





Best Web Hosting Provider In India 2024

నాకు అన్నీ కామెడీ సినిమాలే వస్తున్నాయి, అలా అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసుకుంటాగా:హీరోయిన్ నిహారిక ఎన్ఎమ్ కామెంట్స్
సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ నిహారిక ఎన్ఎమ్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న తెలుగు సినిమా మిత్ర మండలి. ప్రియదర్శి హీరోగా చేసిన ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 16న మిత్ర మండలి రిలీజ్ సందర్భంగా తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ నిహారిక ఎన్ఎమ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో కామెడీ వీడియోలు, రీల్స్‌తో ఫేమస్ అయిన ముద్దుగుమ్మ నిహారిక ఎన్ఎమ్. తెలుగులో నిహారిక ఎన్ఎమ్ హీరోయిన్‌గా డెబ్యూ ఇస్తున్న సినిమా మిత్ర మండలి. ఈ మూవీలో హీరోగా ప్రియదర్శి చేశాడు. మిత్ర మండలి సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు.
నిహారిక ఎన్ఎమ్ కామెంట్స్
బీవీ వర్క్స్ బ్యానర్ మీద నిర్మాత బన్నీ వాస్ సమర్పణలో కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల మిత్ర మండలి సినిమాను నిర్మించారు. మిత్ర మండలి సినిమా అక్టోబర్ 16న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న మీడియా ఇంటర్వ్యూలో హీరోయిన్ నిహారిక ఎన్ఎమ్ చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
‘మిత్ర మండలి’ కథను ముందుగా విన్నారా? ‘పెరుసు’ కథని ముందుగా విన్నారా? మీ మొదటి చిత్రం ఏది?
-నేను ముందుగా ఈ ‘మిత్ర మండలి’ కథనే విన్నాను. కానీ ‘పెరుసు’ తమిళ చిత్రం ముందుగా రిలీజ్ అయింది. ‘మిత్ర మండలి’లో ఉండే భారీ క్యాస్టింగ్ వల్ల అందరి డేట్స్ అడ్డస్ట్ అవ్వడానికి చాలా టైమ్ పట్టింది. మొత్తానికి అక్టోబర్ 16న మా చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.
‘మిత్ర మండలి’లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
-‘మిత్ర మండలి’ చిత్రంలో నేను ఓ సాఫ్ట్ పాత్రను పోషించాను. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నాకు చాలా కంఫర్ట్ ఉంటుంది. సినిమాల్లో నటించడం చాలా కొత్తగా, ఆనందంగా ఉంది.
ప్రియదర్శితో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి చెప్పండి?
–ప్రియదర్శి చాలా మంచి వ్యక్తి. అద్భుతమైన నటుడు. ‘మిత్ర మండలి’ షూటింగ్‌లో ఉండగానే ప్రియదర్శి నటించిన ‘కోర్ట్’ చిత్రం పెద్ద హిట్ అయింది. ప్రియదర్శి ఎంత సక్సెస్ అయినా కూడా ఒదిగి ఉంటారు.
భవిష్యత్తులో ఎలాంటి పాత్రలను చేయాలని అనుకుంటున్నారు?
-నాకు అన్ని కూడా కామెడీ బేస్డ్ చిత్రాలే వస్తున్నాయి. అందుకే డిఫరెంట్ సబ్జెక్ట్‌లను ఎంచుకోవాలని చూస్తున్నాను. కామెడీ ప్రధాన చిత్రాలే అంటే నేను నా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసుకుంటాను కదా (నవ్వుతూ).
విజయం వచ్చినప్పుడు సంతోషించినట్టే.. పరాజయాలకు కృంగిపోతారా?
-నేను పరాజయాలకు ఇట్టే కృంగిపోతాను.. ఫెయిల్యూర్స్ వస్తే చాలా బాధపడతాను. అయితే వెంటనే దాన్నుంచి బయటకు వచ్చేస్తాను.
బిగ్ హీరోలతో
కాగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌గా, యూట్యూబర్‌గా నిహారిక ఎన్ఎమ్ చాలా పాపులర్ అయింది. మహేశ్ బాబు, అడవి శేష్, విజయ్ దేవరకొండ, యశ్ వంటి బిగ్ హీరోలతో ప్రమోషనల్ వీడియోలు చేసింది నిహారిక ఎన్ఎమ్.
డార్క్ కామెడీ చిత్రం
ఇక తమిళంలో నటిగా మొదటి సినిమా చేసింది నిహారిక. అదే డార్క్ కామెడీ చిత్రం పెరుసు. ఇప్పుడు తెలుగులో హీరోయిన్‌గా మిత్ర మండలి సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వనుంది ఈ బ్యూటిఫుల్ సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్.
సంబంధిత కథనం
