





Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:షేర్స్ కొంటానని వైరా కుట్ర-లాజిక్‌తో అడ్డుకున్న కార్తీక్-జ్యోకు అవమానం- పులుపు తిన్న దీప
కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 10వ తేదీ ఎపిసోడ్ లో తమ షేర్స్ ను వైరాకు అమ్ముతామని బోర్డ్ మెంబర్స్ చెప్తారు. మరోవైపు దీపు మామిడికాయ తినడంతో ఏదైనా విశేషమా? అని పారు అడుగుతుంది. ఆఫీస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ ఆ షేర్లు అమ్మకుండా లాజిక్ మాట్లాడతాడు. లాస్ట్ లో కార్తీక్ కు వైరా వార్నింగ్ ఇస్తాడు.
కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 10వ తేదీ ఎపిసోడ్ లో కంపెనీని నష్టాల్లో నుంచి బయటపడేసేందుకు సీఈఓగా ఓ నిర్ణయం తీసుకున్నానని జ్యోత్స్న అంటుంది. కానీ 50 పర్సెంట్ షేర్ మాది అని, షేర్స్ అమ్మేస్తున్నామని మిగతా ముగ్గురు బోర్డు మెంబర్స్ షాక్ ఇస్తారు. అప్పుడే వైరా ఎంట్రీ ఇస్తాడు. బయట కార్తీక్ ను చూసి లోపలికి వస్తాడు. మామయ్య ఎనిమి ఎందుకు వచ్చాడని కార్తీక్ అనుకుంటాడు.
కార్తీక్ ఎంట్రీ
వైరా లోపలికి రాగానే దశరథ, శివన్నారాయణ షాక్ అవుతారు. వీళ్ల పేరున ఉన్న 50 పర్సెంట్ షేర్స్ కొంటున్నానని వైరా చెప్తాడు. దీన్ని మోసం అంటారని శివన్నారాయణ అంటాడు. ఎవరి చేతిల్లో ఎవరు ఓడిపోయారో తెలిసిందే, మేం ఎవరికీ భయపడమని జ్యోత్స్న అంటుంది. మేనేజర్ వచ్చి కంపెనీ వేరే వాళ్ల చేతికి వెళ్లిపోతుందని చెప్తే, కార్తీక్ ఓ స్లిప్ రాసి తాతకు ఇవ్వమంటాడు. ఆ స్లిప్ చూసి కార్తీక్ ను రమ్మంటాడు శివన్నారాయణ.
దీప పులుపు రుచి
ఇటు కిచెన్ లో మామిడికాయ ఎంత పుల్లగా ఉందో చూస్తుంది దీప. అప్పుడే వచ్చిన పారిజాతం నెల ఏమైనా తప్పావా? అని అడుగుతుంది. ఎదుటి వాళ్ల వ్యక్తిగత విషయాలు మనకెందుకు అని సుమిత్ర వచ్చి పారుకు కౌంటర్ ఇస్తుంది. ఒకవేళ దీప నెల తప్పడం నిజమైతే మనం సెలబ్రేట్ చేస్తాం కదా అని పారు అంటుంది. దీప నీ ఆడపడుచు కోడలు కాదా? దీప నీ మేనల్లుడి భార్య కాదా? ఆ వరుసలో చూస్తే దీప నీ కూతురే. రేప్పొద్దున దీప సీమంతం నీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరుగుతుందేమోనని పారు అంటుంది.
కొన్ని ఆనందాలు మాటల వరకే. అవి నిజం కావాలంటే ఒక జీవితం సరిపోదు. ఈ రోజు గడవడానికే కష్టంగా ఉంటే ఇక రేపటి గురించి ఏం ఆలోచిస్తాం. మీరన్నది జరిగితే నేను ఆపలేను. అలాగే జరగొద్దని కోరుకోనని సుమిత్ర అనేసి వెళ్లిపోతుంది. తిను తిను మామిడికాయలు, నిమ్మకాయలు, చింతకాయలు, నారింజ కాయలు అన్నీ తిను అని పారు వెళ్లిపోతుంది.
