ్లాక్ స్వోర్డ్’ ఎలా దక్కించుకోవాలని చూస్తాడు.. ఒక అనాథ అయిన వేద ఆ ప్రయత్నాన్ని ఎలా అడ్డుకుంటాడు అనే కథాంశంతో కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను తీశాడు. ఈ మూవీలో మంచు మనోజ్ విలన్‌గా నటించగా, శ్రియ శరణ్, జగపతి బాబు, జయరామ్, రితికా శరణ్ వంటి వారు కూడా ఉన్నారు. ఈ సినిమా ఇతర దక్షిణాది భాషల్లో కూడా విడుదల కానుంది.
వేడువన్ (Veduvan) – జీ5 ఓటీటీ
కన్నా రవి ప్రధాన పాత్రలో నటించిన తాజా తమిళ వెబ్ సిరీస్ ‘వేడువన్’. పావన్ ఈ థ్రిల్లింగ్ సిరీస్‌ను రాసి, దర్శకత్వం వహించాడు. ఒక బయోపిక్‌లో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పాత్ర పోషించే అవకాశం పొందిన ఒక నటుడి చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సిరీస్‌లో సంజీవ్ వెంకట్, శ్రవణిత శ్రీకాంత్, రమ్య రామకృష్ణ, రేఖా నాయర్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
రాంబో (Rambo) – సన్ నెక్ట్స్ ఓటీటీ
హారర్ సినిమా ‘డిమాంటే కాలనీ 2’ తర్వాత అరుళ్‌నిధి నటించిన ‘రాంబో’ అనే స్పోర్ట్స్ డ్రామా.. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. బాక్సింగ్ రింగ్‌లో అరుళ్‌నిధి ఉన్న పోస్టర్‌లో ‘అపజయం ఎరుగని’ అనే ట్యాగ్‌లైన్ ఉంది. ఈ చిత్రంలో తాన్య రవిచంద్రన్, అభిరామి వీటీవీ గణేష్ కూడా నటించారు. దర్శకుడు ముతయ్య ఈ స్క్రిప్ట్‌ను కూడా రాశారు. ఈ మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలోకి రానుంది.
త్రిబాణధారి బార్బరిక్ (Tribanadhari Barbarik) – జీ5 ఓటీటీ
ప్రముఖ నటుడు సత్యరాజ్ ఇందులో సైకియాట్రిస్ట్ శ్యామ్ పాత్ర పోషించాడు. అతని మనవరాలు నిధి కనిపించకుండా పోవడంతో, వృద్ధుడైన శ్యామ్ పోలీసుల సహాయం కోరతాడు. అయితే దర్యాప్తులో సరైన ఆధారాలు దొరకకపోవడంతో, శ్యామ్ స్వయంగా నిధిని వెతకడానికి బయలుదేరుతాడు. ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాస్ ఏ కళ్ళన్ – మనోరమ మ్యాక్స్
ఇదో మలయాళ మూవీ. ఇందులో శ్రీనాథ్ భాసి.. ప్రతాప్ పోతెన్ తో చేతులు కలిపాడు. ఒక పెద్ద భవనంలోకి దొంగతనానికి వెళ్లిన ఒక దొంగ, అక్కడ ఉన్న వృద్ధుడి కారణంగా లోపల చిక్కుకుపోతాడు. ఆ వృద్ధుడు అతన్ని ఎందుకు ట్రాప్ చేశాడు, తర్వాత ఏం జరిగింది అనేదానిని ఈ ఫన్నీ కామెడీ డ్రామా వివరిస్తుంది. ఈ సినిమాను మనోరమ మ్యాక్స్ లో చూడొచ్చు.
మాంక్ ది యంగ్ (Monk The Young) – సినీబజార్
ఇదో కన్నడ మూవీ. దర్శకుడు మాశ్చిత్ సూర్య ప్రేక్షకులను ‘రాల్దా’ విశ్వంలో జరిగే ఒక సై-ఫి అడ్వెంచర్ లోకి తీసుకువెళతారు. ఈ కాస్మిక్ వార్ లో గొప్ప శక్తులు ఢీకొనడంతో కొన్ని థ్రిల్లింగ్ సీన్స్, యాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ సినిమాలో సౌందర్య గౌడ, ఉషా బండారి సరోవర్ ఆర్ నటించారు.
సంబంధిత కథనం