మాజీ సీఈఓ
కార్తీక్ ఆఫీస్ లోపలికి వెళ్తాడు. మీ డ్రైవర్ ను పిలిచి ఇక్కడ జరిగిందంతా చెప్పాల్సిన అవసరం ఏముంది? బాబు డ్రైవర్ చాయ్, సమోసాతో పాటు బిస్కెట్స్ కూడా తీసుకురా అని అంటాడు వైరా. కార్తీక్ ఈ కంపెనీ మాజీ సీఈఓ అని శివన్నారాయణ చెప్తాడు. అంతే కాదు వాడు నా కూతురి కొడుకని అంటాడు. ఏం భరణి గారు? కొన్ని సంవత్సరాల క్రితం అమీర్ పేట్ లో ఓ చిన్న కాకా హోటల్ ఉండేది. అక్కడికి ఓ పెద్ద మనిషి వచ్చి టిఫిన్ చేసి ఆ హోటల్ ఓనర్ ను పార్ట్ నర్ చేసుకున్నాడు. ఆ కాకా హోటల్ మీది. మీకు పార్ట్ నర్ షిప్ ఇచ్చి భాగస్వామిని చేసింది శివన్నారాయణ అని కార్తీక్ అంటాడు.
అది క్రైమ్
మీ తాత గారు ఛాన్స్ ఇచ్చారని మీ మరదలు కంపెనీని రోడ్డుకు ఈడుస్తున్నా నష్టాలు భరించమంటారా? అని బోర్డు మెంబర్స్ అడుగుతారు. మీకు నష్టం వస్తే కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోవాలి? రూల్స్ ప్రకారం ముందు ఛైర్మన్ కు చెప్పారా? బోర్డు మెంబర్స్ లో ఎవరూ కొనమని అంటేనే బయటివాళ్లకు అమ్మాలి? శివన్నారాయణ కొనను అన్నారా? మీరు ఎవరికి అమ్ముతున్నారో ఆ మనిషి గురించి ముందే చెప్పాలి? అంతే ఓకే అనుకున్న తర్వాతే ఆ మనిషిని బోర్డు మీటింగ్ కు పిలవాలి. కానీ అలా చేయకుండా అమ్మే ప్రయత్నం చేయడం క్రైమ్. రూల్స్ ప్రకారం మీ మీద యాక్షన్ తీసుకోవచ్చని కార్తీక్ అంటాడు.
కార్తీక్ ఉంటే
ఇలాంటి అభియోగాలు వస్తే రెస్టారెంట్స్ అసోసియేషన్ నుంచి మిమ్మల్ని రిమూవ్ చేస్తారు. అప్పుడు మీరు ఎక్కడా బిజినెస్ చేయలేరు. ఈ ప్రాబ్లెమ్స్ ఫేస్ చేయాలనుకుంటే మీరు ఏమైనా చేసుకోవచ్చని కార్తీక్ అంటాడు. కార్తీక్ సర్ చెప్పినదాంట్లో లాజిక్ ఉంది కదా. కార్తీక్ సీఈఓగా ఉన్నప్పుడు లాభాలు వచ్చేవి కానీ ఇప్పుడు ఆయన లేరు కదా అని బోర్డు మెంబర్ భరణి అంటాడు.
లేడని ఎవరన్నారు? ఇక మీదట కూడా ఉంటాడు. కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నాడు. కానీ మాతోనే ఉన్నాడని శివన్నారాయణ అంటాడు. కార్తీక్ సార్ ఉంటే మాకు ఇబ్బంది లేదు. షేర్స్ అమ్మాలని లేదని భరణి అంటాడు. వైరా అరుస్తాడు. అతణ్ని కార్తీక్ బయటకు వెళ్లమంటాడు. మేం మీతోనే ఉంటాం. కానీ నష్టాలు భరించలేం. కంపెనీ లాభాలు చూడాలి. కార్తీక్ ఉంటాడని మాటిచ్చారు. మాకు ఏ భయం లేదని శివన్నారాయణతో బోర్డు మెంబర్స్ అనేసి వెళ్లిపోతారు.
వైరాతో క్లాష్
మళ్లీ తల ఎత్తుకోకుండా చేశారని జ్యోత్స్న వెళ్లిపోతుంది. కార్తీక్ కు థ్యాంక్స్ చెప్తాడు శివన్నారాయణ. వైరా షేర్స్ ఎందుకు కొనాలనుకుంటున్నాడో? కొంటే ఏం చేస్తాడో మాకు తెలుసని దశరథ అంటాడు. లీగల్ గా వాళ్ల మీద కేసు పెట్టే క్లాజ్ ఉందా అని శివన్నారాయణ అడిగితే.. లేదు తాత కాస్త భయపెట్టానని కార్తీక్ అంటాడు. కార్తీక్ కంపెనీని కాపాడాడని శివన్నారాయణ అంటాడు.
బయట కార్తీక్ తో కోపంగా మాట్లాడతాడు వైరా. లైఫ్ అనేది గేమ్ లాంటిదని వైరా అంటాడు. దశరథతో తేల్చుకోవాల్సిన లెక్కలున్నాయి, నువ్వు అడ్డుపడకు అని వైరా అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
